ఇవ్వాళ్టి వసుంధరలో అచ్చయినది అచ్చవగా మిగిలినది ఇక్కడ చదవ గలరు.
ప్రశ్నలు వారివి. స్పందనలు నావి.
Aug 4 (1 day ago) |
pillallo monditanam tagginchadantiki vallalni kottadam sarina panena?
పిల్లలు మొండి వాళ్ళుగా పిలవబడుతున్నారంటేనే , అప్పటికే వారి సున్నితత్వానికి ఎదురుదెబ్బలు బాగానే తగిలాయన్న మాట!
అందరు పిల్లలు ఒక్కలాగానే ఉన్నా ప్రతి ఒక్కరు ఒక ప్రత్యేకమైన నేపధ్యాలలో పెరుగుతారు.
ఎవరికి వారు తమ పిల్లలకు మంచి గృహ వాతావరణాన్నే
అందించాలని ప్రయత్నిస్తుంటారు. అయినప్పటికీ , పిల్లల మొండితనం ,పెద్దల చేతివాటం నిత్యసాదృశ్యాలు.
అందించాలని ప్రయత్నిస్తుంటారు. అయినప్పటికీ , పిల్లల మొండితనం ,పెద్దల చేతివాటం నిత్యసాదృశ్యాలు.
తెలిసని అనుకొనే వారు మొక్కై వంగనిది మానై వంగదని చేతికి పని చెపితే ,తెలియని వారు వారి అడుగుజాడల్లో నడుస్తూ ఉంటారు.నిజానికి మునుపటికన్నా పిల్లలపెంపకంలో తల్లిదండ్రులకు అవగాహన పెరిగింది. కాని, నానాటికీ ఇరుకున పడుతున్న నాగరిక దైనందిక జీవితం ఆటుపోట్లకు , కలిగె నిరాశానిస్పృహ లను భరించే క్రమంలోని వత్తిడి,ఆ దరిమిలా రగిలే కోపతాపాలను ..పిల్లలపై గుమ్మరిస్తున్నారు.పిల్లల భవిష్యత్తును గురించిన బెంగ, వారినైపుణ్యాలను తీర్చిదిద్దే ప్రయాస, పిల్లల ఇష్టాఇష్టాలను నియంత్రించే నిరకుశుల్లా మార్చేస్తున్నది.
"పిల్లలు అడిగినవన్నీ తీరిస్తే ఇక అయినట్లే "అని పెదవి విరిచే వాళ్ళొక విషయం గుర్తు ఉంచుకోవాలి.పెద్దలు అడిగినవన్నీ కూడా పిల్లలు తీర్చలేరు.
పెద్దలం కోరినట్లుగా పిల్లలు ఉండాలని శాసిస్తున్నాం. పిల్లలు కోరినట్లుగా పెద్దలు ఉండాలని మనం గ్రహించలేక పోతున్నాం.
పెద్దలం పిల్లల ఎదుగుదలకు సహకరించే వారమే కాని శాసించేవారం కాము. మంచీచెడుల విచక్షణను నేర్పలేక పోయినపుడు , ఆ పెద్దల శిక్షణకు అర్ధం లేదు.విషాదం ఏమంటే , తమకు ఏది ఇష్టమో ,ఏది కాదో తెలియచెప్పలేని స్థితో పిల్లలు ఎదుగుతునారు.
దానికి తోడు, తల్లిదండ్రుల నుండి భయబ్రాంతులు తప్ప స్నేహాభిమానాలు అందక పోతే , మార్గదర్షకులు కావలసిన అమ్మానాన్నలే ,మార్గం మూసేస్తున్నట్లు!
ఇక, పిల్లలు ఉక్కిరిబిక్కిరి కాక ఏమవుతారు? తల్లిడండ్రులపై అభిమానం లేనిదే , సభ్య సామాజికులను ఎలా గౌరవిస్తారు? ఇంటి కలతల మధ్య, చీకాకుల మధ్య తల్లిదండ్రుల అయిష్టతల మధ్యన పెరిగిన ఒక పిల్లవాడు హిట్లర్ కాక మరేమవుతాడు?
అందుచేత, పిల్లలు మొండి వాళ్ళుగా తయారంటే, పెద్దలు తమ ప్రవర్తనను పరీక్షించుకొని , తమ వ్యవహారశైలిని సరిదిద్దుకొనే ప్రయత్నం చేయాలి ముందు! ఆ తరువాత పిల్లల ప్రవర్తన సహజంగానే ఆ మార్పు ప్రతిఫలిస్తుంది.
sunnitamga valla bhavalani gouravinchadam sadyama?
సాధ్యం.
అమ్మానాన్నలలో పిల్లలను పిల్లలుగా ఎదగానివ్వాలన్న స్పృహ ,చేతనా ఉండాలి. పిల్లలు తమ ఇంటి గారాబు బిడ్డలే కారు సభ్య సామజికులుగా ఎదగ వలసిన వారన్న మౌలిక సత్యాన్ని వారు అనుక్షణం గుర్తుంచుకోవాలి.
అడిగినవన్నీ అవుననడం లేదా ఔనంటే కాదనడం .. ఇలాంటి ఏకపక్ష వ్యవహారం అభిలషణీయం కాదు.
పిల్లలు సర్వస్వతంత్రులు . వారిని స్వేచ్చగా ఎదిగే అవకాశాలు కల్పించడం పెద్దల బాధ్యత.. అంతే కాదు, ఆ స్వేచ్చ కు గల పరిమితులను పిల్లలకు అవగాహన అయ్యేట్లు చేయ వలసిందీ పెద్దలే. అక్కడిక అసాధ్యం అన్న మాటకు తావే లేదు.ప్రయత్న లోపం తప్ప.
could u pls tell me any two examples?
ఉమ్మడి కుటుంబాలలో ఎదిగిన పిల్లలలో ఒకరు కళ్ళురిమితే మరొకరు చేరదీసే వారు. ఒకరు కోప్పడితే మరొకరు ఎందుకు
కోపపడవలసి వచ్చిందీ వివరణ ఇచ్చేవారు.
ఇప్పుడు అమ్మానాన్నలే ఈ రెండు బాధ్యతలను నిర్వర్తించాలి. అప్పట్లో ఉన్న తీరిక ఇప్పుడు లేదు.పైనుంచి తలకు తట్టేడు సమస్యలు .వత్తిళ్ళు. సమస్యల్లో ఒక సమస్యగా పిల్లలను భావించే వాళ్లు మనకు తరుచూ కనబడుతుంటారు.
సమస్య పిల్లలు కారని ,వారిని సమస్యగా భావించే వారేనని మనం గుర్తించాలి. మారుతున్న తరం , వారి అవసరాలు, వత్తిళ్ళు ,సవాళ్ళు ,వాటిని అధిగమించడానికి కావలసిన విచక్షణ .... పిల్లలకు రావాలంటే , వారిని వారుగా ఎదగనివ్వడమే ఒకే ఒక్క మార్గం!
<వసుంధర" వారికి ధన్యవాదాలతో.>
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
పిల్లల పెంపకంపై మీ ఆలోచనలు చలం భావాలకు దగ్గరగా ఉన్నాయి! వీటిని ఆచరించటానికి ఉన్న పరిమితులనూ, తల్లిదండ్రుల నిస్సహాయతనూ కూడా మీరే చెప్పారు. మీరన్నట్టుగా ‘వారిని వారుగా ఎదగనివ్వడమే ఒకే ఒక్క మార్గం!’ కానీ, అది ఇప్పుడున్న సమాజంలో సాధ్యమవుతుందని పెద్దగా ఆశించలేం.
ReplyDelete