May 31, 2014

పాటాడే పిట్టమ్మజీవితాన్ని ప్రేమించండి
దానిలో నిమగ్నమైపొండి.
మీరు ఇవ్వగలిగినదంతా దానికి ఇవ్వండి.
బోలెడంత అభినివేశంతో ప్రేమించండి.
ఎందుకంటే , 
మీరు ఇచ్చినదంతా జీవితం 
మీకు తిరిగి ఇస్తుంది.
మళ్ళీ..మళ్ళీ.

మాయ ఏంజిలో


 ***
ఏడేళ్ళ పసిబిడ్డ మీద అమ్మస్నేహితుడే అఘాయత్యం చేసినపుడు, తన అన్నతో మాట్లాడిందే తన ఆఖరి వాక్యం. మూగబోయిన ఆ గొంతు మళ్ళీ విప్పుకోవడానికి ఏడేళ్ళు పట్టింది.

ఈ లోగా, తెల్లవారితోనే ఆర్ధికవ్యవహారాలు చేయగలిగిన   వంటరి అమ్మమ్మ, ఆమె తెచ్చి ఇచ్చిన బోలెడన్ని పుస్తకాలు,
 చిన్న పుస్తకాన్ని చెక్కిన పెన్సిలుముక్కను దారంతో ముడేసి ..లోకంతో బాంధవ్యం కలిపిన అమ్మమ్మ ...మమా...

 "కవితలను పాడలేక తున్నావంటే   నీకు కవిత్వమంటే ఇష్టం లేదులే"  అంటూ పూనుకొని వత్తిడి పెట్టి మరీ,ఉక్రోషంతో తన చిట్టి గళం విచ్చుకొనేలా చేసిన మంచి పద్యాల పంతులమ్మ ,

తనకెంతో ఇష్టమైన వాక్యాలు రచించిన షేక్స్ పియర్  తన లాంటి దక్షిణాది నల్లమ్మాయి అని బలంగా నమ్మిన పసినాటి అమాయకత్వం ...
అన్నింటా చేదోడు వాదోడుగా ఉన్న అన్నయ్యా..
మూగబోయిన  ఆ అమృత గళం విప్పినపుడు , అది విశ్వమానవ సౌభాగ్యానికే అంటూ దిశానిర్దేశం చేసిన నాయకుడు మార్టిన్ లూథర్ కింగ్...

నాయకుని అదేశానుసారం యుద్ధభూమిలో దూకడానికి తన పుట్టినరోజు నాటి వరకూ గడువు కోరి, ఆనాడే ఆ నాయకుని హత్యావార్తను వినవలసి రావడం,
ఆ దుఃఖం  లో మునిగి ఉన్నతన తలుపులను బద్దలు కొట్టి మరో సారి విశాల ప్రపంచం వైపు ... తన అక్షరాలతో వంతెన నిర్మించుకొనే ... స్థైర్యాన్ని నిర్దేశాన్ని ఇచ్చిన అన్నయ్య.. అతని స్నేహితులు...

ఒకటా రెండా... ఈ కవయిత్రి,ఆత్మకథారచయిత్రి, గాయకురాలు, ఉపాధ్యాయురాలు ,నాయకురాలు,వక్త,బహుభాషాకోవిధురాలు.బహు గ్రంథ కర్త ...
మనసు  విప్పి చెప్పే జీవితరహస్యాలు.
" నేను మానవిని. మానవ సంబంధమైనదేదీ నాకు పరాయిది కాదు ! " అని మరొక మారు ఢంకా బజాయించి చెపుతున్నారు.

వినగలిగిన  వారికి విన్నంత.
తెలుసుకోగోరిన వారికి తెలుకోగలిగినంత.
ఎందుకంటే, ఇది  విశాలమైనదీ.లోతైనదీ.గాఢమైనదీ.
అన్నిటికీ మించి... సజీవమైనది!
ఇది జీవితం.
***
అందుకేనేమో మాయా అంటారు, "ప్రేమ బంధీలను చేయదు.విముక్తులను చేస్తుంది." అని.

కారుమబ్బులలో ఇంద్రధనుస్సులను చూదగలిన ఆ విదుషీమణి మర్మమేమిటో..
మీరూ
చూడండి మరి.
http://www.tudou.com/programs/view/i9bwAfwuYyg/


Photo: We have lost one of the most eloquent, elegant and powerful Articulators of Spoken Word and Education. Dr. Maya Angelou was a mentor who taught us all how to overcome and enjoy life as GOD wants us to. If you have not, please watch her Soul Sunday with Oprah: http://bit.ly/1mqc5I6 It will change your life!! She will be missed!!


