Oct 21, 2009

వగల మారి వంకాయ

వగల మారి వంకాయ సెగ లేకుండా ఉడికిందంటారు.
అదేమో కాని, సెగలు పొగలూ కక్కుతూన్నా... ఏమీ ఎరుగని నంగనాచిలా.. మన పళ్ళెంలోకి వచ్చి పడబోతోంది ...
నవనవలాడుతూ జంకాయ.!
అహా ..!
మన కంచంలోకి తెచ్చి పడేసారు.
అనేవాళ్ళు అంటుంటారు చేసేవాళ్ళు చేస్తుంటారు.
ఇవన్నీ, మనకు మాత్రం తెలియవా?
బిల్లియన్ బేబీ పుట్టినప్పుడు.. జనభారంతో తల దించుకోకుండా.... తలెగరేసి పండగలు చేసుకొన్నాం .
మీరింకా మరిచిపోలేదనుకొంటాను. ఇప్పుడు ...మరో పండగ!
వంకాయకు పుట్టిల్లయిన మన దేశంలోనే .. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ..జన్యుమార్పిడి వంకాయ . మొట్టమొదటి జన్యుమార్పిడి కాయగూర... విడుదలకు అంతాసిధ్ధం..ఇక ప్రభుత్వ అనుమతే తరువాయి!
దీని మీద సర్వ హక్కులు మనవి కావు.మరి ఎవరి భోజ్యం? దేశమూ అడుగు పెట్టనివ్వని జన్యుమార్పిడి వంకాయకు .. మన దేశంలోనే ఎందుకు దారిచ్చాము..అందునా రాజ మార్గాన..! మాత్రం తెలియదూ.. మనకున్నన్ని దొడ్డిదోవలూ ..అడ్డదార్లూ .. మరెక్కడా ఉండెదీ..?అవునండోయ్..ఇది మరో రికార్డు..!
వంకాయ వంటి వదినో.. వంగకాయ తొడిమ వంటి నిశిలో శశో.. గుత్తి వంకాయ కూరలో వయ్యరాల వడ్డింపులో.. .వంకాయ వంకాయే..!
ఆర్గానిక్, "సహజ సాగు", ఉద్యమకారులు వద్దువద్దంటూ వారిస్తున్నా.. క్రిమిసంహారక ఉత్పత్తిదారులు లాబీ చేసినా .. GESE..Genetic Engineering Approval committee వారి అనుమతితో పర్యావరణ పరిమితులను పొందింది..ఇక త్వరలో వ్యాపార సాగు మొదలవబోతున్నది.
కార్యసాధకులకు కానిదేమున్నది..?
వారి విత్తనం..వారి పరిశోధన..వారి నివేదకలు... మనకు వడ్డింపులు..!
ఆ పై, పరిమితుల గంట కట్టిందెవరూ?అనుమతుల తివాచీ పరిచిందెవరు ?
అదీ మనమే..!
ఇది ఇంతటితో ఆగేదేనా? మనం ఆపగలమా?
ఇంతకీ ,ఆప వలసిన అవసరం ఏమైనా ఉన్నదా?లేదా?మన వంటింటిపై రకపు దురాక్రమణను మనం ఎలా నియత్రంచగలం?
మన శాస్త్రం, మన ప్రభుత్వం, మన ప్రజలు... ఒక్క తాటిపై ఎలా నడవగలం ?
మన పకృతి సంపద ను ..ఎలా పదిల పరుచుకోగలం?
మన వంటినీ మన ఇంటినీ ..... జన్యుకాలుష్యం నుంచి ఎలా కాపాడుకోగలం?
ఒకటా రెండా... ఎన్నెన్ని సందేహాలు...అయ్యో..!
ఒక్క మారైనా ఆలోచించలేమా?
కనీసం... ఒక్కసారైనా..
మన వంకాయ కోసం..!మన కోసం..!
వీసమెత్తు !!!

All rights @ writer.
Title,labels, postings and related copyright reserved.

