ఇవ్వాళ వంటేం చేస్తున్నారు?
గుత్తొంకాయ కూరా?
ఘుమ ఘుమ లాడి పోతోంది!
ఏది ఏమైనా,
పిల్లలను బడికి పంపే తొందరలో ఉన్నా.. ఆఫీసుకు వెళ్ళే హడావుడిలో ఉన్నా..పచ్చడో పులుసో వేపుడో...రుచిగా వండిపెట్టేయడానికి ..వంకాయను మించిన కూరగాయ ఏమున్నది?
పిల్లలను బడికి పంపే తొందరలో ఉన్నా.. ఆఫీసుకు వెళ్ళే హడావుడిలో ఉన్నా..పచ్చడో పులుసో వేపుడో...రుచిగా వండిపెట్టేయడానికి ..వంకాయను మించిన కూరగాయ ఏమున్నది?
అందులోనూ,వగలమారివంకాయ సెగలేకుండా ఉడుకుతుంది కదా? అదేమిటీ? నిన్న మీరు కొన్న వంకాయల్లో సగానికి సగం పుచ్చి పోయాయా? అరరే!
అది సరే కానీ, మీ పుచ్చొంకాయల కారణంగా ఈ ప్రపంచం రెండు వర్గాలుగా చీలిపోయిందని మీకు తెలుసా?
ఆ వివరాలు మీతో పంచుకో బోయే ముందుగా మీకు ఒక విశేషం చెప్పాలి. వంకాయ పుట్టిల్లు మన దేశమే.
వంకాయంత వజ్రాన్ని దొండకాయంత దొంగ ఎత్తుకెళ్ళాడని .. కథలు చెప్పుకొంటాం.
వంకాయ వంటి కూరా సీత వంటి భార్యామణి ..అంటూ ముక్తాయిస్తూ ఉంటాం.
గుత్తొంకాయ కూరతో పాటూ కొసరి కొసరి సరసాలు వడ్డించినా .. వంగకాయ తొడిమ నిశిలో శశి అంటూ కవిత్వాలు పండించినా.. వంకాయ మన వ్యవహారిక జీవితంలో ఎంతగా అల్లుకు పోయిందో తెలియజేస్తుంది. వంకాయ రుచీ ప్రాచుర్యమూ ..పోషకవిలువలూ ప్రాధాన్యమూ .. ఇంతింతని చెప్పలేము.
వంకాయ వంటి కూరా సీత వంటి భార్యామణి ..అంటూ ముక్తాయిస్తూ ఉంటాం.
గుత్తొంకాయ కూరతో పాటూ కొసరి కొసరి సరసాలు వడ్డించినా .. వంగకాయ తొడిమ నిశిలో శశి అంటూ కవిత్వాలు పండించినా.. వంకాయ మన వ్యవహారిక జీవితంలో ఎంతగా అల్లుకు పోయిందో తెలియజేస్తుంది. వంకాయ రుచీ ప్రాచుర్యమూ ..పోషకవిలువలూ ప్రాధాన్యమూ .. ఇంతింతని చెప్పలేము.
అయితే , పురుగు పుచ్చు లేని వంకాయ కోసం ఏకంగా బాసిల్లస్ తురంగస్ అనే సస్యరక్షణ క్రిమిని జన్యుమార్పిడి విధానం ద్వారా వంకాయలో ప్రవేశ పెట్టి ,ఆ పంటను ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా మనదేశంలో విస్తృతంగా పండించే ఏర్పాట్లు ఒక వైపు జరుగుతున్నాయి.
మరో వైపు, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచ దేశాలు కోపెన్ హాగెన్ లో సమావేశమై ఒక అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ,ప్రపంచవ్యాప్తంగా వంకాయ ఒక సంచలనాత్మక చర్చకు మూలమైంది.
సహజ సేద్యపు ఉద్యమకారులు వద్దు వద్దని వారిస్తున్నా ..క్రిమి సం హారక మందుల ఉత్పత్తిదారులు ఎంతగా లాబీ చేసినా..GEAC అంటే Genetic Engineering Approval Committee వారి అనుమతితో పర్యావరణ అనుమతులను పొంది ,మన దేశపు పోలాల్లో సాగుకు సిద్ధమవుతుంది, జన్యుమార్పిడి వంకాయ, జంకాయ.
అవునండి.
ఇవ్వాళ వంకాయ గురించి జరుగుతున్నంత చర్చ..మరే ఇతర కూరగాయ గురించి జరగలేదు.
జన్యుమార్పిడి వంకాయ విత్తనోత్పత్తిదారుల వాదన ఏమిటంటే..
