Showing posts with label కొత్త పుస్తకం. Show all posts
Showing posts with label కొత్త పుస్తకం. Show all posts

Sep 24, 2015

పఠన విలాసం !

ప్రతి ప్రయాణం ఒక కొత్త స్పూర్తి !
 ఈ సారి కథ కోసం ప్రయాణం.
చాన్నాళ్ళ  తరువాత, హాయిగా కాళ్ళు జాపుకొని, వెచ్చటి  అల్లం తేనీరు గుటకలు వేస్తూ, కమ్మటి చిట్టిగారెలు రుచి చూస్తూ..పుస్తకం చదువుకొంటూ …. అబ్బో... ఓ కలలా ప్రయాణం!
పుస్తకం వేగంగా ముందుకు సాగుతోంటే, చెట్లూ పుట్టలూ ,స్తంభాలు ,స్టేషన్లూ మరింత వేగంతో వెనక్కి పరిగెడుతున్నాయి. మైళ్ళకొద్దీ దూరం. పుటల్లో మటుమాయం.


 అయితే, ఆ పుస్తకమేమో,  పెను నిద్దరను , నిద్దరలో అదాటున పలకరించే కలలను వదలగొట్టి,నిటారుగా కూర్చోబెట్టి మరీ,  జీవనాంత గమనాల అంతిమమజిలీలో తారసపడే తప్పనిసరి సంధర్భాలని విడమరిచి చెప్పినది.
చివరికి జరిగేదేమిటి ?  ఈ మానవ జీవన ప్రయాణానికి సహజ అంతిమ పరిణామం ఏమిటి? ఎప్పుడు మొదలవుతుంది ? ఎప్పుడు గ్రహింపుకు వస్తుంది? ఎన్నడు ముగింపు కు వస్తుంది?
మనిషి అత్యంత ఉత్సాహభరితం గా ఆరోగ్యవంతంగా చైతన్యదీప్తమైనట్టుగా  కనబడే నడి వయస్సు , ఈ మానవ శరీరంలో ఈ అంతిమ యాత్రకు నాంది పలుకుతుందా?  ఈ జీవనయాత్ర చివరి అంకం ఎంత దాకా సాగుతుంది? ఎప్పుడు గమ్యం చేరుతుంది?   ఈ ప్రశ్నలన్నిటికీ ఒక సూత్రబద్దత ఉన్నదా? సహజత్వము సంభవమేనా?
ఎక్కడ ఇలాంటి ఎన్నెన్నో సున్నితమైన సందేహాలకు మరింత సున్నితంగా , వైద్య పరిభాషను నా బోటి వాళ్ళకు వొలిచిపెట్టి చెపుతూ సాగినది.
వృత్తి ధర్మంగా నిత్యమూ మరణాన్ని ప్రకటించే వైద్యుడి మానవ స్పందన ఇది.
ఆఖరి ఘడియల్లో మానవ మర్యాదను, హుందాతనాన్ని , గౌరవాన్ని నిలపడం ఎలా? అన్న ప్రశ్న అతనిని తొలిచి వేస్తుంది.  ఆఖరి మజిలీలో చిట్టచివరి ప్రయాణంలో, మనిషికి తోడయి నిలిచే దేమిటి? వినపించే జీవన ధ్వనులేమిటి ?
మానవ స్పర్షలేని ప్రాణవాయువు గొట్టాలా? మానిటర్ల హెచ్చరికల లయ లా?
మన వైద్య పరిజ్ఞానమంతా , జీవన ప్రయాణ అంతిమ ఘడియల్లో ఎలా జీవించామన్న దిశగా సాగాలి. ఎలా మరణించామన్న విషయం కోసం కాదు. ఈ నాడు మనకున్న వైద్య సాంకేతిక నైపుణ్యాలు, సౌకర్యాలు ఏ మాత్రం సానుకూలంగా లేవు. మానవ మర్యాదను నిలబెట్టేట్టుగా లేవు. అన్నది ఈ వైద్యుడైన  రచయిత ఆవేదన.
ఆఖరి ఘడియలను నలుచదరపు గదిలో నలిగిపోనీయకుండా నలువైపులా కిలకిలారావాలు వినిపిస్తే ఏమవుతుంది ?. గాజు  గదిలో మరణశయ్యపై వంటరి తనపు నిర్వేదంలో మగ్గి పోనీయకుండా , 
మరింత  మర్యాదగా మనిషిని సాగనంపలేమా? నొప్పి, బాధ ,దుఃఖం ,ఒక్క సారిగా కళ్ళ ముందు విప్పుకొన్న గడిపివచ్చిన జీవితం అన్నీ ముప్పిరిగొనగా .. ఆ మనిషిని ఆధునిక వైద్యం ఉపశమనాన్ని ఇస్తోందా ? మరణం గురించి  మాట్లాడకుండా , మరింత మభ్య పెడుతోందా?  జీవన గమనాల అంతిమమజిలీలో తారసపడే తప్పనిసరి సంధర్భాలని , నిశ్శబ్దంలోకి నెట్టేస్తున్నామా .అశక్తులమై.
 రచయితలో వేళ్ళూనుకొన్న ఈ ఆలోచనలకు మూలం టాల్స్ టాయ్  " ద డెత్ ఆఫ్ ఇవాన్ ఇలియిచ్" నవల . ఆకస్మాత్తుగా మంచాన బడిన ఇలియచ్ చిట్టచివరి రోజులనూ ఘడియలనూ .. భిన్న దృష్టితో చూడడం మొదలు పెడతాడు. తను, తన జీవితం, మానవ సంబంధాలు, దృక్పథాలు .. వీటన్నిటి విశ్లేషణ కన్నా.. మించిన అంశాన్నేదో అనుకోకుండానే అన్వేషిస్తాడు. ఇలియచ్ మరణంలో తన జీవితం తారసపడుతుంది.
తన వారిలోనూ, తన వృత్తివ్యాపకాలలోనూ మరింత అన్వేషణ జరిగింది. ఆ అంతర్మధనం ఫలితమే ఈ”Being Mortal, Medicine and What matters at the End ” పుస్తకం. 
భిన్న సాంస్కృతిక నేపథ్యాలతో అతుల్ కు ఉన్న సాన్నిహిత్యం మరింత లోతైన అవగాహనను అద్దింది.
చదివి చూడండి. 
సావకాశంగా.
అంబులెన్స్ సైరన్లు ..మానిటర్ల బీప్ ల మధ్య పక్షుల కిలకిలారావాలు వినండి.గంగలో అయిన వారి అస్తికల నిమజ్జన అలజడిలోని నిశ్శబ్దాన్ని వినండి.  
సావధానంగా! 
 ***
ప్రయాణం పూర్తి కాక మునుపే పుస్తకం ముగింపుకు వచ్చింది.
ఒక ఉలికి పాటుతో.
అల్లం తేనీరు సమయానికి అంది వచ్చింది !