17 comments:

 1. చంద్రగారు,
  మనం ఆపలేమండి. ఎందుకంటే కాసులుంటే సర్వకార్యాలు సానుకూలమవుతాయి మన దేశంలో ఇక వంకాయలు కొనడం విషయానికొస్తే. ఇప్పుడున్న వాటికంటే తక్కువ ధర ఉంటే తప్ప వాటిని ధనికులు, బలిసినవాళ్లు తప్ప కొనరు.ఈరోజుల్లో మనకిష్టమైన కూరగాయలు, సరుకులు కొనేట్టు ఉందా?? మార్కెట్టుకెళ్లి మన దగ్గర ఉన్న డబ్బులకు తక్కువ ధరలో ఎక్కువ ఏది వస్తే అది కొనుక్కోవడం అలవాటైన బక్కప్రాణులం.ఆలోచించడానికేంటి చాలా చేయొచ్చు. కాని ఆచరణ, వ్యతిరేకించడానికి మాత్రం? ఊహూ.. ఎందుకంటే చేసినా లాభం ఉండదు కాబట్టి.

  ReplyDelete
 2. "ఇది ఇంతటితో ఆగేదేనా? మనం ఆపగలమా? "

  ఆపగలం! అయినదానికీ కానిదానికీ గోరంతలు కొండంతలు చేసే మీడియా ఛానెళ్ళు ఈ విషయంలో మరి కాస్త విజృంభించి "ఇదో విషపు కాయ"అంటూ జనంలో ప్రతికూలతను నాటాలి, చాటాలి!అది తింటే రోగాలు తప్పవని జనాన్ని జాగృతం చేయాలి. సామాన్య ప్రజలు బీటీ వంకాయంటే ఛీ కొట్టేలా చేయాలి. అది ఎంత చవగ్గా వచ్చినా దాని మొహం కూడా చూడకుండా చేయాలి. అప్పుడు ఎంతెంత వ్యాపారులైనా మూటా ముల్లే సర్దుకోక తప్పదు.

  ReplyDelete
 3. @జ్యోతి గారు,
  మీరన్నది నిజం.
  అలాగే, ప్రకృతిసేద్యపు కూరగాయల ధరలు ఆకాశం అంచుల్లోనే..ఉండడం కూడా మీరు గమనించే ఉంటారు.ప్రతి కాయగూర మీదా అది బిటినో కాదో తెలియపరిచే చీటీ లేదా మరో మార్గం ద్వారా తెలియ పరిచే అవశాం మనకు ఉన్నదా? అది సాధ్య పడుతుందా?చివరకి ..మీరన్నట్లుగా.. అల్ప మహ్ద్య ఆదాయవర్గాల వారే ... ఈ ప్రయోగాల ఫలితాలను భరించవలసినవసిన వారు.మరి, మార్గాంతరం ఆలోచించాలి కదా?నిరాశలోంచే!
  ఎవరికి వారం.చేతనైనంత.
  ఏమంటారు?

  ReplyDelete
 4. @ సుజాత గారూ..
  మీరన్నదీ నిజమే!..:-)
  ఇంకా ఏమేమి చేయచ్చునంటారు?

  ReplyDelete
 5. చంద్ర!
  వంకాయ కష్టాలు అర్ధమయ్యేటట్టు చక్కగా రాశారు.
  జనకాలుష్యం, జన్యుకాలష్యం వంటి విషయాలు మన బుర్రల్లో వెలగాలంటే, మనకు తగినంత విద్య ఆయావిషయాలలో కావాలి.
  ఆది ఒక్కటే సరిపోదు. మనకు "ఏది మంచి, ఏది చెడు" అన్న విశ్లేషణా జ్ఞానం కూడా అత్యవసరము.
  ఇవి ప్రధమముగా మనము కలిగివుమ్టే, అప్పుడు వీటిని ఆచరణలో పెట్టే ప్రేరణ, శక్తి, పధ్ధతి ముఖ్య సామగ్రులు.
  ఒక్కసారిగా ఇవన్నీఓవ్యక్తిలో కలుగవు. పెంపకము, విద్య, బోధన, సమాజము, స్వధర్మములు వీటికి పునాదిరాళ్ళు.
  వ్యక్తి నుండి సమాజానికి, సమాజం నుండి వ్యక్తికి, విద్యాప్రేరణా ప్రవాహాలు నిత్యం సాగుతాయి.
  వాటిని వెదికి, సంపాదించి, మర్ధన చేసి, ఆచరణలో పెట్టినప్పుడే, మనలో "జనకాలుష్యం, జన్యుకాలుష్యం" పై అవగాహన కలుగుతుంది. వాటిని ఆచరణలో పెట్టే శ్రధ్ధా, శక్తి, పధ్ధతి వచ్చితీరుతాయి.