-క్రిమి సం హారక మందుల వాడకం తగ్గిపోతుంది.వాతావరణ కాలుష్యం తగ్గుతుంది.
-రుచి, పోషక విలువలు సాధరణ వంకాయలలో ఉన్నట్లే ఉంటాయి.
-CRY 1ACజన్యువు విడుదల చేసే ఒక ప్రోటీన్ విషతుల్యంగా ఉండి ..కాయను మొవ్వును తొలిచే పురుగును నివారిస్తుంది. అలా 60 నుంచి 70 % వరకు పంటదిగుబడిని పెంచుతుంది.
అంటే, మన మార్కెట్లలోకి ఇక పుచ్చు వంకాయలు రావని వారు చెపుతున్నారన్నమాట! మనలాంటి వారికి ఇది శుభవార్తే! కానీ, జన్యుమార్పిడి వంకాయను ససేమిరా వద్దంటున్న వారిలో ఆర్గానిక్సేద్య ఉద్యమకారులు,శాస్త్రవేత్తలు ఏమంటున్నారో అదీ విందాం!
- జంకాయ ను తినడం వన మన శరీరంలో యాంటీ బయాటిక్స్ ను పనిచేయనివ్వని నిరోధక శక్తి పెంపొందుతుందని ఫ్రెంచ్ శాస్త్రవేత్త కేన్స్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొ.షెరెలిని గారు వెల్లడించారు.
-జన్యు మార్పిడి ఆహారం తీసుకోవడం వలన అల్లెర్గీలు వస్తాయనీ,మూత్రాకోసం,కాలేయం వంటి ముఖ్యమైన అవయవాలు దెబ్బతింటాయనీ,మన రోగనిరోధక శక్తి పై తీవ్రప్రభావం పడుతుందనీ.. .స్వయాన మన పూర్వ కేంద్ర వైద్యాశాఖామాత్యులు డా.అంబుమణి రామదాస్ గారు ప్రధాని మన్ మోహన్ సింగ్ గారికి రాసిన లేఖలో స్పష్టపరిచారు.
-కాగా, వంధ్యత్వం నుంచి అనేక అవాంచిత శారీరక రుగ్మతలకు ,పరిణామాలకు బిటి వంకాయ మూలం కావచ్చని హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే, వంకాయపై జన్యు మార్పిడి పరిశోధనలు పూర్తయినట్లూ,పంటపొలాల్లో సాగు కొరకు ప్రయోగాలు కొనసాగించవచ్చుననీ..అనుమతులు జారీ చేసారు,GEAC వారు.
సరిగ్గా అప్పుడే,మరోసారి అంతర్జాతీయ చర్చకు తెరతీసింది వయ్యారి వంకాయ. - ఇదొక సాంకేతిక విజయం.శాస్త్రీయతను అంగీకరించేవారు ఈ విషయాన్ని తోసి పుచ్చలేరు.
అయితే,మరే ఇతర దేశమూ అనుమతించని ఈప్రయోగానికి మనదేశంలోనే ఎందుకు అనుమతించబడిందో మనం పరిశీలించాలి.ఈ అవాంఛిత ప్రయోగం వలన ప్రమాదాలు రెండు.
ఒకటి- జన్యుకాలుష్యానికి లోను కావడం.
రెండు- జన్యువైవిధ్యాన్ని కోల్పోవడం.
- వంకాయకు మనదేశమే పుట్టిల్లు.జన్యుమార్పిడి వంకాయపంటపొలాల్లోని సమీప పంటలన్నిటి పైనా ఈ విషతుల్య జన్యువు ప్రభావం ఉంటుంది.ఇతర పంటలలో జన్యుకాలుష్యం ఏర్పడుతుంది. ఈ పంట పండించిన పొలాల్లోని మట్టిలో సమూల మార్పులు వస్తాయి.
ఆ పొలాల్లో ఇతరపంటలు పండిస్తే ఆ పంటలలోకి ఈ విషతుల్య జన్యువు ప్రవేశించే ప్రమాదం ఉంది.ఆ పొలాలలో ఇతర పంటలను పండించే వీలు ఉండదనీ ..ఆ సమీప పంటలన్నీ జన్యు కాలుష్యానికి గురవుతాయనీ ..ఉద్యమ కారులు హెచ్చరిస్తున్నారు.
-పురుగు తక్కువగా సోకే ఒక రకం వంగడం,వంకాయలోని భిన్నరకాలను నామరూపాలు లేకుండా చేసే అవకాశం ఉంది.అలా జన్యువైవిధ్యాన్ని కోల్పోవడమే కాకుండా ..మన వంకాయనే మనం కోల్పోతాం.శాశ్వతంగా!