***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

May 19, 2014

చిటుక్కు పటుక్కు

వేమన పద్దెమునకు ఎదురు పద్దెము లేదు. 
రామలచ్చుమనులకన్నా రాజు లేరు.
సతీపతికన్న సంగాతి లేదయ్యా.
విశ్వదాభి రామ వినుర వేమా !


ఇదేదో నేను ఆశువుగా అల్లేనని
మోసపోయేరు సుమా !
 ఎంత ధైర్యం  ! వేమననే  కాపీ  జేస్తావా అని కళ్ళెర్ర జేసేరు !!

ఎవరికి వారు వేమన పద్యాలు కట్టుకొని,
 హాయిగా పాడుకొంటున్నారట.
 పదికాలాల పాటుగా.
హోసూరు.... తెల్లకొక్కర్ల తెప్పంలో !

 చిటుకు పటుక్కు చెనిక్కాయలు ...
అబ్బే కాలక్షేపం పల్లీలు కావండీ..
పొరుగు బతుకు వెతలు..
ఎర్నూగు పూలు,మొరుసునాడు కతలు,ఇరులదొడ్డి బతుకులు, తొండనాడు కతలు .. .
అంతేనా  ఎనిమిది వందల ఏళ్లనాడు ..
కృష్ణను వదిలి హోసూరు చేరిన కి.రాజనారాయణ గారి , గోపల్లె.
ఇన్ని పుటల్లో వాళ్ళ బతుకుల్ని పరిచారు.

ఓ మారు తొంగి చూడండర్రా అని పిలుపులు పంపారు...
అవును...  మన జతగళ్ళు కత గాళ్ళూ.

హోసూరు కు మీరెంత దూరమైనా.. హోసూరు మీ ముంగిట్లోకి వస్తోంది.

                                                                                            నా మాట నమ్మక పోతే ,
                                                                                           మీ పుస్తకాల అంగట్లో అడగండి !

           ఇ-దుకాణమో ఏ దుకాణమో!

                            ***




All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Aug 25, 2013

యథా ....తథా....

ఇష్టం లేనప్పుడు...
నష్టం జరిగినప్పుడు ...
కష్టం కలిగినప్పుడు ...
మనం...
మాములు మనుషులం...
ఏమవుతున్నాం?
కిట్టప్ప పంతులు ఏమంటున్నారంటే...

