May 4, 2014

ఆ మాత్రం తెలియదటే?

Gopichand
"..సరేగానీ, నాన్న పెద్దవాడు గదా -అన్నీ తెలుసా? " అని అడిగింది .(పాప)

"అన్నీ తెలుసునమ్మా.."

"మరి, తొమ్మిది పదమూళ్ళు ఎంత నాన్నా అంటే నాకు తెలియదు అన్నారే ? "అని అడిగింది.

"ఏదో ఆలోచిస్తూ అన్నారు గానీ ,ఆ మాత్రం నాన్న కు తెలియదటే?"

"తెలియదమ్మా - ఒట్టు!మొన్న నక్షత్రాలలో  ఏముంటుంది నాన్నా ? అని అడిగితే నాకు తెలియదని కోప్పడ్డారు" అంది కూతురు"నిజం అమ్మా ! నువ్వడుగు -గాలి ఎట్లా వస్తుందో చెప్పమను .ఆకాశం ఎంత ఎత్తున ఉందో చెప్పమను. కొబ్బరిచెట్టు ఏయే పనులకు పనికి వస్తుందో నూనె చేయు విధమూ చెప్పమను..."

గోపీచంద్ ,
అసమర్థుని జీవ యాత్ర ,(1947)

***


All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

2 comments:

  1. గోపిచండ్ దొరికాడుగా మీకు!
    అసమర్ధుడా? !
    మొన్న ఇక్కడ "ఆలంబన" లో ఈ పుస్తకం గురించి మాట్లాడమని అని అడిగారు నన్ను. చూపు కాత్యాయని గారు కూడ దానికోసమే వచ్చారు. కారణాంతరాలవల్ల కుదరలేదు. మరోసారి. కాకతాళీయంగా భలే కలుస్తూవుంటాయ్ కొన్ని! మీ మడతపెట్టిన పేజ్..నా "అసమర్ధ" టాకు. చి న.

    ReplyDelete
  2. మన లోలోకి మనలను చూసుకొమ్మనేగా గోపిచంద్ గారి ఉవాచ! :-)
    ఎవరైన ఒక కొత్త మటాడితే ,ఒక ముక్క మా చెవిలోనూ వేయండి. ఎంతైయినా విద్యా'ర్థులం!'

    ReplyDelete