ఒక్కో సారి అంతే.
Related links: http://prabhavabooks.blogspot.in/2014/05/blog-post_24.html
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
ఒక గట్టి పట్టుబట్టి కూర్చున్నామా , ఆ పట్టుదలను ఇట్టే
గట్టున పెట్టేయాల్సివస్తుంది.
ఎంతయినా మానవ మాత్రులం కదా!
ఈ వేసం కాలం సెలవల్లో ,బుద్ధిగా
కూర్చుని చదువుకొందాం అనుకొన్నా.
అలాగే , నిద్రలో పడుతూ లేస్తూ
చదువుకొంటూ ఉన్నానా,
Nagavva , Ari Vishvanathan PoodOTa Anna Mary |
రమేశన్న ఆహ్వానం."అమ్మా మీరు
హోసూరు రావాలని."
చాలా వినయంగా రానన్నానా ,అప్పుడు వారొక రహస్యం చెప్పారు.
మా అయ్యవారు వారికుటుంబ సమేతంగా
విచ్చేయువారని !
పంతులుగారే పయనమవుతోంటే, ఇక
చదువెక్కడ..? కొండెక్కింది.
బుద్ధిగా ఒట్టుతీసి గట్టున పెట్టి,
వచ్చేస్తానని గబుక్కున ఒప్పేసుకొన్నా.
వూరక పిలవరు కదా మహానుభావులు !
ఒక పుస్తకం పంపించి , నాలుగు
ముక్కలు మాట్లాడమన్నారు.
మరీ మంచిది.రేపొద్దున వస్తినమ్మ పోతినమ్మ అనుకోకుండా..నాలో
నాకు కుసింత మనశ్శాంతి.
తీరా ఆ పుస్తకం వచ్చాక చూస్తే
,అందులో పది పుస్తకాలున్నాయ్!
హోసూరు కతల పై డా. రాయదుర్గం విజయ లక్ష్మి గారు చేసిన రేడియో ప్రసంగాలు.
ఒక్కో ప్రసంగ వ్యాసం చదువుతూ
ఉంటే , ఆయా పుస్తకాలు నా కళ్ళ ముందు బొమ్మ కట్టాయి. మానవ మనుగడలోని మర్మాలనూ సంఘర్షణలనూ...
నవ్వుతూనే నిలదొక్కుకొన్న విషాదభరిత జీవితాలను. జీవితగమనంలో మానుపు కున్న గాయాలను.
ఆ మానవ స్పర్షే ముఖ్యంగా నన్ను ఆకర్షించింది .ఇక, అందులోని నుడి నానుడి ఎత్తుగడ కథాకథనాల
సంగతి సరేసరి.
"ఇవి కథలా? సామాన్య సమీకరణాలలో కాకపోవచ్చు." ఉమా మహేశ్వర
రావు గారు అన్నారు. " కథలకన్నా జీవితం విస్తృతమైనదనీ లోతయినదనీ గాఢమైనదనీ, ఈ రచనలు
సవినయంగా తెలియజేస్తాయి . దానికి అవసరమైన కథన విధానాలను అది వెతుక్కోనే క్రమంలో విరిసిన కథాసుమాలనీ"
రమాసుందరి గారు పట్టుమని పంతొమ్మిదేళ్ళు
లేని సుమ , పొయ్యిగడ్డను అడ్డుగా పెట్టుకొని ఆవిష్కరించిన జీవితం సుమ ప్రజ్ఞాపాటవాలతో
పాటు బోలెడంత అమాయకత్వంలోంచి వొలికినదని వ్యాఖ్యానించారు.
నిజం.
ఆ పూట వెళ్ళగానే, అక్కా అని నోరారా పలకరించి , ప్రతి అవసరాన్ని కనిపెట్టుకొని ఉన్న్ అమరనారా బసవ రాజు గారు కానీయండి , మునిరాజు గారు కానివ్వండీ , ఓట్ర పురుషోత్తం
గారు కానివ్వండి .... ఆప్యాయత ఆర్తి లతో పాటు, అంతులేని నమ్మకాన్ని కలిగించారు. మానవ జీవితం పట్ల ఆపేక్ష , మానవ సంబంధాల పట్ల మమకారం
ఉన్నవారే కదా మంచి రచయితలుగా ఎదగ గలరు!
ఇక, నంద్యాల నారాయణ రెడ్డి గారి
చెణుకుల గురించి చెప్పేది ఏముంది ? నవ్వుతూ నవ్విస్తూ , గుండె చెలమల్లోంచి కళ్ళల్లోకి నీళ్ళు చిప్పిల్లేలా
చేయగల రచయిత.మానవ సంబంధాల పట్ల అంతులేని గౌరవం.
ఆ రాత్రి డా.అగరం వసంత్, నీలావతి
గార్ల ఇంట బస. పాలపూరీలతో పాటు కమ్మని భోజనం. కబుర్లు.
పూదోట తోడికోడళ్ళు అన్నా మేరీ, శౌరీలు గార్ల తరతరాల కబుర్లు. సుహాసిని ముక్తాయిపులు. అనూరాధ విదేశాల్లో తెలుగు వాళ్ళ కబుర్లు.