"తెల్ల"బారిన ఆలోచనలను 
గడగడలాడించి,

తేలివచ్చిన అనుభూతులను 
నల్లబరిచి,

పంజరం లో పాటాడే పిట్టమ్మ
గుట్టు విప్పి ,

నిశ్శబ్దంలోకి
మాయమై పోయిన మాయా..
జోహార్ ! 


All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

May 25, 2014

అమాయకత్వంలోంచి ...!!!

ఒక్కో సారి అంతే.
ఒక  గట్టి పట్టుబట్టి కూర్చున్నామా , ఆ పట్టుదలను ఇట్టే గట్టున పెట్టేయాల్సివస్తుంది.
ఎంతయినా మానవ మాత్రులం కదా!
ఈ వేసం కాలం సెలవల్లో ,బుద్ధిగా కూర్చుని చదువుకొందాం అనుకొన్నా.
అలాగే , నిద్రలో పడుతూ లేస్తూ చదువుకొంటూ ఉన్నానా,
Nagavva , Ari Vishvanathan PoodOTa Anna Mary
రమేశన్న ఆహ్వానం."అమ్మా మీరు హోసూరు రావాలని."
 చాలా వినయంగా రానన్నానా ,అప్పుడు వారొక రహస్యం చెప్పారు.
మా అయ్యవారు వారికుటుంబ సమేతంగా విచ్చేయువారని !
పంతులుగారే పయనమవుతోంటే, ఇక చదువెక్కడ..? కొండెక్కింది.
బుద్ధిగా ఒట్టుతీసి గట్టున పెట్టి, వచ్చేస్తానని గబుక్కున ఒప్పేసుకొన్నా.
 వూరక పిలవరు కదా మహానుభావులు !
ఒక పుస్తకం పంపించి , నాలుగు ముక్కలు మాట్లాడమన్నారు.
 మరీ మంచిది.రేపొద్దున వస్తినమ్మ పోతినమ్మ అనుకోకుండా..నాలో నాకు కుసింత మనశ్శాంతి.
తీరా ఆ పుస్తకం వచ్చాక చూస్తే ,అందులో పది పుస్తకాలున్నాయ్!
హోసూరు కతల పై  డా. రాయదుర్గం విజయ లక్ష్మి గారు చేసిన రేడియో ప్రసంగాలు.
ఒక్కో ప్రసంగ వ్యాసం చదువుతూ ఉంటే , ఆయా పుస్తకాలు నా కళ్ళ ముందు బొమ్మ కట్టాయి. మానవ మనుగడలోని మర్మాలనూ సంఘర్షణలనూ... నవ్వుతూనే నిలదొక్కుకొన్న విషాదభరిత జీవితాలను. జీవితగమనంలో మానుపు కున్న గాయాలను. ఆ మానవ స్పర్షే ముఖ్యంగా నన్ను ఆకర్షించింది .ఇక, అందులోని నుడి నానుడి ఎత్తుగడ కథాకథనాల సంగతి సరేసరి.
"ఇవి కథలా?  సామాన్య సమీకరణాలలో కాకపోవచ్చు." ఉమా మహేశ్వర రావు గారు అన్నారు. " కథలకన్నా జీవితం విస్తృతమైనదనీ లోతయినదనీ గాఢమైనదనీ, ఈ రచనలు సవినయంగా తెలియజేస్తాయి . దానికి అవసరమైన కథన విధానాలను అది వెతుక్కోనే క్రమంలో విరిసిన కథాసుమాలనీ" 
రమాసుందరి గారు పట్టుమని పంతొమ్మిదేళ్ళు లేని సుమ , పొయ్యిగడ్డను అడ్డుగా పెట్టుకొని ఆవిష్కరించిన జీవితం సుమ ప్రజ్ఞాపాటవాలతో పాటు బోలెడంత అమాయకత్వంలోంచి వొలికినదని వ్యాఖ్యానించారు.
నిజం.