Keelu Bommalu (Telugu)"వెనుకటి కవులు పద్యపాదం పూర్తి కాకపోతే ఎలమిన్,ధరిణిన్,చూడన్ అనీ,యతి స్థానంలో అయితే దీవ్యత్ ,శుంభత్, స్ఫాయత్ వగైరాలు వాడుతూ ఉండేవారు.నేడు రాజకీయ నాయకులు సాంఘిక సమస్యలను పరిష్కరించలేక పోయినప్పుడు  ఆర్డినెన్సులు,అరెస్టులు,లాటీ చార్జీలు  ,నిర్బంధాలు ప్రయోగిస్తున్నారు.రెండూ అసమర్దతనే వ్యక్తం చేస్తాయి.
 కళాధర్మాన్ని బట్టి మొదటిదీ,జీవితధర్మాన్ని బట్టి రెండవది దూష్యం. విజ్ఞులకు రెండూ సహించరానివే.
 అయితే రెండోది మరీ దుర్భరం.ఎందుకంటే ,మొదటిదాన్నుంచి తప్పించుకోవచ్చు. ఇష్టంలేనప్పుడు పుస్తకాన్ని విసిరిపుచ్చుకొని అవతల పారేస్తాము.
రెండోది అలా కాదు. ఇష్టం కాని ప్రభుత్వాన్ని వదిలించుకోవడం ప్రాణాంతకమే కానీ మరొకటి కాదు. 
అయితే ప్రజాస్వామిక దేశాల్లో ఇష్టం కాని ప్రభుత్వాలను వదిలించుకోవచ్చును కదా అనిపించవచ్చును.కాని ఇటీవలి చరిత్ర చూస్తే అంతా దుర్భ్రమలాగా కనిపిస్తున్నది. "

."కీలుబొమ్మలు"  (1951) ,జి.వి. కృష్ణా రావు

"The poets of the past used words that were not entirely meaningful as fillers,either at end of the line or in the gaps of the poem's structure. just to adhere the to the rules of  prosody.Likewise today's politicians when unable to solve problems,administer ordinances,make arrests,order lathi charges and arrange judicial custody.In both prosody and politics these are expressions of incompetence: from an aesthetic point of view the first ,and from law of life the second are reprehensible. the wise find both intolerable but the later is more disgusting because escape from the former is possible.If we don't like  a book we can toss it away.the later is different. To try and get rid of a distasteful government is short of fatal.It may appear that unpopular governments can be dislodged in democratic countries.But an examination of recent history proves how illusory the possibility is."

Puppets (1951) G.V.KrishanRao
Translated by D.Kesava Rao
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Aug 23, 2011

షోరాపూర్ కీ రాణీ

బహుశా ఆమె  తన ఏడేళ్ళ బిడ్డను పరాధీనం కాకుండా చేసి ఉంటే ,
మరో ఝాన్సి కీ రాణి అయి ఉండేదేమో..

బహుశా అతను పట్టుబడకుండా ఉంటే ,
మరో తాంతియా తోపే అయి ఉండే వాడేమో..

అతనిలోకి దూసుకుపోయిన ఆ తూటా ,
 యాదృచ్చికం కాదేమో....

జాతకాలు, మూఢనమ్మకాలు,అంధవిశ్వాసాలు...
ఆనాటి  అరాచకప్రభుతలో ..
పరప్రభుస్వామ్యాలకు రాచబాట వేసాయేమో....'

మీరే  స్వయం గా చదివి చూడ మనవి.

http://pustakam.net/?p=7990
***
ఒక్కోసారి ఊహిస్తే వింతగా తోస్తుంది.
ఏడాది పొడవునా ఎండ. చెమట.వేడిమి.ఉడక.ఉక్కబోత.
చిరచిర.గరగర.
అలాంటి ఈ ట్రంక్ రోడ్డు మీద ఆ దేశంకాని దేశం నుంచి వచ్చిన వాళ్ళు,
ఎర్రటి అంగీలు నల్లటి పంట్లాము తొడుక్కొని ..తోలు బూట్లలో పాదాలను బంధించి...
గుర్రాలపై ఎలా ఈ దండుబాటపై ఎలా ఊరేగే వారబ్బా...ఈ ఉడకకు ఊపిరే ఆడదే.. ఉక్కిరిబిక్కిరి అవరా మరి?” ..
అని.
మరి రాజ్యం వీరభోజ్యం అన్నారు కదా...
వీరుల వీరత్వం గురించి పక్కనబెట్టండి.
హంగు ఆర్భాటం గురించి.....
......మిగిలింది  పుస్తకం.నెట్  లోనేనండి.....




All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Jun 8, 2011

వాళ్ళు ...వీళ్ళు ...పారిజాతాలు !

నమస్తే, 
ఇలా మొదలైన పారిజాతాల కథ ఎలా సాగిందో మీరే స్వయంగా చదివి చూడండి.
తీరిక దొరికినప్పుడు. 
ఈ నెల చతుర నవల , 
నాదో చిన్న ప్రయత్నం, 
విషయ సేకరణలో సహకరించిన పాలన గారికి పాణిని గారికి ధన్యవాదాలు.
స్నేహంతో ,
చంద్ర లత 

   వాళ్ళు వీళ్ళు పారిజాతాలు 
*  నవల  *         చంద్ర లత
***
వాళ్ళు
విరిసీ విరియని ఉదయం.
తూరుపు తీరం.  
ఎదిగీ ఎదగని పట్టణం.
ఎనభై దశకం ముడుచుకొనే వేళ. 
తొంభైలలోకి విచ్చుకొనే తరుణం.

