ఇప్పటికి ఇరవై నాలుగు గంటలు.
కొరివిపాడు మునిగిపోతున్నదనీ..అక్కడివారిని మా వూరికి చేర్చుతున్నామని ...వార్తలంది.
మానవపాడు మండలం నీటి దిగ్బంధంలో చిక్కి.
మునకేస్తున్న పొలాల మీదుగా..తెగి పడుతోన్న వాగులను దాటి .. నడిగడ్డ నాలుగు చెరుగులా ...మిన్నుపాడు,మద్దూరు,కలుకుంట్ల,బొంకూరు,చంద్రశేకర్ నగర్ తదితర గ్రామాల ప్రజలు ఒక్కో ఊరు వదిలి ..మా వూరు,శ్రీనగర్, చేరిపోయారు.
నిన్నమద్యాహ్నానికి సుమారు 150
మంది సాయంత్రానికి సుమారు350 మంది.. వచ్చిన వారు వస్తున్నారు.ఉన్నంతలో అన్నమో పప్పో...తలా కాస్తా పంచుకొని.. రాత్రంతా ప్రాణ భయాన్ని .... చలినీ..నిద్రనూ అరకొరగా.. పంచుకొని... తెల్లారే దాకా బిక్కు బిక్కు మంటూ..ఇదుగో ఇందాకే ..మళ్ళీ ఫోను కలిసింది.
హమ్మయ్య.
అంతా క్షేమం.
మూడు రోజులుగా కరెంటు లేదు.చుట్టుపక్కల పల్లెలతోను అటు కర్నూలు తోనూ సంబందాలు లేవు. ఉన్న ఒక్క జెనెరేటర్ లో ..డీసిల్ అయిపోయింది. అక్కడక్కడా సేకరించి .. సెల్ చార్గి చేసి ఇందాకే పలకరించారు.
లెక్కకు మిక్కిలి మనుషులు.ఒకరికి ఒకరు తోడయ్యామనీ.. ఒక హెలికాప్టర్ ఊరిమీదుగా తిరిగి ..వెళ్ళిపోయిందనీ..అంతకు మించి బయటిప్రపంచం విషయాలు తెలియవనీ ..చెప్పారు.
మళ్ళీ జేనెరటర్ మొరాయించి నట్లుంది. ఫోను అర్ధాంతరంగా ఆగిపోయింది.
కరంటూ లేదు..బయట ఏమి జరుగుతోందో వారికి తెలియదు. అక్కడ ఉన్న వారికి సరిపడే మంచి నీరు, సరుకులు , గ్యాసు, కిరోసిన్, వంటచెరుకు అన్నీ పరిమితంగా ఉన్నాయి.ఇంకా వచ్చి చేరుతున్న వారి పరిస్థితి మరింత ప్రశ్నార్ధకం.
అటు కర్నూల్ చేరేటట్లు లేదు.తుంగభద్ర వంతెన కొట్టుకు పోయింది.
ఇటు రాయచూరు, గద్వాల..మార్గాలు తెగి పోయాయి.వాగులు పొంగి పోయాయి.దారులు మూసుకు పోయాయి.బీచుపల్లి వద్ద కృష్ణ పొంగిపారుతోంది.రవాణా స్తంభించింది.
సహాయచర్యలు అక్కడికి చేరాలి.
ఇవ్వాళే.
సాధ్యమైనంత త్వరలో.
http://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B0%A8%E0%B1%8B%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A1%E0%B1%8D
ReplyDeleteమనోపాడ్ మండలం కొర్విపాడు.
లోక్ సత్తా వారికి తెలపండి, తప్పక సహాయం చేస్తారు.
ReplyDeleteEmail : info@loksattaparty.com
H.No. 5-10-180/A & A1 Band Lanes
Hill Fort Road, Near Ayakar Bhavan.
Hyderabad
Andhra Pradesh
500 004
India
91-40-2323 1818 / 2323 2829/ 23233637
ఒక వూరు లేదు ఒక దారి లేదు.పల్లె లేదు పట్నం లేదు.. లంక లేదు మెట్ట లేదు. అంతా నీరే నీరు.
ReplyDeleteవీలైతే మా వూరి పరిస్థితి నీ ఒక మారు చూడండీ. సరిగ్గా కర్నూలు,సుంకెసుల, కు ఆవలి గట్టున.ఇది పాలమూరు.యంత్రాంగం మంత్రాంగం వేరు వేరు.ఇప్పటికే అందజేయగలిగిన యంత్రాంగానికి వార్తను చేరవేసాం. ఇంకా ఏ వార్తా మాకు చేరలేదు.ఎదురుచూస్తున్నాం.ఈ రాత్రి గడిస్తే చాలు అన్నట్లుగా ఉన్నది నది పరిస్థితి.
ధన్యవాదాలు.
చంద్ర లత గారూ,
ReplyDeleteమీరు బ్లాగు రాస్తున్నారని ఇప్పుడే తెలుసుకున్నాను. మీరిప్పుడు నడిగడ్డలో ఉన్నారా? ఇప్పుడు ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ప్రభుత్వ సాయం ఏమైనా అందిందా? మీకు స్థానికంగా పెద్దగా సాయపడలేనేమో గానీ హైదరాబాద్ నుండి చేయగల సాయమేమైనా ఉంటే చెప్పగలరు.
నిన్ననే ఒక మిత్రుడితో మహబూబ్ నగర్ జిల్లాలో వరదల గురించి మాట్లాడుతూ మీ నవల గురించి చెప్పాను.
కొణతం దిలీప్
hridayam.wordpress.com
దిలీప్ గారు,
ReplyDeleteనమస్కారం.
మీకు ఆలస్యంగా రాస్తున్నందుకు మన్నించగలరు. నిన్న రాత్రే నడిగడ్డ నుంచి తిరిగి వచ్చాను.వరద తగ్గి ఇప్పుడిప్పుడే బాధితులు వారి ఇళ్ళముఖం పట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము కొరివిపాడు,మద్దూరు,పుల్లూరు,అలంపూరు తదితర గ్రామాల ఆపన్నులను కలిశాము.పూర్తిగా నీటపాలయ్యాయి.మగ్గాలు మునిగి పోయాయి.చాలా నష్టం జరిగింది.చంద్రలత