పూదోట తోడికోడళ్ళు అన్నా మేరీ, శౌరీలు గార్ల తరతరాల కబుర్లు. సుహాసిని ముక్తాయిపులు. అనూరాధ విదేశాల్లో తెలుగు వాళ్ళ కబుర్లు.
ఇక, మరునాడు ఉదయాన్నే ,వసంత్ గారు సువాసనల ఆకుతోటకు
నడక.దారిలో పందుల పెంపక కేంద్రం చూడడం.
కైవారం నారాయణ తాత మండపానికి
వెళ్ళడం. అక్కడి స్థంభాలపై శాశ్వతీ కరించ బడిన
తెలుగు పలుకులను చూసి సంతోషం.
మాతో జతచేరిన ఉడుముల పేట తెలుగు
యువబృందం , కవిత వసంత్ దంపతులు , మీసాలు మెలేస్తూ..విశ్వ నాధ నాయకుడు.
ఇక, ఇరులదొడ్డికి ప్రయాణం. గద్దల
బండను దాటి . వీరప్ప శివణ్ణ లు దారి చూపుతుండగా , నాగవ్వ ఇంటికి ప్రయాణం.
నారాయణ రెడ్డిగారి ఇరులదొడ్డికతలలో
, నాగవ్వ, మోటన్నలు ప్రధాన పాత్రలు. ఆలమందలను మేపుకొంటూ, ఆ మేలగిరులకు చేరిన వైనం,
అక్కడే నిలిచి ,కొండకొమ్మున ఒక వూరిని నిర్మించుకోవడం, ఇరుల ( సుగాలీలతో ) వారితో పరస్పర
సహజీవనం.
నారాయణ రెడ్డి గారు తాము అడవిని
చదును చేసి ,సాగు చేసిన భూమిని చూపిస్తున్నప్పుడు ,తన స్నేహితుడితో కలిసి తవ్వుకొన్న
బావిని చూపిస్తున్నప్పుడు .. ఒంటరిగా ఓ బండమీద నిలబడి తప్పెటలు కొడుతూ ఏనుగులను తరిమి
కొడుతూ ,పంటను కాపాడుకొన్న పోరాటాన్ని గురించి చెపుతున్నప్పుడు.. ప్రకృతితో మనిషి
పోరాటంలా తోచింది.
పాండవ గవులు లో పార్థీవ శరీరాలను
విడిచిపెట్టే వైనం , దయ్యాల కోనపై కమ్ముకొన్న భయాలు, దారి పక్కన తారస పడిన దేవకన్యతో
పరాచికాలు ... ఒకటా రెండా అక్కడ ఏ రాయిని కదిలించినా కమ్మటి కబుర్లు.
కప్పిన నూలుకండువాలు. అక్కడ
పూచిన గుబాళించే పూలగుత్తులు.
కమ్మని భోజనం .నాగవ్వ మోటన్నల ఆతిధ్యం ,సాయంకాలం సంగీత ఝరి,
దక్షిణాదిన తెలుగు వారి ఇబ్బందులు ఇక్కట్లు ఇష్టాఇష్టాలు.
వెరసి హోసూరు కతల పండుగ!
కమ్మని భోజనం .నాగవ్వ మోటన్నల ఆతిధ్యం ,సాయంకాలం సంగీత ఝరి,
దక్షిణాదిన తెలుగు వారి ఇబ్బందులు ఇక్కట్లు ఇష్టాఇష్టాలు.
వెరసి హోసూరు కతల పండుగ!
మళ్ళెప్పుడు ఆహ్వానం వస్తుందబ్బా
అని ఎదురు చూస్తూ,
అప్పటిదాకా తోడుగా పద్నాలుగు
పుస్తకాలను తెచ్చుకొన్నా.
poddunnE poolu |
taaTibellam acculu |
poyogada katalu aavishkaraNa |
porugu telugu batukulu aavishkaraNa. |
sabha |
maa dakshinaadi gODu vinanDi |
suvaasanala aakutOTa |
Dr. Agaram Vasanth ,Neelavathi gari vaakiTlO |
gaddala banda |
maa vooLLO Telugu nErpanDee ! |
venakaala lOya deyyaalakOna |
paandava gavulu |
ententa ettO choosaaraa? |
Otra Pushottam garu |
irula paaTa |
raati kanche daaTu |
dEva kanya tO paraachkaalu |
sangeetham |
Related links: http://prabhavabooks.blogspot.in/2014/05/blog-post_24.html
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
ఎంత బాగా రాశారో....ఇవన్నీ ఇప్పుడు అర్జెంట్ గా చదివేయ్యలీ అనిపిస్తుంది.
ReplyDeleteగత సంవత్సరం మేము పొందిన ఆనంద సంఘటనల సమూహలతోపాటు అమృతమూర్తి నాగవ్వ కురిపించిన వరాలజల్లులను మరోసారి మదినిండా పొందికగా మూటగట్టుకున్నాను.చాయా చిత్రాలతో మీ వ్యాసానికి మరింత వన్నె పెరిగింది.అందించిన మీకు ధన్యవాదాలు.
ReplyDeleteరాలేక పొయ్యాను..కొంతలో కొంత మీ ఈ టపా కొంత వెలితిని పూర్తి చేసింది.
ReplyDelete