ఆ పూట వెళ్ళగానే, అక్కా అని  నోరారా పలకరించి , ప్రతి అవసరాన్ని  కనిపెట్టుకొని ఉన్న్ అమరనారా బసవ రాజు గారు  కానీయండి , మునిరాజు గారు కానివ్వండీ , ఓట్ర పురుషోత్తం గారు కానివ్వండి .... ఆప్యాయత ఆర్తి లతో పాటు, అంతులేని నమ్మకాన్ని కలిగించారు.  మానవ జీవితం పట్ల ఆపేక్ష , మానవ సంబంధాల పట్ల మమకారం ఉన్నవారే కదా మంచి రచయితలుగా ఎదగ గలరు!
ఇక, నంద్యాల నారాయణ రెడ్డి గారి చెణుకుల గురించి చెప్పేది ఏముంది ? నవ్వుతూ నవ్విస్తూ ,  గుండె చెలమల్లోంచి కళ్ళల్లోకి నీళ్ళు చిప్పిల్లేలా చేయగల రచయిత.మానవ సంబంధాల పట్ల అంతులేని గౌరవం.
ఆ రాత్రి డా.అగరం వసంత్, నీలావతి గార్ల ఇంట బస. పాలపూరీలతో పాటు కమ్మని భోజనం. కబుర్లు.
పూదోట తోడికోడళ్ళు అన్నా మేరీ, శౌరీలు  గార్ల తరతరాల కబుర్లు. సుహాసిని ముక్తాయిపులు. అనూరాధ విదేశాల్లో తెలుగు వాళ్ళ కబుర్లు.
 ఇక, మరునాడు ఉదయాన్నే ,వసంత్ గారు సువాసనల ఆకుతోటకు నడక.దారిలో పందుల పెంపక కేంద్రం చూడడం.
కైవారం నారాయణ తాత మండపానికి వెళ్ళడం. అక్కడి స్థంభాలపై  శాశ్వతీ కరించ బడిన తెలుగు పలుకులను చూసి సంతోషం. 
మాతో జతచేరిన ఉడుముల పేట తెలుగు యువబృందం , కవిత వసంత్ దంపతులు , మీసాలు మెలేస్తూ..విశ్వ నాధ నాయకుడు.
ఇక, ఇరులదొడ్డికి ప్రయాణం. గద్దల బండను దాటి . వీరప్ప శివణ్ణ లు దారి చూపుతుండగా , నాగవ్వ ఇంటికి ప్రయాణం.
నారాయణ రెడ్డిగారి ఇరులదొడ్డికతలలో , నాగవ్వ, మోటన్నలు ప్రధాన పాత్రలు. ఆలమందలను మేపుకొంటూ, ఆ మేలగిరులకు చేరిన వైనం, అక్కడే నిలిచి ,కొండకొమ్మున ఒక వూరిని నిర్మించుకోవడం, ఇరుల ( సుగాలీలతో ) వారితో పరస్పర సహజీవనం.
నారాయణ రెడ్డి గారు తాము అడవిని చదును చేసి ,సాగు చేసిన భూమిని చూపిస్తున్నప్పుడు ,తన స్నేహితుడితో కలిసి తవ్వుకొన్న బావిని చూపిస్తున్నప్పుడు .. ఒంటరిగా ఓ బండమీద నిలబడి తప్పెటలు కొడుతూ ఏనుగులను తరిమి కొడుతూ ,పంటను కాపాడుకొన్న పోరాటాన్ని గురించి చెపుతున్నప్పుడు.. ప్రకృతితో మనిషి పోరాటంలా తోచింది.
పాండవ గవులు లో పార్థీవ శరీరాలను విడిచిపెట్టే వైనం , దయ్యాల కోనపై కమ్ముకొన్న భయాలు, దారి పక్కన తారస పడిన దేవకన్యతో పరాచికాలు ... ఒకటా రెండా అక్కడ ఏ రాయిని కదిలించినా కమ్మటి కబుర్లు.
కప్పిన నూలుకండువాలు. అక్కడ పూచిన గుబాళించే  పూలగుత్తులు. 
కమ్మని భోజనం .నాగవ్వ మోటన్నల ఆతిధ్యం ,సాయంకాలం సంగీత ఝరి,  
దక్షిణాదిన తెలుగు వారి  ఇబ్బందులు ఇక్కట్లు ఇష్టాఇష్టాలు.
 వెరసి హోసూరు కతల పండుగ!
మళ్ళెప్పుడు ఆహ్వానం వస్తుందబ్బా అని ఎదురు చూస్తూ,
అప్పటిదాకా తోడుగా పద్నాలుగు పుస్తకాలను తెచ్చుకొన్నా.