  పాలన
  కొలమ్బస్, ఒహాయో
  అక్టోబర్ ౨౧, ౨౦౦౯

  ReplyDelete
 6. @పాలన గారు... మీ అభిప్రాయానికి ...మీ ప్రోత్సాహానికి ..ధన్యవాదాలు.
  సమయమింకా మించి పోలేదు . జంకాయ ను వంకాయల్లో కలవనీయకుండా ఆపడానికి.

  ReplyDelete
 7. వంకాయపై జరిపిన పరిశోధన రహస్య నివేదిక మీరు లేక మురహరిరావు గారు (I wish him early recovery from post surgery effects) అధ్యయనం చేశారా?
  Comparative Food Safety Studies
  Environmental safety studies
  Other studies
  నివేదిక కింది చిరునామాలో లభ్యం అవుతుంది.
  http://www.envfor.nic.in/divisions/csurv/geac/bt_brinjal.html
  అవసరమైన పక్షంలో ప్రజాహితం కోసం కోర్ట్‌కు వెళ్లే అవకాశం కూడ మీరు పరిశీలించవచ్చు.

  ReplyDelete
 8. @sravya garu,
  Thank you
  @cbrao garu,
  Thanks for the link.
  It's an OPEN DOCUMENT and an OPEN FORUM !

  ReplyDelete
 9. @జ్యోతి గారు
  ఇక మీరు "వంకాయల వారం" ప్రకటించాలని పబ్లిక్ డిమాండ్ వచ్చేసింది! ఒక మారు చూడండి.
  http://telugu.shoutem.com

  ReplyDelete
 10. వాకే చంద్రగారు, అదెంతపని..ఓ పదిరోజుల టైమివ్వండి.సులువైన వంటకాలు రెడీ చేసి వంకాయలవారం జరుపుకుందాం...

  ReplyDelete
 11. "వంకాయల వార్"
  ..ప్రకటించబోతోన్న జ్యోతి గారికి... ముందస్తు జేజే..!మీ వెంటే మేమంతా..అదేనండీ.. మీ వంటే మా ఇంట !!!

  ReplyDelete
 12. బాగా రాసారండీ,

  ఈ జన్యు మార్పిడి గోలంతా, బహుళ జాతి కంపెనీలు Monopoly సాధించడానికే అని నా అభిప్రాయం. పురుగులని తట్టుకునే శక్తి సంగతి దేవుడెరుగు, ఇవి మార్కెట్లోకి ఒస్తే మాత్రం ఇప్పుడు దొరుకుతున్న ప్రకృతి సహజమైన రకాలు పూర్తిగా అంతరించిపోతాయని కూడా అంటున్నారు. ఇది ఒక్క వంకాయతోనే ఆగదు మరి !

  ReplyDelete
 13. Most of us are already consuming genetically engineered corn as food.
  Exception - I read sometime back that Europe or at least some European countries check corn products to make sure they do not include genetically engineered corn.
  Genetically engineered cotton also seems to be part of our lives even without knowing.

  There could be a never ending debate about whether genetical engineering is a good thing, where should a line be drawn in applying it
  and avoiding it, etc.
  As a common person, though, the information is overwhelming and doesn't help me make decision one way or the other.

  In my opinion, a practical solution that public can ask for, is this.
  1. Perhaps we can demand that the genetically engineered brinjal be marked conspicuously so.
  Then the decision is upto the consumer to whether buy it or not.
  2. There should be ongoing healthy objective discussions presented by experts, in various public media, about the pros and cons of the new breed of brinjal.

  ReplyDelete
 14. Very interesting
  we all know that our hands are tied
  Did you read the news item in Andhra jyothy on Friday,
  the Tamilnadu agricultural university gave 5 stars the this Vankaaya

  ReplyDelete
 15. అయ్యో ఇంత కథ అవుతోందా వంకాయ వెనుక. ఇన్ని చేసి డబ్బు తో ఇంత చేయగలిగిన వాళ్ళు మీడియా ను కొని ఈ వంకాయ తింటే ఇంక మీరు జన్మ లో ఇంకో కూర తినరు అనో లేక ఇక మీకు ఫేస్ వాష్ లే వద్దు ఈ వంకాయ తింటే మొహం తళ తళ అంటారేమో..

  ReplyDelete
 16. నిజమే భావన గారు, మీరన్నట్లుగా ..
  ఇంకెన్ని వినవలసివస్తుందో..ఇంకేమి తినవలసివస్తుందో...ప్చ్ !

  ReplyDelete