తెలతెల్లవారే లోగానే ,నీలు అక్కడికి చేరుకొంది.
గబగబ వెళ్ళి గోడవారగా నిలబడింది. నిదానంగా చుట్టూ చూసింది.
ఇంకా ఎక్కడా ఎవరూ బయలు దేరిన అలికిడి లేదు. 
.................
హమ్మయ్య" నీలు కులాసాగా నిట్టూర్చింది. "ఈ పూట పూలన్నీ తనవే" ఎదురుగా ఉన్న గోడవైపు చూపు సారించింది.
జెండావీధి మలుపులో ఉన్న ఆ ఇంటిగోడకు ఒక ప్రత్యేకత ఉన్నది.
ఎత్తైన ఆ ఇటుకల గోడ మీదుగా ఆర్చీలను కనబడనీయకుందా..గేటుమీద దాకా ..విస్తరించిన పారిజాతం చెట్టొకటి ఉన్నది.
ఆ గేటు తలుపులు ఎప్పుడూ ఇనపగొలుసుతో కట్టేసి ఉంటాయి. దానికి తోడు తుప్పుపట్టిన పెద్దతాళం.మనుషులున్న అలికిడి ఉండదు కానీ, ఉన్నారన్న నిదర్షనం గా అప్పుడప్పుడు ఆ గేటుకున్న చిన్న వాకిలి మూసితెరుచుకుంటూ ఉంటుంది.
‘బయటకే ఇంత చెట్టుందంటే, లోపలి వైపున ఎంత ఎదిగి ఉందో..ఆ ఇంటి వారు అదృష్టవంతులు!’
...................


తొలికిరణాల తాకిడికి తట్టుకోలేవేమో అన్నట్లు,ఆ చెట్టు చుట్టూ అలవోకగా వాలి పోయే పారిజాతాల కోసం పిల్లలంతా పోటీలు పడతారు. ఇవ్వాళ నీలు వంతు.
తన పొడుగు లంగా కుచ్చిళ్ళను పైకెత్తి ,నేల మీద గొంతుకూర్చుంది.అడుగేస్తే పూలు అణిగి పోతాయేమో నని,మునివేళ్ళ మీదే ముందుకుజరుగుతూ ,నేలకంటా వంగి,ఒక్కో పూవునూ భద్రంగా ఏరుకొని.. గుప్పిట్లో దాస్తోంది.నిండిన గుప్పిట ను, తెరిచి పెట్టిన కంపాసు బాక్సులోకి వంపుతోంది.
తెల్లటి పూవు.నారింజ కాడ.
రాత్రంతా పరిమళాలు వెదజల్లి అలసి పోయాయేమో, అయినా నిగారింపు తగ్గలేదు. నిగడదీసుకొని నిమ్మళంగా చూస్తున్నాయి.
గోడమీదా.. నేల మీదా.. రోడ్డు చివర వంకరటింకర తారుమీదా..అక్కడకడా తలెత్తిన కంకర మీదా..
వెల్లకిలా .నింగిని చూస్తూ..పకపక నవ్వుతూ పలకరిస్తూ..
పారిజాతాలు.
నీలు గుండెల నిండా ఊపిరి పీల్చి వదిలింది.
ఏ పూటకాపూట  ఆ పారిజాతాలు  ఆమెని ఎంతగా ఊరిస్తున్నాయో! 
.................................
(చతుర ,జూన్ 2011  సంచిక)


