Mar 31, 2014

Genesis ఆరంభం


 “ Why do I feel so optimistic?
    I have nothing. 
    I am an ordinary person, a tiny part of this nature.
   So what!  Don’t I have boundless energy within?”         
  (Drushyadrushyam, Novel,2003)
***
I am a Telugu (1) writer, born in a village between two rivers (2), perhaps, I am a person who draws inspiration from the village within.
I am a writer and I am a woman. I have experienced  the politics of gender like any other Indian woman but, it’s my writing abilities that helped me to stand up and express myself.
Nature, women and children walk with me in my silent pursuit.
 I understand that ,
Being a writer is a humble expression of  being myself.
Being a writer challenged me to reflect on the diverse situations I was never aware of earlier. I had to think multiple times and  very closely. I have to be  cautious about the usage of each and every word.
Being a writer  developed  sensitivity in my outlook  and greatly demanded my inner strength. I am often expected to live larger than life. I have compromised beyond necessary and  tried to understand the human relations more than needed.
Being a writer  ,I had to think multiple times and cautious about each and every word. It sensitive   my out look and often demanded inner strength. I am expected to live larger than life. compromised beyond necessary. Tried to understand relations more than needed.
I had to walk an extra mile. Climb the tallest hill around and humble down to the lowest possible.
My suffering, agony and pain were more than reality and my understanding ultimately concluded in conflict with the patriarchal hegemony.
This conflict is not only with is not merely with the system around me ,my family, my culture but, it was within me. My constant struggle inner struggle raised multiple questions within ,demanded  more clarity ,challenged my abilities ,put forwarded my limitations ,realized my strength .My clear urge for  the change and the comfort I eventually visualized ,is humbly expressed in my fistful of words.
Most of the times overlook or ignore the habitual expressions of patriarchal traits. But, it concluded in more conflict. I feel terribly sad about the people who are lost in their “gentlemen closet” and who miserably fail to realize the human subtleties and eventually losing access to the normal, simple and beautiful life .In a way , I tried to explore the humanness in those lost souls as Poet Vemana rightly said, “Punya purusha “among men is always different!
I have observed the  popular confusion in the acceptance of my  simultaneous existence as a writer and  a woman .This confusion may be rooted in the blurred definition of  the subjectivity of the writer and the objectivity of the writing .
The suppression and the biased outlook of the society was very subtle and creative.
I came across angry call outs ,” You writer !’
And disgusting and unpleasant  references in unbelievable tones “ You .. being a woman ...!”
I think, being a writer is my expression of internalized identity crisis and being a woman is an externalized quest for humanness.
The story I am going to present today ,is written and published in 1994. In this early writing ,I tried to express the glimpse of  the deep rooted cultural discrimination of “being a girl child “.
This story, ”Genesis” is originally published in Telugu with the title “ఆరంభం “ which is translated by Dr.Sujatha Gopal and published in “ Muse India . “

The translated story can be found here :

http://www.museindia.com/viewarticle.asp?myr=2007&issid=13&id=671

Related link :   http://chandralata.blogspot.in/2014/03/blog-post_10.html

***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

క్షణం ..క్షణం ..అనుక్షణం !!!

క్షణమొక యుగం ఒకరికి.
యుగమొక క్షణం ఒకరికి.

కాలవిభజన
మనిషిదా?
మనస్సుదా?

ఎవరికి తోచిన తీరున వారు సాగుతుండగా..
కాలానికి తోచిన తీరున కాలం సాగుతుందిగా?

నిదానించి ,నిమ్మళంగా
సాటిమనిషి ఊసులడగను ..
కాలమేమైనా మానవ జన్మ ఎత్తిందా?

జయం... జయం.. దిగ్విజయం !
క్షణం ..క్షణం ..అనుక్షణం !!!
ఉగాది శుభాకాంక్షలు.

తథాస్తు!!!

***
(ఈ నునులేత కొబ్బరి పూత ఓ ఉషోదయాన నా కంట బడింది.
 కాకినాడ జె ఎన్ టి యు ఇండోర్ స్టేడియం వద్ద.

1 మార్చి,2014 )

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Mar 30, 2014

లక్కసీళ్ళ సంచుల్లో.. !

హమ్మయ్య!
పరీక్షలయిపోయాయి!

