Jan 27, 2010

ఇంత జరిగాక కూడా,


ఇంత జరిగాక కూడా,బిటి వంకాయను భారతదేశంలోకి అనుమతిస్తే,అది స్వతంత్ర భారతదేశ చరిత్రలో జరగబోయే అతి పెద్ద విషాదం.
డా.పి.ఎం. భార్గవ 

పొగాకు వలన క్యాన్సర్ వస్తుందని గ్రహించడానికి దశాబ్దాలు పట్టింది.జన్యుమార్పిడి పంటల దుష్పరిణామాలను గ్రహించడానికి పుష్కర కాలాలు పట్టవచ్చు.
డా.షెరిలిని


నా దృష్టిలో బిటివంకాయలో ఎక్కువ సమస్యాత్మకమైన అంశం .. ఎంపిక చేసుకొనే స్వేఛ్చ లేకపోవడం. 
డా.ఆరి సీతారామయ్య

ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది.బిటి జన్యుమార్పిడి తరువాతి గురి-వరి! డా.పాణిని  

మనం ఇప్పుడు ఆపలేక పోతే, ఎప్పటికీ ఆపలేం! చంద్రలత

9 comments:

 1. elaa aapaali? is there any petition in court?

  ReplyDelete
 2. నేనయితే జన్యు మార్పిడి ఆహారాన్ని సమర్ధిస్తాను. ముందు ముందు ప్రజల క్షుద్బాధ తీరాలంటే ఆ విప్లవం తప్పక అవసరం. ఈ విషయంపై వాదించలేను, చర్చించలేను కానీ నా అభిప్రాయం చెప్పాను.

  ReplyDelete
 3. నిజం నిజం ముమ్మాటికీ నిజమదే

  ReplyDelete
 4. పీయెం భార్గవ గారు మరియు పాణిని గారు చెప్పినట్లు బీటీ వంకాయ ని అనుమతిస్తే భారత దేశం లో ఎక్కువ మంది ఇష్టం గా తినే కూరగాయ (దాని మీద ఎన్నో పాటలు, కవితలు కుడా అతి ఇష్టం గా మన రచయితలు అల్లారు, పాడారు- "వంకాయ వంటి కూరయు, పంకజ ముఖి సీత వంటి భార్యయు, శంకరుని వంటి దైవము ....." అని)ని అందరూ కాశీ లో వదిలెయ్య వలసిందే అంటే అతిశయోక్తి కాదేమో.

  మానవ జాతి మీద, అందునా ముఖ్యం గా వాళ్ళకి మేధస్సుని, అపారమైన మానవ వనరులని అందిస్తున్న జాతి మీద, ఈ సో కాల్ల్డ్ అడ్వాంచ్డ్ దేశాలకి ఎందుకు ఈ అక్కసు? (బహుశా మన తర తరాల సంపద అంటే భరించలేని ఈర్ష్య అనుకోవచ్చా? వంకాయ షుమారు అయిదు వేల సంవత్సరాల క్రిందట భారత దేశం లో పండించిన పంట గా చెప్పబడుతున్నది)

  ఆధిక్యత ఇంత నీచం గా ఉండాలా?

  ReplyDelete
 5. ఈ బీ టే వంకాయ మన దేశం లో రాకుండా ఆగాలని ఆశిస్తున్నాను

  ReplyDelete
 6. @అజ్ఞాత మిత్రులు
  ఈ నెల 31 న CRIDA, సంతోష్ నగర్ హైదరాబాద్ ,నందు Minster of Environment and Forests, Mr.Jairam Ramesh ,ప్రజాభిప్రాయసదస్సు నిర్వహిస్తున్నారు.
  ఆ సంధర్భంగా , నివాసాంధ్ర ప్రవాసాంధ్ర రచయితలు,జర్నలిస్ట్లు,శాస్త్రజ్ఞులము కలిసి ఒక మెమొరాండం ఇవ్వబోతున్నాము.
  ఇందులోని ప్రధానంశాలు.
  1.జన్యువైవిధ్యాన్ని కాపాడడము 2.జన్యు కాలుష్యము 3.ప్రజారోగ్యము 4.ఎంపిక చేసుకొనే స్వేచ్చ