All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Sep 22, 2010

సిరా సేజ్జెం

పొలమంతా సిరా చల్లి, అక్షరాలు నాటేసి, కథన సేద్యం చేస్తే ... అక్కడ మొలకెత్తేది ఆనందమా?ఆవేదనా? ఆందోళనా? ఆక్రందనా?
ఖచ్చితంగా అవి అన్నీ కలగలసిన.. మొలకలపల్లి గారి ” సేజ్జెగాడు” కథాసంకలనం అయి ఉంటుంది !
అవునండి.
 తెలుగునాట ప్రత్తిరైతులు పురుగుమందును కడుపులో దాచుకొని మన ఓటమిని తమదిగా దిగమింగిన విషాద నేపధ్యంలో , మొలకలపల్లి గారు నవలీకరించిన ఆ”ఆక్రందన” మనలను ఇంకా వెన్నాడుతూనే ఉండగా, 
ఇదుగో ఇప్పుడు పదిహేడు కథల రూపంలో రైతుల జీవితశకలాలను “సేజ్జెగాడు”వెంట తీసుకొచ్చింది.
బతక లేక బడుగు రైతు ..అనుకునే ఈ రోజుల్లో..ఈ కథలు మనకు మరో మారు బతుకు తీపిని పరిచయం చేస్తాయి.
రైతులంటే చిన్నచితకా రైతులు కాదండోయ్ ! 
మోతుబరులు!
మోతుబరులంటే అలాంటిలాంటి మోతుబరులు కాదండోయ్!
 అక్షరాలా అయిదెకారాల ముప్పై సెంట్ల మోతుబర్లు !
అవునండీ, పండిన పంటను ఉన్న ఊళ్ళో అమ్ముకోక , మార్క్ ఫెడ్ కు వెళితే మంచి ధర వస్తుందని ఒక రైతు, పట్నానికి పయనమాయ్యాడు. వాళ్ళావిడ ఎత్తిపొడుపులను మెత్తగానే వారిస్తూ” పండిన పంటని పీడాకారం అనుకుంటే ఎట్టే ?” అంటూ.
శీతలగిడ్డంగులకు చేరిన సరుకు అక్కడే ,పడి ఉండగా, ఎగుమతుల ఆంక్షలు తొలింగింప జేసేందుకు కృషి చేస్తున్నామని, అనుమతులు ఇప్పించేస్తామంటూ మంత్రివర్యుల వాగ్దానదాసులవుతూ , మార్క్ ఫెడ్ ఫారాలను చేత బట్టుకొని , పదారు “సంతకాలు” సేకరించి అందుకై ఉన్న నాలుగు రాళ్ళు కరగదీసి, చివరాఖరకు తెలిందేమిటయ్యా అంటే, ఈ రైతు గారు మోతుబరి అని!
ఎలాంటెలాంటి మోతుబరి..? అక్షరలా 30 సెంట్లు అధికంగా ఉన్న మోతుబరి.
“అందులో మూడున్నరెకరాలే పంటేసాను. మిగిందంతా సవ్వనేల ” అంటూ ఆ రైతు నెత్తీ నోరు కొట్టుకొని ఏమి ప్రయోజనం? మోతుబరి మోతుబరే! లెక్కలో తేడాల్లేవిక్కడ!
ఇక, అటూ ఇటూ చెడిన ఆ రైతు కు చివరికి మిగిలేదేమిటి?
గుక్కెడు పురుగు మందా? మూరెడు ఉరి త్రాడా?
మార్క్ ఫెడ్ మాయాజాలమై పోతే , వ్యవసాయం ఎత్తుభారం అయి పోదా?
ఇంతకీ , సదరు రైతుగారు పండించేదేమిటి?
శనగలు, కందులు,మినుములు,పెసలు, వంగ, చివారఖరకు ..వద్దనుకుంటూనే , మళ్ళీ, ప్రత్తి!
విత్తనాలు,సత్తవ మందులు, పురుగు మందులు,కూలిడబ్బులు , వీటన్నిటి కోసం చేసిన బాకీలు, ఇక, ఆ “వడ్డీతొ వడగళ్ళ గుర్రం కూడా పరిగెత్త లేదంట!”
ఆ పై, పల్లెలో మార్కెట్లో వ్యాపారుల మాయాజాలం లో రైతు చిక్కి విలవిలాడి పోక తప్పదు కదా?
” తనని ప్రేమించి లాలించి అనురాగం పంచీ మమకారం పెంచుకొన్న తన గారాల పుత్రుడి అవసరానికి కాకుండా, తన ఫలం ఎక్కడికో పరాయి ఇంటికి ,పరాయి చోటుకి ,పరాయి అవసరానికి పోతున్నందుకు నేలతల్లి కంట తడి “పెట్టుకున్నదట! కన్నబిడ్డ ఆరోగ్యం ఫణంగా పెట్టిన నిస్సహాయ స్థితిలో , భర్తతో పాటు పొలంలో రెక్కలు ముక్కలు చేసుకున్న” దొడ్డ ఇల్లాలు మల్లీశ్వరి “ఏం చేస్తుంది? ” పమిట చెంగుతో కళ్ళు తుడుచుకుంది!” (కోత)
ఎహోషువా రూతమ్మలను ఒకసారి పలకరించి చూడండి. మన పొలం వొట్టిపోవడానికి కారణాలు తెలుస్తాయేమో!
ఎహోషువా మట్టి మర్మమెరిగిన సేజ్జెగాడు. కోల చేతబట్టి కొండ్ర వేశాడంటే ,పంట చాళ్ళలో విరగపండి, ఫక్కున నవ్వినట్లే.ఎద్దులను అదిలించాడంటే , ఇక ఆ ఊరి పురులు పొంగిపొర్లినట్లే. 
తెల్లారి  లేచిన దగ్గరనుంచి ,పొద్దు వాలే వరకూ , అతను చేసిన సేజ్జెం ..రూతమ్మ కడుపు నింపిందా కట్టుకోకలిచ్చిందా ..ఊహు .. చివరకు ..బోరవిరుచుకు తిరిగిన ఆ సేద్యగాడు, అతనితో పాటు రంకెలేసుకు తిరిగిన ఆ ఒంగోలు జాతి గిత్తలు .. ఒక్క ట్రాక్టరు దెబ్బకు ..కాలంలో కలిసిపోవలసి వచ్చింది.