భయం, కోపం,
వత్తిడి,అసహనం,
ఉద్రేకాలు,

నకలు చీటీలు,గుసగుసలు,
"చే"బదుళ్ళు,చూచిరాతలు,
ఉద్వాసనలూ,

కళ్ళనీళ్ళు,పొర్లు దండాలు,
బతిమిలాటలు, సెంటిమెంట్లు,
ఉద్వేగాలు,

క్షమాపణలు మన్నింపులు
బెదిరింపులు, బతిమిలాటలు,
ఉపశమనాలు,

జలుబులు జ్వరాలు
వాంతులు  వడదెబ్బలు
ఉపచారాలు,

మంచీ మర్యాద,
హక్కులు బాధ్యతలు,
ఉపదేశాలు

హమ్మో ... పరీక్షంటే ..
ఇంత తతంగమా !

హమ్మయ్య!
పరీక్షలయిపోయాయి!

పరీక్ష రాయడానికి కాదండీ...
పరీక్షలు పెట్టడానికి వెళ్ళొచ్చాను...
అదీను,
ఒక ఊరి చివర బడికి.

రేకుల షెడ్డు .మిట్టమధ్యాహ్నం.
కరెంటుకోత,చెమటలధార
యంత్రాంగం ఎత్తులుచిత్తులు !

పరీక్షల నిర్వహణ
ఓ కఠిన పరీక్షే!

నిలబడి చేయాలంటే !
నిలబెట్టేలా చేయాలంటే!


హమ్మయ్య!
పరీక్షలయిపోయాయి!

***
మరి ,
లక్కసీళ్ళ సంచుల్లో..
బ్యాంకులాకర్లలో, పోలీసుకస్టడీల్లో,
కళాశాల యంత్రాంగం పర్యవేక్షణలో ..
సురక్షితంగా భద్రం చేయవలసిన ...
ప్రాణదాతల పరీక్షాపత్రాలు
ఆ వంతన చేజారిపోయాయంటే ,
యంత్రాంగం మంత్రాంగం ఏమిటో ..
స్పష్టంగానే తెలిసిపోతోంది.
కదండీ!

***
ఓ మారు ,ఎంసెట్ వ్యవహారాల గురించి మాట్లాడుతూ ఉండగా, ఉన్నతవిద్యామండలి డైరెక్టరు  ,ప్రొ. సి. సుబ్బారావుగారు అన్నమాట గుర్తొస్తున్నది.
"కోట్ల రూపాయల వ్యాపారానికి మేమొక పరీక్షాపత్రం సమర్పించుకొంటున్నాం ! " అని!
***
హతోస్మి!

***


( ISC బోర్డు వారి సూపర్ వైజింగ్ ఎక్షామినర్ గా, పన్నెండవ తరగతి వారికి పరీక్షలు నిర్వహించడం జరిగింది.)



All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Mar 23, 2014

YOUTH CONVENTION


SWAMI VIVEKANANDA’s 150TH BIRTH ANNIVERSARY CELEBRATIONS



YOUTH CONVENTION
(24.03.2014,         Mon Day)

Theme: Transforming Youth to Transform India
Programme
               9.30 am                      -           Registration
              9:45AM:                     -           Welcome (Cultural Program)
            10.00 am                     -           Welcoming Guest to the Dias
            10.05 am                     -           Inaugural session - Lighting of 
The Lamp & Offering flowers to Swamiji’s Portrait
            10.10 am                     -           Introducing Theme   - Swami Bodhamayanandaji
            10.55 am – 11.20 am  -           Tea Break
11.10 am                     -           Cultural Programme
            11.20 am                     -           Talk by Swami Bodhamayanandaji
                                                            Topic: Transforming Youth – Vivekananda way
            12.05 pm                     -           Talk by  Chandra Latha          
                                                                Topic:  Diversity  - Contemporary Challenges
            1.00 pm – 2.00 pm     -           Lunch
            2.00 pm                       -           Cultural programme
            2.15 pm                       -           Mind games
2.30 pm                       -           Talk by Swami Raghunayakananda                                                                                                   Topic: Success formulas
3.15 pm                       -           Question and Answer
4.00 pm                       -           Feedback from the Students
            4.30 pm                       -           Vote of Thanks

Speakers:

Swami Bodhamayananda,
Director, Vivekananda Institute of Human Excellence, Ramakrishna Math, Hyderabad
Prof Sathyanarayana, SV University ,Tirupati
Swami Raghunayakananda,Publication In charge, Ramakrishna Math, Hyderabad
Chandra Latha, Writer ,Nellore


Conducting of the Programme :
CV Bhaskar , Principal, VR College,
ROL.Sarma garu, RamaKrishna Math ,Hyderabad.
Chandra Latha ,Prabhava, Nellore .