  ఇప్పటికే సంతకం పెట్టినవారు : ABK ప్రసాద్,చేరా,వోల్గా, డా.కేశవరెడ్డి,అంశయ్య నవీన్,డా.కె.శివారెడ్డి,కొండవీటి సత్యవతి,వాసిరెడ్డి నవీన్ ,మధురాంతకం నరేంద్ర,తెలకపల్లి రవి ప్రభృత సాహితీ వేత్తలు ,
  డా.ఎస్. ఎన్. రావు, పూర్వ డైరెక్టర్ ,హార్టికల్చర్,డా ఆరి సీతారామయ్య.,డా. పాణిని,డా. మద్దిపాటి కృష్ణారావు ,డా. పాలన గార్ల వంటి శాస్త్రజ్ఞులూ ఉన్నారు.
  మీరూ మాతో చేరవచ్చును.
  మీరు చేయవలసిందల్లా..మీ పేరు, email/ఫోను చేర్చడానికి సమ్మతిని తెలపడమే.

  మరిన్ని వివరాలను "జంకాయ" శీర్షికన వ్రాసిన టపాలలో, మీరు చదవవచ్చును.
  ధన్యవాదాలు.

  ReplyDelete
 7. satyavati kondaveetiJanuary 28, 2010 at 11:05 AM

  Andhra Pradesh:
  Farmers and pastoralists who are members of the Mahila Brathukuderuvu Sangham and Mekala-Gorrela Pempakadharlu Sangham of Medak District - will be fasting on 30th Jan 2010- at Narsapur and Narayankhed Taluka. (They will join the ongoing relay-hunger strike in Telangana region with the additional issue of saying "We do not want Bt Brinjal" in Telangana, and the rest of the country).
  Farmers and Pastoralists will be fasting on 30th Jan 2010 at Kalahasthi, Chittoor district, Andhra Pradesh.
  Adivasi Aikya VEdika- a platform for Adivasi Peoples organisations in Telangana and Andhra regions- will be fasting on 30th Jan 2010 at the following regions: Adilabad, Khammam, East Godavari, Visakhapatnam, Vizianagaram, Srikakulam
  Contact for above: Sagari R Ramdas E-mail: anthra.hyd@gmail.com

  Run against BT Brinjal on Jan 30 at NTR Gardens and Necklace Rd in Hyderabad.
  Contact:

  If you or your group is organizing a fast please inform aidsite@gmail.com to be listed here.
  ____________________________________________

  Reachindia@aidindia.org
  http://lists.aidindia.org/mailman/listinfo/reachindia

  satyavati kondaveeti

  2.Click here to ask your friends, family and colleagues to sign the petition as well:
  hwww.greenpeace.in/safefood/the-biggest-baingan-bharta-ever/thank-you/

  GreenPeace India

  ReplyDelete
 8. బిటివంకాయ విషయం పై ఎ.బి.కె.ప్రసాద్ గారి విశ్లేషణ ఇక్కడ చదవండి.
  http://epaper.sakshi.com/epapermain.aspx?queryed=1&eddate=1/27/2010&+edcode=1

  ReplyDelete
 9. 31 న బిటి వంకాయపై హైదారాబాదు లో జరగబోతొన్న ప్రజాభిప్రాయ సదస్సులో పాల్గొనదలిచిన వారికి స్వాగతం.
  స్థలం : CRIDA, ఇందిరా సదన్ కాలేజీ పక్క సందు,సంతోష్ నగర్ ( మలక్ పేట మీదుగా సైదా బాదు దాటాక వచ్చే క్రాస్ రోడ్స్)
  సమయం: ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు
  నమోదు చేసుకోవలసింది :8:30 నుంచి
  ఆలసించిన మాట్లాడే అవకాశం తక్కువ. రాత పూర్వక అభిప్రాయాలనూ అందచేయవచ్చు.
  నిలకడగా ,స్పష్టంగా,క్లుప్తంగా మన అభిప్రాయాలను చెప్పడం అవసరం.

  రేపు కలుద్దాం.

  ReplyDelete