“ఆ పాణం ఉన్న వాటికన్నా లేని వాటితోనే సుఖం రా! చీకూచింతా ఉండదు.ఎద్దులమేతకి ఎంత ఖర్చవతందీ? పని ఉన్నా లేకున్నా మేత తప్పదాయే! లెక్క జూసుకుంటే ఎద్దులసేజ్జం అందదురా,ఎనకటిరోజుల్లో ఎట్టా జేసారో కానీ..” అని ఊళ్ళోని రైతులన్నప్పుడు ఎహోషువా చెపుతాడు కదా”
“ ఎద్దులు గాట్లో ఉంటేనే గాదెలు నిండి పోతాయి గదా కాపా ! ఎద్దులకి వేసే మేత చూశావు కాని ,వాటి పేడ చాలు.బంగారం పంట పండడానికి ! వాటి పేడ ఎంతో సత్తవ కదా కాపా! మనకి ఎంత నయ్యిదిబ్బ తేలిద్దీ?బస్తాల ఎరువులు ఏమొస్తన్నయి..పురుగులు వస్తన్నయి,తెగుళ్ళు వస్తన్నయి,ఖర్చులు ఎక్కువ అవతన్నయి,చివరికి దిగుబళ్ళూ రావడం లా! ”
అదేంటి ఎహోషువా నోట అత్యాధునిక ఆర్గానిక్ ఫార్మింగ్ ,సస్టైనబుల్ అగ్రికల్చర్ లాంటి భావజాలం …అలా దొర్లిపోతున్నది?
అవునండి . ఆ పొలం తనది కాదు. ఆ అరక తనది .ఆ కాడెద్దులు తనవి కావు. కానీ, తరతరాలుగా సేజ్జేగాళ్ళగా బతికిన ఆ ఎహోషువ అనుభవం లోంచి వచ్చిన మాటలవి.రెక్కలకష్టం నమ్ముకున్న ఎహోషువ పట్నం దారి బట్టాడు. అతని మాటలు పెడ చెవిన పెట్టిన ఆ ఊరి రైతాంగం గుక్కెడు విషం పట్టారు!
మరి రైతులన్న దానిలోనూ వాస్తవమున్నది . చూడండి, కాడెద్దులు జతయితే .తమరెక్కలకష్టం తోడయితే , ఉన్న ఎకరం నేల తమను గట్టెక్కిస్తుందని , గంపెడంత ఆశతో బ్యాంకుకు అప్పుకు పోయిన  ఓ రైతు ,చివరకు ఆ వడ్డీ తీర్చడం కోసం ఆ ఎద్దులు,అరక, బండి,ఎకరం నేల అమ్ముకొని ,కుటుంబమంతా కూలిపనికి మళ్ళాల్సిన వైనం ,”బతుకు తనఖా” లో చదవండి!
ఇక, పల్లెటూరి పందాలు ,గెలుపుఓటములు, ఎత్తిపొడుపులు ,వేళాకోళాలు ,గడపదాటని గౌరవమర్యాదలు,పల్లెదాటని మాటపట్టింపులు, చిన్నరైతుల “కలలపంట” ఫేగుతీపి” పిల్లల చదువులు, ఆసుపత్రి ఖర్చులు, ఆడపిల్లలకట్నాలు ,అల్లుళ్ళ అరణాలు, కొడుకుల కొత్తపోకళ్ళు, కూతుళ్ల స్వతంత్రభావనలు, కోడళ్ళ కరకరలు,
తలకొరివిపెట్టాల్సిన కొడుకుతో తలపగలకొట్టించుకొని తలవాల్చుకొని నిల్చునే తండ్రులూ,
 చెల్లెలి కట్నంసొమ్మును ఆస్తిలో తన వాటాగా చెల్లుబెట్టి వ్యాపారంలో పెట్టుబడిగా మార్చేసుకొనే అన్నాయి,
నచ్చిన వాడితో నడిచివెళ్ళే చదువుకొన్న అమ్మాయిలు , 
భర్తతో పాటు కష్టమూ నిష్టూరం భరాయించే దొడ్డ ఇల్లాళ్ళు , 
అవసరమైతే ,భద్రకాళులై “ఈ సారి పైకి రా..నరికి పారేస్తా! మొగోడంటనే పేద్ద మొగోడు ! ఆడదాన్ని కొట్టడమా మొగోడితనమంటే ?” అంటూ గర్జించే శాంతమ్మలూ..
అందరికీ అన్నిటికీ అంతఃసూత్రంగా ఆ ఎకరం నేల!
'అర్రుగొర్రు పొలం, మందళ్ళలో జొన్నపైరు '…లాంటి పల్లెగడపలోంచి  పలికే కమ్మని తేట తెలుగు పదాలు పలుకుబళ్ళు తియ్యని గుమ్ముపాలు తాగిన అనుభూతిని ఇస్తే, 
కడుపులో కెలికే కన్నపేగు మెలికలు, చర్రున నసాళానికెక్కే కోపమూ ,అన్నీ తెలిసీ ఏమీ చేయలేని నిరాశా, నేలనమ్ముకొని నలిగిన బతుకులు ,
అన్నిటినీ నడిపించే ఆ ఆర్ధిక మంత్రం రాజకీయ తంత్రమై... కుతంత్రమై ..
రైతు మెడకు చుట్టుకుంటున్న  , ఆ వైనాలన్నీ ఈ కథల్లో చదివాక, 
కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరగకపోతే చూడండి.
పొలంలో నాట్లేస్తూనో , నాగలి దున్నుతూనో ,కలుపు తీస్తూనో,కల్లాం చేస్తూనో, పైటేళ బువ్వ తింటూనో , మాపటేళ మననం చేసుకొంటూనో, 
ఆ రైతన్న మొలకలపల్లి ,పలికిన అచ్చమైన బతుకు కథలివి. ఆ రైతు బతుకులోని అగరు ..వగరు.. పొగరు ..ఎవరికి వారు స్వయంగా రుచి చూడవలసిందే.
అన్ని కష్ట నిష్టూరాలనూ ఓర్చి ,
” ఎల్ల కాలం దండగలు పడతాం ఏందీ? అట్టా పొలంలో ఎప్పుడూ దండగలు పడే పనయితే దేశంలో ఎవడూ పొలం జేయడు.ఇక జనం అంతా ఏం తిని బతుకు తారు ? కొట్టిన అమ్మే పెట్టక మానదు.ఇయ్యాల కాకపోతే రేపైనా వానలు కురవకాపోవు,పొలం పండకాపోదు!”
అన్న ఆశాభావంతో తమను తాము ఓదార్చుకొని , 
మళ్ళీ అరక పట్టి సేజ్జెం మొదలెట్టే .. 
ఆ అన్నం పెట్టె చేతులకు నమస్కారం .
ఒక పాఠకురాలిగా రచయితకు అనేక ధన్యవాదాలు