మరి మీరు ?
At the statue of KOdanda Ramayya garu

poddunnE poolu 

taaTibellam acculu 

poyogada katalu aavishkaraNa

porugu telugu batukulu aavishkaraNa.

sabha 


maa dakshinaadi gODu vinanDi

suvaasanala aakutOTa 

Dr. Agaram Vasanth ,Neelavathi gari vaakiTlO


gaddala banda 

maa vooLLO Telugu nErpanDee !venakaala lOya deyyaalakOna

paandava gavulu

ententa ettO choosaaraa?

Otra Pushottam garu

irula paaTa 

raati kanche daaTu

dEva kanya tO paraachkaalu


sangeetham 
Related links: http://prabhavabooks.blogspot.in/2014/05/blog-post_24.html

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

May 24, 2014

ఏమయింది నా రాతలకి...?!?


నిండా పంతొమ్మిదేళ్ళు రాని వయసులో రాయడం మొదలెట్టి ,
ఈ కొద్దికాలంలోనే తన రాతలను ఒక పుస్తకరూపంలో అందుకొంటున్న ఆ క్షణాన 
సుమను చూస్తే ఎంత ముచ్చటేసిందో ! 
***
నేను రాసిండే దానిని చదవతా పడి పడీ నగుతా ఉండాడు  మునిగాడు. నాకు రేగిపోయింది. 
"ఏమయింది నా రాతలకి ఏల అట్లా  నగేది,చెప్పి చావు " అని అరిస్తిని. 
అపుడు చెప్పినాడు మా అన్న...
http://prabhavabooks.blogspot.in/2014/05/blog-post_24.htmlకుమారి రామక్క గారి సుమ 

Add caption

రామక్క గారి సుమ ,శ్రీమతి రమాసుందరి ,డా .లక్ష్మీ సుహాసిని , శ్రీమతి పూదోట అన్న మేరీ
 

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

May 19, 2014

చిటుక్కు పటుక్కు

వేమన పద్దెమునకు ఎదురు పద్దెము లేదు. 
రామలచ్చుమనులకన్నా రాజు లేరు.
సతీపతికన్న సంగాతి లేదయ్యా.
విశ్వదాభి రామ వినుర వేమా !


ఇదేదో నేను ఆశువుగా అల్లేనని
మోసపోయేరు సుమా !
 ఎంత ధైర్యం  ! వేమననే  కాపీ  జేస్తావా అని కళ్ళెర్ర జేసేరు !!

ఎవరికి వారు వేమన పద్యాలు కట్టుకొని,
 హాయిగా పాడుకొంటున్నారట.
 పదికాలాల పాటుగా.
హోసూరు.... తెల్లకొక్కర్ల తెప్పంలో !

 చిటుకు పటుక్కు చెనిక్కాయలు ...
అబ్బే కాలక్షేపం పల్లీలు కావండీ..
పొరుగు బతుకు వెతలు..
ఎర్నూగు పూలు,మొరుసునాడు కతలు,ఇరులదొడ్డి బతుకులు, తొండనాడు కతలు .. .
అంతేనా  ఎనిమిది వందల ఏళ్లనాడు ..
కృష్ణను వదిలి హోసూరు చేరిన కి.రాజనారాయణ గారి , గోపల్లె.
ఇన్ని పుటల్లో వాళ్ళ బతుకుల్ని పరిచారు.

ఓ మారు తొంగి చూడండర్రా అని పిలుపులు పంపారు...
అవును...  మన జతగళ్ళు కత గాళ్ళూ.

హోసూరు కు మీరెంత దూరమైనా.. హోసూరు మీ ముంగిట్లోకి వస్తోంది.

                                                                                            నా మాట నమ్మక పోతే ,
                                                                                           మీ పుస్తకాల అంగట్లో అడగండి !

           ఇ-దుకాణమో ఏ దుకాణమో!

                            ***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

May 14, 2014

తెలుగమ్మ పలుకు !

ఊరిని చూడాలని కొండ దిగి ,
భార్యతో పాటు ఎద్దుపై వచ్చిన చంద్ర చూడేశ్వర స్వామి,
ఉత్తిత్తినే నిందించే జనుల మాటలకు విసిగిపోయి,
" ఏమి చేసినా విమర్శ చేస్తా ఉండారు, ఈ జనం , ఎట్లాప్పా?"
అని రామస్వామితో మొరబెట్టుకొన్నాడట!