ఇక, ఏ విత్తనోత్పత్తి సంస్త ఈ జన్యుమార్పిడి వంకాయను ఉత్పత్తి చేసిందో ,వారి నుంచే రైతులు వంకాయ విత్తనాలు కొనుగోలు చేయాలి.రైతుల వ్యవసాయ పెట్టుబడి ఈ రూపేణా పెరిగిపోతుంది.ఒక సంస్థ గుత్తాధిపత్యంలో మన దేశ వ్యవసాయరంగం చిక్కుకు పోతుంది.
-వంకాయ కాయను,మొవ్వును తొలిచే పురుగు(BFSB, Brinjal Fruit and Shoot Borer) రోగనిరోధక శక్తిని పెంపొందించుకొంటే ఎలాగన్న ప్రత్యమ్నాయాలను ఇంత వరకు ప్రకటించ లేదు.
-ఈ పురుగులు కాక ఇతర క్రిముల తాకిడిని గానీ రోగాలను కానీ చీడపీడలను గానీ ..ఈ జన్యువు ఏ విధంగానూ అరికట్టలేదు.ఇతర క్రిమిసంహారక మందులు యధాప్రకారం వాడవలసిందే. ఆ సంస్థ వారు ప్రకటించి నట్లుగా పర్యావరణకాలుష్యాన్ని తగ్గించక పోగా .. జన్యుకాలుష్యానికి ఇది తెర తీస్తుంది!
వంకాయను జన్యుమార్పిడి విధానంలో పండించి ..మనకు వడ్డించే లోపలే ఆ జన్యుమారిడి వంకాయను ఉదాహరణగా చూపుతూ 56 రకాల ఇతర జన్యుమార్పిడి పంటల అనుమతుల పర్వం ముగుస్తుంద్! అందులో 41 రకాలు ఆహార పంటలే!
అమెరికా అధికారక Agri-Biotechnology Support Programme దీని వెనుక ఉండడం చేత GEAC అనుమతి మరింత వివాదాస్పదమైనది.
PM భార్ఘవ గారి వంటి శాస్త్రవేత్తలు 102 పేజీల నివేదికను కేవలం గ్నటలో పూర్తి చేసి ప్రకటించడం ..అది కూడా కేవలం రెండేరెండు సమావేశాలలో నిర్ధారణకు రావడం లోని ఆంతర్యాన్ని ,ఈ వ్యవహారం లో GEAC యధాలాప ధొరణిని ..ఘాటుగా ప్రశ్నిస్తున్నారు.
మనదేశంలో,2007 నందు 8.5 మిల్లియన్ మెట్రిక్ టన్నుల వంకాయ పండించబడింది.కనుక, కేవలం వ్యాపారదృష్టి బహుళజాతి వ్యాపారసంస్థలు మందేశంపై దృష్టి నిలపడంలో ఆశ్చర్యం ఏముంది?
వంకాయకు పుట్టిల్లయిన మన దేశంలోనే .. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ..జన్యుమార్పిడి వంకాయ విడుదల . మొట్టమొదటి జన్యుమార్పిడి కాయగూర!
వారి విత్తనం..వారి పరిశోధన..వారి నివేదకలు... మనకు వడ్డింపులు..!
బి.టి. వంకాయను మార్కెట్లోకి విడుదల చేసినట్లయితే ,సహజంగానే దేశవాళీరకాలను,సాంప్రదాయ సంకరవంగడాలను తోసిరాజని బిటివంకాయ వ్యాపిస్తుంది.అందుకు ప్రధాన కారణం పంటవిస్తీర్ణం పెరగడం.ఆ దరిమిలా ధర తగ్గడం.
సామాన్య వినియోగదారులం ఎక్కడ చవకగా దొరికితే అక్కడ కొంటాం.ఎందుకు చవకగా దొరికిందని ఆలోచించం.ఆ అనాలోచిత క్రియ మన శరీరాలను ఒక ప్రయోగానికి పరీక్షనాళికలుగా చేస్తోందన్న మాట!
కాగా, దీనికి ప్రత్యామ్నాయంగా చెప్పే సహజసేద్యపు దేశవాళీ వంకాయలు సామాన్యుల చేరువలో ఉండవు.ఇది పాశ్చాత్యదేశాలాలో ఇప్పటికేఅనుభవంలోకి వచ్చిన సత్యం.కనీసం అక్కడ జన్యుమార్పిడి పంటలకు లేబిలింగ్ సదుపాయం ఉంటుంది.వినియోగదారులకు స్పష్టపరచడానికి .వర్ధమాన దేశాలలో ఆ సదుపాయం లేదు.