***



All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Mar 10, 2014

అగ్గి .. మొగ్గ..బుగ్గి !

" అగ్గిలోన దూకి
   పూమొగ్గ లాగ
   తేలిన నువ్వు
    నెగ్గేవమ్మా ..
    ఒక నాడు! "
 Stepping into Ravindra Bhavan with Ms. Adilaxmi garu

With Amarendra Dasari garu and Dr.JL Redy garu



"అగ్గిలోకి ..దూకడమెందుకు? మొగ్గలా తేలమనడం ఎందుకు? "
"మొగ్గేమిటి? బుగ్గే! అహ.. కాదు కాదు బొగ్గే!"
"దారుణం"
"అంటే? ఇప్పుడు ఓడానా?"
"ఊరుకోండి సార్ మరీను! నిప్పురాజేసిందీ తమరే ... దూకమని చెప్పిందీ తమరే..పైనుంచి.. మొగ్గ లా తేలు , నెగ్గి చూపు అని .. ఎగెష్ట్రా అస్సైన్ మెంటులు..భలేవారే తమరు! వాళ్ళ మానాన వాళ్ళని బతకనిద్దురూ!"
"ఒకరు బతకమంటే బతికేది ..వద్దంటే మానేది కాదు కదా స్వామీ , బతుకంటే?"

***
భగ్గుమన్న ఈ ఆలోచనా స్రవంతికి అడ్డుకట్ట వేయక పోతే .. ఎలా?
ఇకనైనా .. ఇక పైనా...
నేనంటే ...?
అన్న ప్రశ్నకు మానవమర్యాదతో, తమకి తాము ,
మహిళలు సమాధానం ఇచ్చుకొనే  మంచిసమయం కోసం ప్రయత్నిద్దాం. ప్రయత్నిస్తూనే ఉందాం.
Genesis :Story Reading Onlooker Chandana Negi (Punjabi)

***
అగ్గిలోన దూకనూ.
తెలిసో తెలియకో దూకినా...
అగ్నిశిఖనే అవుతా కానీ..!!!
***
"రచయిత్రిని అవ్వడం ..స్త్రీని అవ్వడం"
కేంద్ర సాహిత్య అకడెమి వారి కార్యక్రమంలో ..
బుద్దిగా కూర్చుని ,
అందరి మాటలు విన్నాక,
రగిలిన ఆలోచనలేనా ఇవి ?!?
నాలో నలిగిన నాలుగు మాటలూను!
***

Sahthya academy secretary, K.Srinivasa Raogaru, Kali for women ,Urmila Bhutalia ,Ramnika singh



Dr.Jl Reddy garu, Dasari Amarendra garu.
Full house !



.
With Ms. Madhavi Sampath Kumar garu and Amaredra Dasari garu

Mar 5, 2014

కొంత మంది కుర్రవాళ్ళు...!

నిజం.
ఒక్కోరోజు అక్కడ లేచిన విస్తళ్ళు పదిహేను వేల పైచిలుకే!
పదివేల మందికి పైగా పిల్లలు, వారి అమ్మానాన్నలు ,ఉపాధ్యాయులు.
నిర్వాహకులు,నిర్ణేతలు.అతిథులు,వెరశి ..." క్రియ బాలోత్సవ్ 2014 -కాకినాడ"నిర్వాహకుల అంచనాలను మించిపోయారు.
రెండో రోజున కూరలు నిండుకొంటే, అప్పటికప్పుడు బూందీ తో కూర వండి పెట్టారు.వేడి వేడిగా!
వంటలో వడ్డనలో అందరూ చూపిన నేర్పూ సమయస్పూర్తి మెచ్చుకోవలసిందే!

ఏ కార్యక్రమాన్నైనా సంఖ్యాపరంగా ఎందుకు అంచనా వేస్తారో ,వారి వారి కారణాలు వారికుండచ్చు కానీ,
ఇక్కడ నాకు రెండు విషయాలు కడుపు నింపాయి.
చిన్న చిన్న వూళ్ళ నుంచి , కొద్ది పాటి  స్థితిగతులతో , గుప్పెడు అక్షరాలతో పాటు ,  బోలెడంత సృజనాభివేశాన్ని కలిగి ఉన్న ఈ పిల్లలు, వారిని ప్రోత్సహించాలని వారి బాధ్యతలను భుజాన వేసుకొని, చేతనయినంతగా కొద్దోగొప్పదైనా తమ తమ సొంత  ఖర్చులతో , ఇక్కడి దాకా విదార్థులను వెంటతీసుకు వచ్చిన వారి ఉపాధ్యాయులకు జేజేలు.

