కొంకణా సేన్ కొత్త సినిమా అంటే చూద్దామని బయలుదేరా.
సినిమాలో కొంకణ కలకత్తా నుంచి ముంబాయి కి వచ్చి తన అస్తిత్వాన్నికి రూపురేఖలు దిద్దుకునే ప్రయత్నంలో సిద్ ను కలుస్తుంది.
సిద్ ఒక విజయవంతమైన వ్యాపారి ఏకైక సంతానం.
గారాబపు రక్షణ రేఖ అతనిని ఒక పసివాడిగా గానే ఉంచుతుంది.పై నుంచి ,మొండితనమూ.
వీరువురి పరిచయం ... స్నేహం.. ప్రేమ ..సినిమా.వేక్ అప్ సిద్ ! అన్నీ బావున్నాయి. మనలోంచి నడిచి వెళ్ళినట్లుగా ..ప్రతి పాత్రా..పలకరిస్తుంది. మనలో వారిని వెతుక్కునేట్లు చేస్తుంది.కలలనగరం ముంబాయి లో ..చిన్నా పెద్దా మనుషులు. అందంగా చిత్రించారు.ఏది ఏమైనప్పటికీ.. అనిపించింది కదా..సరిగ్గా ఇలాంటి కథ తెలుగు "గమ్యం" సినిమాదీ అని.
ఎటొచ్చి , గమ్యం లో సామాజిక అవగాహాన ఆ కథానాయకుడికి వ్యక్తిగత జీవితాన్ని దిద్ద్దుకోవడానికి తన తాను మూర్తిమత్వం పొందడానికి ప్రేరణ అయితే.. సిద్ లో .. మానవ సంబంధం అర్ధం చేసుకోవడం లోనే ...ఒక గమ్యం ఏర్పడుతుంది.తెలుగులో ఆదర్ష పాత్రలూ ఉపన్యాసాలు తప్పలేదు.
కొంకణ సినిమాలో .. హావాభావాలు ..మాటలు ..వాతావరణం .. ఆ పనిని చక్కగా చేసేసాయి.మరింత సున్నితంగా ఏమైనా, ఒక సారి చూడతగ్గ సినిమాలు .. ఈ రెండూను.
అన్నట్లు, ఒకనాటి "జిందగీ " స్టార్ సుప్రియాపాఠక్ ను మళ్ళీ చూడడం బావుంది.
No comments:
Post a Comment