ఏది ఏమైనా ,జన్యుమార్పిడి వంకాయపై ఒక సంగ్ర అవగాహన లేనిదే ,మనదేశంలోకి అనుమతించడం ..భారతీయ వటవృక్షాన్ని తొలిచే వేరుపురుగును స్వయంగా పెంచిపోషించినట్లే!
కోపెన్ హాగెన్ పర్యవరణ సదస్సు సంధర్భంలో ,దేశవాళీ వంకాయను సంరక్షించేందుకు ..జన్యుమార్పిడి వంకాయను మరింత పరీక్షించేందుకు ..పంటను వంటను పరిరక్షించేందుకు..ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలి.
సరే కానీ, మీ వంట పూర్తయినట్లుంది. మీరు వండే వడ్డించే కాయగూరల నేపధ్యం ఏమిటో .. అవి మీ శరీరం పై మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ..తెలుసుకొని మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ..మీరు ఇప్పటికే గ్రహించి ఉంటారు.
అటు దేశపౌరులుగానూ ..ఇటు వినియోగదారులుగానూ ..ఇది మన బాధ్యత.
మన సహజ జన్యుసంపదను, ప్రకృతి సమతుల్యాన్ని, పర్యావరణాన్ని కాపాడుకోవడంలోనే మన భద్రత ఉన్నది. వజ్రం లాంటి వంకాయను దాని లోని విభిన్న వంగడాలను పదిలంగా పదికాలాలపాటు భద్రపరుచుకోవడంలోనే మన విజ్ఞత ఉన్నది! కదండీ!?!
<<<వంకాయ గురించి ఇంత హడావుడి అవసరమా అన్నారొక పాఠకులు అల్లంత దూరాన నుంచి ఫోను జేసి మరీ. .ఈ విషయం ఎంతో ముఖ్యమైనదని భావించడం చేత ..ఈ విషయాన్ని మరింతగా మాట్లాడవలసిన అత్యవసర పరిస్త్థితి లో ఉన్నామని భావించడం చేత..ఈ నాలుగు మాటలు . మీ అబిప్రాయం కోసం.>>>*
*
< ఆకాశవాణి, "వర్తమానం" శీర్షికన 11-12-2009 నాడు ప్రసారం చేయబడింది.
చినుకు మాస పత్రిక ,జనవరి,2010, సంచికలో అచ్చయింది.>
>Post: వగల మారి వంకాయ
> Link: http://chandralata.blogspot.
చాలా మంచి విషయం చెప్పారు. వంకాయ వెనక ఇంత కథ ఉందని తెలియదు. ఇలా ప్రజల మీద ప్రయోగాలు చేసే అధికారం ప్రభుత్వానికెక్కడిది? దీనిని మనం ఆపలేమా?
ReplyDeleteవంకాయకూర లేని ఏ పండగను , పబ్బాన్ని ఊహించలేము . అసలే నవ నవ లాడే లేత వంకాయలు దొరకటము కష్టమై పోతోందంటే , ఈ గోల వొకటి ! వండిన రకము వండ కుండా కనీసము నెలరోజుల పాటు వండవచ్చు , తినవచ్చు. ఇకపైన ఈ మాత్రము కూడా వుండవంటే దిగులేస్తోంది .
ReplyDeleteit is a good story
ReplyDeletekontha simple gaa vraste baaguntundaiemo
anyhow thanks for responsible blog
dr a s reddy
విజయ్ శర్మ గారు,
ReplyDeleteనమస్కారం.
తప్పకుండా ఆపవచ్చునండి. ఈ 22 వ తేదీన హైదరాబాదులోనే ఈ విషయమై "Public Hearing "ఉన్నది. ప్రభుత్వానికి మన అభిప్రాయం వినిపించవచ్చును.ఎవరికి వారం వాపోయి వూరుకుండా మన పరిధిలో మన ప్రయత్నాలను కొనసాగించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.
ధన్యవాదాలు.
అవునండి మాలాకుమార్ గారు, నాకూ అలాగే దిగులేసి ఇలా ఏమి చేయడమా అని ఆలోచించి అలా మాట్లాడా.
ReplyDeleteఅయితే,ఇక పై వంకాయలు ఉండకుండా పోవు.మనం వండకుండా పోము.కాకపోతే, ఈ జంకాయ( జన్యు మర్పిడి వంకాయ) మన వంకాయల్ని మన గడ్డ మీద మిగలనిస్తే...!