మనలో మాట . అంతమంది పిల్లలు ఒక్కచోట చేరితే, ఓ పది బెత్తాలయినా విరక్కుండా ఉంటాయంటారా?
మీరే చెప్పండి.
Photo:Majunadh Padala
పిల్లల్లో అల్లరి పిల్లలు, కొంటె కోణంగులూ ,ఉండరామరి?
అసలే అల్లరి వారి జన్మ హక్కు కదా?

Photo:Manjunadh Padala
మరి ఇంతటి కార్యక్రమాన్ని, నిశ్శబ్దంగా నిబద్దతతో నిర్వహించిన పెద్ద మనుషులు ఎవరయ్యా అంటే,  క్రియ నిర్వాహకులకు చేదోడు వాదోడుగా నిలిచిన JNTU ప్రస్తుత మరియు పూర్వ విద్యార్థులు. వారు ఏర్పాటు చేసుకొన్న సమైఖ్య అన్న సంస్థాను.
ఈ యువతీయువకులంతా, అంత మంది పిల్లలను వారి వెంట ఉన్న పెద్దలనూ , ఎంత గౌరవంగా అభిమానంగా చూసారో చూసి తీరవలసిందే. విసుగూ విరామం లేకుండా, రెండు రోజుల పాటూ ఎంతో ఇష్టంగా , హాయిగా చేసారీ కార్యక్రమాన్ని.
వారి JNTU ప్రాంగణాన్ని రెండు రోజులు పిల్లలకు అప్పజెప్పడమే కాకుండా,  వారి శక్తియుక్తుల్న్నీ సమర్ధతను సమయాన్ని సంతోషంగా పిల్లలపరం చేశారు ఈ యువబృందం!
ఈ తరం వారు బాధ్యతలెరుగని వారని ఎవరనగలరు?
చూడండిలా !
అంతేనా,
ఈ పునర్నిర్మాణ దశలో , హృదయం ముక్కలుచెక్కలయిన వేళ, ఈ సానుకూల దృష్టీ సృష్టీ ఎంతటి ,తెరపినిచ్చిందో మాటల్లో చెప్పలేం!
రేపటి పట్ల అపారమైన విశ్వాసమూ ,గొప్ప నమ్మకమూ కలగవా మరి?
Photo:Manjunadh Padala
ఆ పిల్లల్లో ఎంత మంది,పెద్దయ్యాక ఈ అన్నయ్యల్లాగా అక్కయ్యల్లాగా తిరిగి ఈ ప్రాంగణం లోకి అడుగుపెట్టాలన్న చిట్టికలలతో తిరిగి వెళ్ళారో కదా!
ఇక,
ఈ యువబృందం దేశవ్యాప్తంగా వచ్చిన విద్యార్థులు .
వారి "క్రియా"శీలత,  కార్యదక్షత  సానుకూల దిశలోనే ప్రభవిల్లాలని ఆశిద్దాం.
అందరం.
అంతవరకూ  చెపుదాం..
ఆ పిల్లలకూ ఈ యువతకూ..
"క్రియ" వారికీ "సమైక్య" వారికీ...
జేజేలు!
***
ఇందులోని ఫోటోలు , కర్ణాటక నుంచి వచ్చిన మేనేజిమెంట్ విద్యార్థి మంజునాథ్ పడాల తీసినవి.
వీరంతా వారిలోని క్రియశీలతనూ కార్యదక్షతనూ ఎంత చక్కగా ఎంత అందంగా ప్రకటించుకున్నారో చూస్తున్నారు కదా?

Photo: Chandra Latha

Photo: Manjunadh Padala

Photo : Manjunath Padala
డా.వాసిరెడ్డి రమేశ్ గారు, కొత్తగూడెం, "క్రియ" జగన్ గారు, నిర్ణేతలూ, "తెలుగులో మాట్లాడుదాం"(Lto R)
Photo:Chandra Latha
Photo: Manjunadh Padala
Photo:Manjunadh Padala






Photo: Chandra Latha
Photo: Chandra Latha
Photo:Chandra Latha
Photo:manjundh Padala
Photo Chandra Latha

Photo:Chandra Latha 

Photo:Chandra Latha