అసలు పిన్నెక్కడో బాబాయి ఎక్కడో వెతుక్కునే సరికే తలతిరిగి పోయిందంటే నమ్మండి!
వాళ్ళిద్దరూ ఎటు మాయమై పోయారో... గానీ ,
ఇటు చూసినా ... అటు చూసినా ...ఎటు చూసినా...పటాలు.
గోడల మీదా ..టేబుల్ మీదా.. సోఫా పక్కన..అద్దాల అరల్లో ..బీరువాల మీదా ..ఎక్కడ వీలైయితే అక్కడ. బొమ్మలే బొమ్మలు.
ఇదేదో సంక్రాంతి బొమ్మల కొలువులకు తెర ఎత్తడం అనుకునేరు!
అబ్బే , అవి పటాలు కట్టిన ఫొటోలు.
చిన్నప్పుడు మా అమ్మమ్మ గారింట్లోనూ ఉండేవి ఇలా గోడల మీద పటాల వరసలు . అచ్చం ఇలాగే. సన్నటి చువ్వకు మెలేసి ..వరుసగా ఈ మూల నుంచి ఆ మూలకు .
పిల్లలం నిక్కించి నిక్కించి చూసినా కనబడితే ఒట్టు. మెడ నొప్పి తప్ప ..ఆ నలుపు తెలుపు బొమ్మల్లో ..మనుషులెవరో ఆనవాలు పట్టేట్టు ఉండేవి కావు.
"ఫుటో ఎత్తించుకోవడం "అప్పట్లో ఒక "ప్రిస్టేజీ".
నలుపుతెలుపు బొమ్మ .సెనగపిండి పసుపు అట్ట మీద అతికించి అద్దం వేసి ,తేదీ రాసి ..స్టూడియో స్టాంప్ వేసి ...మరీ పటం కట్టించి.. చక్కగా గోడ కెక్కించేవారు.
నలుపుతెలుపు బొమ్మ .సెనగపిండి పసుపు అట్ట మీద అతికించి అద్దం వేసి ,తేదీ రాసి ..స్టూడియో స్టాంప్ వేసి ...మరీ పటం కట్టించి.. చక్కగా గోడ కెక్కించేవారు.
మా అమ్మమ్మ మరీను. వేసంకాలం సెలవలకు వెళ్ళామంటే చాలు. మల్లెపూల జడలేసి ఫోటో తీయించి ..గోడకు తగిలించేసేది!
అరిచి గీ పెట్టినా ఊరుకొనేదేనా? అలిగి అన్నం మానేసినా ..గారాం చేసేదే కానీ తన పని తాను పూర్తి చేసేదే! అమ్మలక్కలను పేరు పేరునా పిలిచి ఆ గోడల మీద పటాలను చూపించి మెటికలు విరుస్తూ మరీ ..
మురిసి పోయేది.
ఆ మనుషులు వేరు.ఆ తరహాలు వేరు.
మురిసి పోయేది.
ఆ మనుషులు వేరు.ఆ తరహాలు వేరు.
ఇప్పుడు మళ్ళీ మా పిన్నినే చూడడం. అమ్మమ్మ వరసన పోతుందే .. అని అనుకున్నా.
సరే !
మా పిన్ని మొదటి సారి అమెరికాకు వెళ్ళింది వాళ్ళమ్మాయి
పురుడు పోయడానికి.
పురుడు పోయడానికి.
పోతూ పొతూ ఏవేమి తీసుకెళ్ళిందో కానీ, వస్తూ వస్తూ బోలెడు ఫోటోలు తీసుకు వచ్చింది.
వచ్చీ రాగానే ,గోడలకు మేకులు దిగేసి .. వరసగా తగిలించేసింది.
వచ్చీ రాగానే ,గోడలకు మేకులు దిగేసి .. వరసగా తగిలించేసింది.
ఆ తరువాత పోస్టులో కొన్ని వచ్చి గోడను చేరాయి.ఇక, అటు నుంచి ఇటు వచ్చి పోతుండే మనుషులతో ఫోటోలు రవాణా అవుతుండేవి.
ఎప్పుడు పిన్ని వాళ్ళను పరామర్షించిన ఒక కొత్త ఫొటో పలకరించేది.
అమెరికా ఫోటో .అమెరికా ఫ్రేము .అమెరికా ఫోజూ .పిన్ని గారి గోడ.
'చూస్తూ చూస్తూ పాత ఫోటోలు తీసివేయలేం కదా' అని పిన్ని అంటూ ఉండగానే ..అలా అలా ఇల్లంతా ఫోటోల మయం అయిపోయింది. బావుంది.
'చూస్తూ చూస్తూ పాత ఫోటోలు తీసివేయలేం కదా' అని పిన్ని అంటూ ఉండగానే ..అలా అలా ఇల్లంతా ఫోటోల మయం అయిపోయింది. బావుంది.
ఆ ఫోటోలలో ఒక వరస ఆకర్షించింది.మా పిన్ని గారి అబ్బాయి ,అతని కుటుంబం.
మా పిన్ని గారబ్బాయికి సరిగ్గా చదువబ్బలేదు.ఏ పనిలోనూ కుదురుకోలేదు.
అతనిని అతని భార్యాపిల్లలను పిన్నిబాబాయిలే
పెంచి పోషిస్తున్నారు. ఉండడం పక్కింట్లోనే.
అమెరికా నుంచి వస్తొన్న ఫోటోల వరద అప్పుడప్పుడూ ఆగకుండా కొనసాగుతుంటే ,
పోటానుపోటీగా ఫోటోతో ఫోటో ఢీ!