అప్పుడు!!
Dr.AS రెడ్డి గారు,
ReplyDeleteధన్యవాదాలండి.
అది నేను మాట్లాడినది.
ఏది ఏమైనా, మీ సూచనను మును ముందు తప్పక పాటిస్తాను.
మరింత స్పష్టం గా రాయడానికి ప్రయత్నిస్తాను.
"Public Hearing " ఏ స్థలంలో, ఎన్ని గంటలకు జరుగుతుందో కూడా తెలియజయగలరు.
ReplyDeletePublic Hearing వివరాలు ఇక్కడ చూడవచ్చు.అయితే, ఇప్పటి వరకు స్థలము,సమయము ప్రకటించలేదు.తేదెలు మాత్రమే తెలియపరిచారు.
ReplyDeletehttp://beta.thehindu.com/news/national/article72839.ece
వంకాయ మీద ప్రయోగాల కోసం 'అభివృద్ధి చెందుతున్న' దేశాన్ని ఎంచుకోడం లోనే కనిపిస్తోందండీ తెలివంతా.. అభివృద్ధి చెందని దేశమైతే అంతర్జాతీయంగా భిన్న స్వరాలు వినాల్సి వస్తుంది.. పైగా మార్కెట్ ఉండదు.. నీళ్ళ కోసం పోరాటాలు జరుగుతూ ఉండగానే, తిండి (రక్షణ) కోసం పోరాటం మొదలయ్యింది.. వ్యాపార దృష్టి పెరిగిన చోటినుంచి బాధ్యతని ఆశించడం అత్యాశేనేమో కదా.. ఆలోచనల్లో పడేసింది మీ టపా..
ReplyDeleteమురళి గారు ,
ReplyDeleteమీరన్నది అక్షరాలా నిజం.
ఆలోచన నుంచి మరొక అడుగు ఆచరణ వైపుగా వేయాలని ..అది ఆలోచనలను ఒకరి తో ఒకరం పంచుకోవడంతో నే ఆరంభమవుతుందనీ ..అనుకుంటాను.
ఒక ఆలోచనకు మరొక ఆలోచన తోడవడం తో,ఆ ఆలోచన సమగ్రమై మరింత బలపడుతుందని నా నమ్మకం.
ధన్యవాదాలు.
నమస్తే!
ReplyDeleteఇంతటి తీవ్రమైన సమస్య గురించి ఇంతవరకూ తెలియనందుకు సిగ్గుపడుతున్నాను. మీ బ్లాగు ద్వారానన్నా తెలిసినందుకు సంతోషిస్తున్నాను. ఒక జీవరసాయనశాస్త్ర పరిశోధకుడిగా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకుందామని ఇది రాస్తున్నాను. ఈ విషయాలు తెలుగులో కంటే ఆంగ్లంలోనే సూటిగా చెప్పగలననుకుంటున్నాను.
1. The plasmid introduced into Bt Brinjal contains a modified version of the Cry1Ac gene (to change its solubility). Thus, the toxin produced in Bt Brinjal is similar but not identical to the wild type (natural) toxin.
2. All of the toxicity studies cited to date of Cry1Ac protein in animal species have been done with the wild type toxin and not with the product of modified gene introduced into Bt Brinjal. The reason given is that the amount of the toxin produced in Bt Brinjal (as well as other genetically modified plants) is insufficient to carry out large scale toxicity studies. Therefore, natural B.t.k toxin is purified from bacterial cultures and used. It is assumed that as long as the insecticidal domain of the protein is similar, rest of the protein regions are non-toxic.
3. A single gene may produce more than one messenger RNA and a given messenger RNA may have more than one reading frame and thus produce more than one protein. Therefore, the actual number of foreign proteins generated in the Bt Brinjal plant and fruit may be quite different from laboratory conditions. As a result the toxicity profile of Bt Brinjal crop to FSB, other beneficial insects and organisms and to animals as well as humans may be very different from that of natural Cry1Ac toxin. This point is ignored in the safety studies.
4. One irrefutable argument against the introduction of Bt Brinjal in India is that it should be prohibited by the 2001 UN treaty adopted at the FAO Conference to protect biodiversity. India has the most biodiversity in the varieties of Brinjal and may very well be the place of its origin.
5. A country like India should be extremely reluctant to serve as guinea pig for an experiment involving the very first edible GM crop for human consumption. It is even more ominous that the next target for Bt modification is rice!
ధన్యవాదాలు,
శంఖవరం పాణిని