Aug 3, 2010

చదువు ఎలా వుండాలి ?

ఒక్క మాటలో చెప్పాలంటే-
నన్ను నన్నుగా ఉండనివ్వాలి.

నేనెవరిని?
ఒక మనిషిని.
ఆలోచన అనుభూతి - నా సహజ లక్షణాలు.

నేను నేనుగా ఉండడం అంటే -
నా సహజత్వం నేను కోల్పోకుండా ఉండడం.
నేను ఒక మనిషిలా ఊండడం.

                                                *
నేను నేనుగా ఉంటే సరిపోతుందా?
నా చుట్టూ ఉన్న నాలాంటి వారిలో నేను ఒకరిగా ఉండాలి.
ఒక వ్యక్తి నేనుగా ఉండడం ఎంత ముఖ్యమో ఒక సామాజికుడిగా ఉండడం అంతముఖ్యం.
సహజీవనంతోనే మానవ మనుగడ పరిణితి చెందుతూ వస్తోంది.
వ్యక్తి మానస చేతన ,మేధో చింతన -ఒక సంస్కరవంతమైన సభ్య సామాజికుడిగా పరివర్తన చెందడానికి ముఖ్యం.
వ్యక్తి ,సమాజం - ఈ పరస్పర సంబంధంలోనే మానవ విలువలను ఆవిష్కరించుకొంటూ వస్తున్నాం.

చదువెలా ఉండాలంటే -
వ్యక్తిలో సామాజికుడిలో వెలుగులు నింపాలి.
                                                     *

"కూటి కొరకు కోటి విద్యలు "అని తేల్చి చెప్పేశాడు మన పెద్దన్న వేమన.
"చదువది ఎంత కల్గినా రసజ్ఞత ఇంచుక చాలకున్న " అది చప్పిడి కూడు పొమ్మన్నాడు భర్తృహరి .
"...నిజమెరంగ వలయు నిది నేర్వ కున్న మూఢగతిన జేటు మూడుచుండు" అంటూ హెచ్చరించి శాస్త్రీయ దృక్పథంపై దృష్టి నిలపమన్నాడు త్రిపురనేని.
"చదువు సంధ్యలేల సంస్కృతి లేకున్న? రాతకోతలేల నీతి లేక? తెలివి తేటలేల విలువలు లేక " అంటూ చదువుకన్నా సంస్కారానికి పెద్ద పీట వేశాడు నార్ల.

ఇంతకీ, చదువు ఎలా ఉండాలి?

జ్ఞాన సముపార్జన చేసేలా ఉండాలా?
సత్యాన్వేషణకు ప్రేరణ కావాలా?
సాంకేతిక నైపుణ్యాన్ని పెంచుకొనేలా ఉండాలా?
కళాత్మకతను సృజియించుకొనేలా ఉండాలా?
లేకపోతే,
ఒక భద్రమైన జీవితాన్ని గడిపేందుకు - అవసరమైన మూల వనరులా ఉండాలా?

మనకు తెలుసు.
చదువు..
వీటి అన్నిటితోను నిండి ఉండాలి.

(26-1-07,వికాసవనం, విజయవాడ,ప్రసంగ పాఠం నుంచి కొంత)

                                       ***
 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

2 comments:

  1. మానవులుగా పుట్టినప్పటికీ మనకు కొన్ని పశు ప్రవృత్తులు ఇంకా మిగిలే ఉన్నాయి. మనలో కల ఆ పశు ప్రవృత్తిని బుజ్జగించి,నిజమెరుక పరచి మానవ ప్రవృత్తిగా మలచి ఆపై దైవత్వం వేపుకు నడిపించేదిగా ఉండాలి విద్య. ఈ మధ్యలో మన శరీర పోషణకు,కుటుంబ జీవనానికి తగిన స్థితిని, వ్యక్తిత్వాన్ని కల్పించేదిగా కూడా ఉండాలి విద్య.

    ReplyDelete
  2. mee post baagundi chandralatha gaaru.. baaga chepparu vidya ela undaalo.. naaku kooda chinna chinna pillalunnaru.. nenu kooda working, nenu kooda ilane meeru cheppinattu appudappudoo naa visugu ni valla meeda choopisthoo unta.. tharvata baadapadatha... ofcourse tharvatha bujjagistha anukondi... mee posts anni baagunnai.. chadiva ivale first time
    rajasekharuni vijaya sarma gaari comment kooda baagundi

    sailaja

    ReplyDelete