అతనిని అతని భార్యాపిల్లలను పిన్నిబాబాయిలే
పెంచి పోషిస్తున్నారు. ఉండడం పక్కింట్లోనే.
అమెరికా నుంచి వస్తొన్న ఫోటోల వరద అప్పుడప్పుడూ ఆగకుండా కొనసాగుతుంటే ,
పోటానుపోటీగా ఫోటోతో ఫోటో ఢీ!
'ఇక పరిస్థితి తారుమారయ్యిందని' పిన్ని వాపోయింది.
ఏ ఒక్కటి తీసినా వారికి కోపం.మరొకరికన్న వీరిది మరింత బాగా కనబడాలి.
పంతానికి పంతం.మాటకి మాట!
మొన్నో నాడు పిన్ని గారబ్బాయి చేయెత్తి మరీ బెదిరించి పోయాడట!
పంతానికి పంతం.మాటకి మాట!
మొన్నో నాడు పిన్ని గారబ్బాయి చేయెత్తి మరీ బెదిరించి పోయాడట!
తల్లిదండ్రుల మీద దయలేని బిడ్డలు గోడకెక్కనేమి? ఫోటోలలో పలువరసలు మెరవనేమి?
నోరారా పలకరింపుకు నోచలేదు కానీ ..అనిపించక పోదు. అయినా ,అమ్మానాన్నలను గుండెల్లో పెట్టుకోవాలి కానీ !అమ్మానాన్నల గుండెల్లో నిండాలి కానీ !!
బాబాయేమో గుంభనంగా ఊరుకొంటే ..పిన్ని తలపట్టుక్కూర్చుందని వేరే చెప్పాలా?
గోడ మీద బొమ్మ ..గొలుసుల బొమ్మ అని వూరికినే అన్నారా?
అనకూడదు కానీ ...
చిన్నప్పుడు చూసినట్లుగా ఎంత నిక్కి నిక్కి చూసినా .. పట్టి పట్టి చూసినా..ఆ ఫోటొలలోని ఆకారాలలోని ఆంతర్యం అర్ధం కాలేదు.
చిన్నప్పుడు చూసినట్లుగా ఎంత నిక్కి నిక్కి చూసినా .. పట్టి పట్టి చూసినా..ఆ ఫోటొలలోని ఆకారాలలోని ఆంతర్యం అర్ధం కాలేదు.
ఆ ఆకారాలలోని " మనుషులు" నాకైతే కనబడడం లేదు.
మరి మీకు?
All rights @ writer.
Title,labels, postings and related copyright reserved.
'గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చి పోయే వారికి వడ్డించే బొమ్మ..' అని తేలు గురించి చెప్పే వారండీ నా చిన్నప్పుడు.. ఇప్పుడు తేళ్ళూ లేవు, ఆ పాటలూ లేవు.. ఫోటోని కూడా 'గోడమీద బొమ్మ' అనొచ్చని ఇప్పుడే తెలిసింది.. 'పుట్టలోని చెదలు పుట్టవా, గిట్టవా..' అని వేమన ఎప్పుడో చెప్పాడు కదండీ..
ReplyDeletenice one
ReplyDeleteFor more details regarding attack on Star Comedian Brahmanandam log on to the following link:
http://blogubevars.blogspot.com/2010/01/4.html
నిజమే మురళి గారు ,
ReplyDeleteమీకు తెలియంది కాదు ..తేలు కు ఒక చోటే విషం .ఖలులకు నిలువెల్లా.
మనుషులు ఎన్ని రకాలుగా ఉంటారో ..ఒక మనిషిలోనే ఎన్నెన్ని పార్శ్వాలో ! కదండీ.
మీ అభిప్రాయానికి ధన్యవాదాలు.
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
@blogbevars :)
Thanks a lot. Happy New year
కాసుల వేటలో కానరాని దేశాలకు పయనమైపోయేవారికి కన్న తల్లిదండ్రుల ఆవేదన ఏం అర్థమౌతుంది చంద్రలతగారూ!
ReplyDeleteరవిచంద్ర గారు, నమస్తే.
ReplyDeleteనిజమే,
అయితే కాలంతో పాటు పెద్దవాళ్ళూ మారటానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారో మీరు గమనించే ఉంటారు. గత పదేళ్ళలో మనలో వచ్చిన మార్పు ఎంత వేగంగా వచ్చిందో మనకు తెలుసు.పిల్లలకు భారం కాకుడదనీ..వారి పిల్లలు నిలబడాలన్నా నిలదొక్కుకొవాలన్నా .. కొత్త ప్రపంచంలో భాగస్వాములు కావాల్నీ ..వారు బాగానే అర్ధం చేసుకున్నారు. మనమే, ఇంకా ఎదగ వలసి ఉంది.ఒదగ వలసి ఉంది.
అన్నట్లు, ఆ గల్పికలో పిల్లల్లో ఒకరు అక్షరాలా తెలుగునాట ఉన్నారు.
నాకు మీలాగే బాగా ఆవేదన కలిగి "@అమ్మమ్మ" రాసాను.ఇప్పుడు ఈ గల్పిక.
మరొ విషయం కూడా మనం ఒప్పుకోవాలి. లోకజ్ఞానం పెరిగడం వలనో ఎమొ గానీ, మన తరం ప్రవాసులూ నివాసులూ కూడా.. కుటుంబం పట్ల ,మునుపటి కన్నా, బాధ్యతాయుతం గా వ్యవహరిస్తున్నారన్నదీ నిజం.