*
( పుస్తకం .నెట్ వారికి ధన్యవాదాలు)

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Sep 20, 2010

ఒక చిత్రం



మడత పేజీ పుస్తకావిష్కరణ. 
డా. ఆనంద స్వరూప్ గారు, వీవెన్ గారు, డా. మంజులత గారు,
 " మా గోదావరి " కొండవీటి సత్యవతి గారు, అబ్బూరి చాయా దేవిగారు, చంద్ర లత
*

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Sep 11, 2010

అందరికీ ఆహ్వానం.







ఒక కప్పు కాఫీ.
కాసిన్ని కబుర్లు .
ఒక పుస్తకావిష్కరణ
మనమందరం .
ఇంతింత .
మరికొంత.



సమాలోచన

డా. గద్దె  ఆనంద్ స్వరూప్ గారు ,
గణిత శాస్త్రజ్ఞులు ,బ్లాగురచయిత, బ్లాగ్మిత్రులు,
మెల్ బోర్న్ ,ఆస్ట్రేలియా
డా. ఆవుల మంజు లత ,
 పూర్వ ఉపాధ్యక్షులు ,తెలుగు విశ్వవిద్యాలయం
 శ్రీమతి  కొండవీటి సత్యవతి గారు, 
“మా గోదావరి”,బ్లాగు రచయిత,సంపాదకులు ,భూమిక.
 శ్రీ వీవెన్ గారు,
             లేఖిని రూపశిల్పి, కూడలి నిర్వాహకులు,e-తెలుగు స్థాపక సభ్యులు.

                                        అందరికీ ఆహ్వానం.
                                 ప్రత్యేక కార్యక్రమం
శ్రీ వీవెన్ గారు  తెలుగును తెరకెక్కించడంలోని 
మెళుకువలను ,ఉపకరణాలను , బ్లాగు నిర్వహణను
ఇతరేతర e- తెలుగు సమాచారాన్ని అందిస్తారు. 
మరికొందరు  e - తెలుగు మిత్రులతో పాటు.
మీ  సాంకేతిక పరమైన సందేహాలు,సంశయాలను వారు వివరణలు ఇస్తారు.
మరి మీరు వచ్చేటప్పుడు వీలైనన్ని ప్రశ్నలను వెంటపెట్టుకు రండి ! 
మర్చిపోకుండా!
మీ ప్రశ్నలను ముందుగానే 
 prabhava.books @ gmail.com  కు పంపగలిగితే మరీ మంచిది.
సమయం:

