Mar 5, 2014

కొంత మంది కుర్రవాళ్ళు...!

నిజం.
ఒక్కోరోజు అక్కడ లేచిన విస్తళ్ళు పదిహేను వేల పైచిలుకే!
పదివేల మందికి పైగా పిల్లలు, వారి అమ్మానాన్నలు ,ఉపాధ్యాయులు.
నిర్వాహకులు,నిర్ణేతలు.అతిథులు,వెరశి ..." క్రియ బాలోత్సవ్ 2014 -కాకినాడ"నిర్వాహకుల అంచనాలను మించిపోయారు.
రెండో రోజున కూరలు నిండుకొంటే, అప్పటికప్పుడు బూందీ తో కూర వండి పెట్టారు.వేడి వేడిగా!
వంటలో వడ్డనలో అందరూ చూపిన నేర్పూ సమయస్పూర్తి మెచ్చుకోవలసిందే!

ఏ కార్యక్రమాన్నైనా సంఖ్యాపరంగా ఎందుకు అంచనా వేస్తారో ,వారి వారి కారణాలు వారికుండచ్చు కానీ,
ఇక్కడ నాకు రెండు విషయాలు కడుపు నింపాయి.
చిన్న చిన్న వూళ్ళ నుంచి , కొద్ది పాటి  స్థితిగతులతో , గుప్పెడు అక్షరాలతో పాటు ,  బోలెడంత సృజనాభివేశాన్ని కలిగి ఉన్న ఈ పిల్లలు, వారిని ప్రోత్సహించాలని వారి బాధ్యతలను భుజాన వేసుకొని, చేతనయినంతగా కొద్దోగొప్పదైనా తమ తమ సొంత  ఖర్చులతో , ఇక్కడి దాకా విదార్థులను వెంటతీసుకు వచ్చిన వారి ఉపాధ్యాయులకు జేజేలు.

మనలో మాట . అంతమంది పిల్లలు ఒక్కచోట చేరితే, ఓ పది బెత్తాలయినా విరక్కుండా ఉంటాయంటారా?
మీరే చెప్పండి.
Photo:Majunadh Padala
పిల్లల్లో అల్లరి పిల్లలు, కొంటె కోణంగులూ ,ఉండరామరి?
అసలే అల్లరి వారి జన్మ హక్కు కదా?

Photo:Manjunadh Padala
మరి ఇంతటి కార్యక్రమాన్ని, నిశ్శబ్దంగా నిబద్దతతో నిర్వహించిన పెద్ద మనుషులు ఎవరయ్యా అంటే,  క్రియ నిర్వాహకులకు చేదోడు వాదోడుగా నిలిచిన JNTU ప్రస్తుత మరియు పూర్వ విద్యార్థులు. వారు ఏర్పాటు చేసుకొన్న సమైఖ్య అన్న సంస్థాను.
ఈ యువతీయువకులంతా, అంత మంది పిల్లలను వారి వెంట ఉన్న పెద్దలనూ , ఎంత గౌరవంగా అభిమానంగా చూసారో చూసి తీరవలసిందే. విసుగూ విరామం లేకుండా, రెండు రోజుల పాటూ ఎంతో ఇష్టంగా , హాయిగా చేసారీ కార్యక్రమాన్ని.
వారి JNTU ప్రాంగణాన్ని రెండు రోజులు పిల్లలకు అప్పజెప్పడమే కాకుండా,  వారి శక్తియుక్తుల్న్నీ సమర్ధతను సమయాన్ని సంతోషంగా పిల్లలపరం చేశారు ఈ యువబృందం!
ఈ తరం వారు బాధ్యతలెరుగని వారని ఎవరనగలరు?
చూడండిలా !
అంతేనా,
ఈ పునర్నిర్మాణ దశలో , హృదయం ముక్కలుచెక్కలయిన వేళ, ఈ సానుకూల దృష్టీ సృష్టీ ఎంతటి ,తెరపినిచ్చిందో మాటల్లో చెప్పలేం!
రేపటి పట్ల అపారమైన విశ్వాసమూ ,గొప్ప నమ్మకమూ కలగవా మరి?
Photo:Manjunadh Padala
ఆ పిల్లల్లో ఎంత మంది,పెద్దయ్యాక ఈ అన్నయ్యల్లాగా అక్కయ్యల్లాగా తిరిగి ఈ ప్రాంగణం లోకి అడుగుపెట్టాలన్న చిట్టికలలతో తిరిగి వెళ్ళారో కదా!
ఇక,
ఈ యువబృందం దేశవ్యాప్తంగా వచ్చిన విద్యార్థులు .
వారి "క్రియా"శీలత,  కార్యదక్షత  సానుకూల దిశలోనే ప్రభవిల్లాలని ఆశిద్దాం.
అందరం.
అంతవరకూ  చెపుదాం..
ఆ పిల్లలకూ ఈ యువతకూ..
"క్రియ" వారికీ "సమైక్య" వారికీ...
జేజేలు!
***
ఇందులోని ఫోటోలు , కర్ణాటక నుంచి వచ్చిన మేనేజిమెంట్ విద్యార్థి మంజునాథ్ పడాల తీసినవి.
వీరంతా వారిలోని క్రియశీలతనూ కార్యదక్షతనూ ఎంత చక్కగా ఎంత అందంగా ప్రకటించుకున్నారో చూస్తున్నారు కదా?

Photo: Chandra Latha

Photo: Manjunadh Padala

Photo : Manjunath Padala
డా.వాసిరెడ్డి రమేశ్ గారు, కొత్తగూడెం, "క్రియ" జగన్ గారు, నిర్ణేతలూ, "తెలుగులో మాట్లాడుదాం"(Lto R)
Photo:Chandra Latha
Photo: Manjunadh Padala
Photo:Manjunadh Padala






Photo: Chandra Latha
Photo: Chandra Latha
Photo:Chandra Latha
Photo:manjundh Padala
Photo Chandra Latha

Photo:Chandra Latha 

Photo:Chandra Latha

1 comment:

  1. WoW and beautifjl .No boundaries for children to showcase theirtalent . Real good effort by Samaikhya. Nicely written by you Chandralatha.

    ReplyDelete