"శివప్పా! లోకులు కాకులు.
వాళ్ళ మాటలు పట్టించుకొంటే అంతే!
నేను సత్యము తెలుసుకొనేటప్పటికి
రామాయణం ముగిసిపోయింది " అన్నాట్ట !

 జతగాళ్ళు కతగాళ్ళు ( హోసూరు)

మట్టిలో పుట్టి,  మానులతో మాకులతో పెరిగి,
గుట్టలు మిట్టలు ఎక్కి, ఏటిలో నీటిలో ఈది ,
గట్టుపై మిట్టపై పల్టీలు కొడుతోన్న ..
ఆ తెలుగమ్మ పలుకుల్నీ పలుకుబడుల్నీ
మీరూ మూట కట్టుకోవాలంటే,
మీరూ హోసూరుకు రావాల్సిందే  ,
మరో మార్గం లేదు !
***
రాండప్పా... జతగాళ్ళు కతగాళ్ళు మీకోసం కాపుకాసుండారు ! 

మే 21 -23 , హోసూరు నందు
 3 కథాసంపుటాలు, ఒక సాహితీ విశ్లేషణ 
 (రేడియో ప్రసంగాలు) పుస్తకం విడుదల వేడుక .

కథాభిమానులు మరిన్ని వివరాలకు  స వెం రమేశ్ గారిని సంప్రదించ మనవి.
8500548142

డా. రాయదుర్గం విజయ లక్ష్మి గారికి ధన్య వాదాలతో.
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

May 7, 2014

"శాయన్న" సందిగ్దం.

చిన్నప్పటినుంచీ వింటున్న పేరిది.
నడిగడ్డ ప్రాంతాన నందికొట్కూరు చుట్టు పక్కల  తరుచు వినపడేది.
ముఖ్యంగా కాయకష్టం నమ్ముకొన్న బడుగు జీవులలో.
తాతలు,  తాతలతాతలు ఉండేవారు.

దృశ్యాదృశ్యం రాసేప్పుడు , ఆ పేరు చేపలు పట్టే తాతకి సరిపోతుందని ,
ఎంతో ఇష్టంగా పెట్టుకొన్నాను.

ఇప్పుడొచ్చిన సందేహం ఏంటంటే,
శాయన్న పేరుకు మూలం "సాయి బాబా" అన్న తీర్మానం ఒకటి నా కంట బడింది.

నిజమే, రాయలసీమలో గణతికెక్కిన సాయిబాబాలు పలువురు.

అయితే ఏం ?
శాయన్న తాత పురాతనమైనవాడు కదా .. ఇదెక్కడ నడమంత్రం ?

భాషావేత్తల అభిప్రాయం తెలుసుకొందామని ,అడగడం.
సందేహ నివృత్తి చేయ మనవి.

పేరులో ఏముంది అనబోయేరు !
పేరులో  స్వభావం, సమయం, సంస్కృతి,ప్రాంతం, ..అన్నీ ఇమిడ్చే కదా, 
పాత్రని పరిచయం చేస్తాం !  

ముందస్తు ధన్యవాదాలు

Related Link:

ఒకానొక శబ్దం... తరంగమై !

http://chandralata.blogspot.in/2013/09/blog-post_23.html


***All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

May 4, 2014

ఆ మాత్రం తెలియదటే?

Gopichand
"..సరేగానీ, నాన్న పెద్దవాడు గదా -అన్నీ తెలుసా? " అని అడిగింది .(పాప)

"అన్నీ తెలుసునమ్మా.."

"మరి, తొమ్మిది పదమూళ్ళు ఎంత నాన్నా అంటే నాకు తెలియదు అన్నారే ? "అని అడిగింది.

"ఏదో ఆలోచిస్తూ అన్నారు గానీ ,ఆ మాత్రం నాన్న కు తెలియదటే?"

"తెలియదమ్మా - ఒట్టు!మొన్న నక్షత్రాలలో  ఏముంటుంది నాన్నా ? అని అడిగితే నాకు తెలియదని కోప్పడ్డారు" అంది కూతురు"నిజం అమ్మా ! నువ్వడుగు -గాలి ఎట్లా వస్తుందో చెప్పమను .ఆకాశం ఎంత ఎత్తున ఉందో చెప్పమను. కొబ్బరిచెట్టు ఏయే పనులకు పనికి వస్తుందో నూనె చేయు విధమూ చెప్పమను..."

గోపీచంద్ ,
అసమర్థుని జీవ యాత్ర ,(1947)

***


All rights @ writer. Title,labels, postings and related copyright reserved.