19 సెప్టెంబర్,ఆది వారం
ఉదయం 10:00 గంటల నుంచి 
స్థలం:
సుందరయ్య విజ్ఞాన కేంద్రం ,బాగ్ లింగంపల్లి  , హైదరాబాద్
ఫోన్ :27667543
*


 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Jan 27, 2010

ఇంత జరిగాక కూడా,


ఇంత జరిగాక కూడా,బిటి వంకాయను భారతదేశంలోకి అనుమతిస్తే,అది స్వతంత్ర భారతదేశ చరిత్రలో జరగబోయే అతి పెద్ద విషాదం.
డా.పి.ఎం. భార్గవ 

పొగాకు వలన క్యాన్సర్ వస్తుందని గ్రహించడానికి దశాబ్దాలు పట్టింది.జన్యుమార్పిడి పంటల దుష్పరిణామాలను గ్రహించడానికి పుష్కర కాలాలు పట్టవచ్చు.
డా.షెరిలిని


నా దృష్టిలో బిటివంకాయలో ఎక్కువ సమస్యాత్మకమైన అంశం .. ఎంపిక చేసుకొనే స్వేఛ్చ లేకపోవడం. 
డా.ఆరి సీతారామయ్య

ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది.బిటి జన్యుమార్పిడి తరువాతి గురి-వరి! డా.పాణిని  

మనం ఇప్పుడు ఆపలేక పోతే, ఎప్పటికీ ఆపలేం! చంద్రలత

Jan 24, 2010

వచ్చే దారెటు

వంగతోట కాడ, అన్నీ ప్రశ్నార్ధకమే!
వచ్చే దారెటు
   



పుస్తక ఆవిష్కరణ
పుస్తకం :వచ్చే దారెటు
రచన: చంద్ర లత
ప్రచురణ : ప్రభవ, నెల్లూరు
తేదీ: ఈ నెల 29, శుక్రవారం సమయం : సాయంత్రం 6 గంటలకు   స్థలం : సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీ హాల్.,బాగ్ లింగం పల్లి ,హైదరాబాద్
ఆవిష్కర్త మరియు ముఖ్య వక్త :డా.పి.ఎం .భార్గవ
"డా భార్గవ గారు Center for Cellular and Molecular Biology ,CCMB ,Hydrabad వ్యవస్థాపకులు , పూర్వ అధ్యక్షులు .బిటి వంకాయ విషయంపై GESE పై ప్రత్యేక నిపుణ పర్యవేక్షకులుగా సుప్రీంకోర్టు చేత నియమించ బడిన వారు."
 సభాధ్యక్షులు :   డా.కె.శివారెడ్డి ,ప్రఖ్యాత కవి,    
       కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు గ్రహీత.
పుస్తక సమీక్ష:    వోల్గా , ప్రముఖ రచయిత్రి. 
విషయ సమీక్ష:    తెలకపల్లి రవి,ప్రజాశక్తి,జర్నలిస్ట్
కార్యక్రమ నిర్వహణ :  వాసిరెడ్డి నవీన్,ఎడిటర్, కథాసాహితి
*
వంగతోట కాడ, అన్నీ ప్రశ్నార్ధకమే!
ఆ వివరాలేమిటో ఆ వివాదాలేమిటో   స్వయంగా వచ్చి తెలుసుకోండి.
"ప్రభవ " మిమ్మల్ని సాదరం గా ఆహ్వానిస్తున్నది. 
మీ అభిప్రాయాలను సూచనలను సందేహాలను  ... మీ  వెంట తీసుకొని రండి.
మనం కాసేపు మాట్లాడుకొందాం.
*
మడత పేజీ పాఠకులకు ,మిత్రులకు ..నమస్కారం.

ఈ పుస్తకం లో "జంకాయ " శీర్షిక నుంచి కొన్ని టపాలను జతపరచడమైనది.

ఈ రూపేణా మీరంతా ఒక భాగం. వీలు చేసుకొని తప్పక రాగలరు.
ధన్యవాదాలు. చంద్ర లత *


Jan 10, 2010

ఇతనాల కడవకు ఈబూది బొట్లు


ఇతనాల కడవ కు
ఈబూది బొట్లు
the pots of seeds 
with dots of vibudi
ఆవిష్కరణ.8.1.10
అబ్బూరి ఛాయాదేవి గారు,
సరోజిని దేవి గారు 
పక్కన డా. సునీతారాణి గారు,  
అసోసియేట్ ప్రొఫెసర్ సెంట్రల్ యూనివర్సిటి
భూమిక సమావేశం .హైదరాబాదు
రచన: S.వెంకటరెడ్డి, చంద్రలత
*
అమూల్యం
ప్రభవ ప్రచురణ For free copies : 040-27633722
prabhava.books@gmail.com