అవునా?
నిజమా?
నిజమేనా?
పండువెన్నెల పదాలతో గజిబిజి గందరగోళాల
చిక్కుముళ్ళు వేసేసి,దారితప్పిన పాఠకుల్ని చూసి చిద్విలాసపు చిరునవ్వులు చిందిస్తూ ,
అదృశ్యమై పోయానని మురిసి పోతున్నావేం?
ఒకటా రెండా.. యాభై ఏళ్ళు మా చేత ముప్పతిప్పలు పెట్టించావేం?
నీ రహస్యాలు మాకు తెలిసిపోయాయిలే !
నీవు మా ముందుంచి పోయిన
కథల్లోంచి చరిత్రనీ,
చరిత్ర లోంచి జీవితాన్ని,
జీవితంలోంచి మానవ ఔన్నత్యాన్ని ...
మేం గ్రహించలేక పోయామనుకున్నావా?
ఇలా చెప్ప పెట్టకుండా తిరిగి రాని చోటికి వంటరిగా పయనమై పోయావ్?
మా అభిమానం,గౌరవం నిన్ను చుట్టుముట్టేసి ఉంటుందని మరిచిపోయావా?
నీవెప్పుడు వంటరి వాడివి?
తెలుసుకోండి చూద్దామని , మమ్మల్ని పదాలప్రహేళికల వెనుక పరుగులు పెట్టించావా?
నీ మాటల గుట్టులన్నీ తెలుసుకోలేం అనుకున్నావా?
చిక్కుముళ్ల ఇంద్రజాలాలను ఛేదించలేమనుకొన్నావా?
శుభ్రంగా ఉతికి ఆరేసిన దుప్పట్లతో బాటు , గాల్లోకి తేలే తంత్రం ...
మాకు తెలియదనుకొన్నావా?
గుంభనంగా నవ్వుతూ?
మా గుండెల్లో తిష్టవేయలేదూ?
***
అవునా?
నిజమా?
నిజమేనా?
మాటల మాంత్రికుడు మనలోంచి మాయమైపోగలడా ?
***
మాటల మాయావికి జేజే !
మనసున్న మేధావికి జేజే!
మార్క్వెజ్ కు బోలెడంత అభిమానంతో ..
వీడ్కోలు.
***
Some thing VERY personal !
" One Hundred years of Solitude "( English translation)
is as old as me !
no.. no.. As Young as me !
***
గబ్రియెల్ గర్సియా మార్కిస్ ...(మార్క్వెజ్ అంటాం మనం :-)>
(http://en.wikipedia.org/wiki/File:Es-Gabriel_Garcia_Marquez.ogg)
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
నిజమా?
నిజమేనా?
మాటల మాంత్రికుడు మనలోంచి మాయమైపోయాడా?
ఇక,అక్షరాల్లోంచి పసుపు పచ్చని పిట్టలు...
సీతాకోక చిలుకల గుంపులు.. ఉవ్వెత్తున ఎగిసిపడవా?
***
అవున్లే,పండువెన్నెల పదాలతో గజిబిజి గందరగోళాల
చిక్కుముళ్ళు వేసేసి,దారితప్పిన పాఠకుల్ని చూసి చిద్విలాసపు చిరునవ్వులు చిందిస్తూ ,
అదృశ్యమై పోయానని మురిసి పోతున్నావేం?
ఒకటా రెండా.. యాభై ఏళ్ళు మా చేత ముప్పతిప్పలు పెట్టించావేం?
నీ రహస్యాలు మాకు తెలిసిపోయాయిలే !
నీవు మా ముందుంచి పోయిన
కథల్లోంచి చరిత్రనీ,
చరిత్ర లోంచి జీవితాన్ని,
జీవితంలోంచి మానవ ఔన్నత్యాన్ని ...
మేం గ్రహించలేక పోయామనుకున్నావా?
ఇలా చెప్ప పెట్టకుండా తిరిగి రాని చోటికి వంటరిగా పయనమై పోయావ్?
మా అభిమానం,గౌరవం నిన్ను చుట్టుముట్టేసి ఉంటుందని మరిచిపోయావా?
నీవెప్పుడు వంటరి వాడివి?
తెలుసుకోండి చూద్దామని , మమ్మల్ని పదాలప్రహేళికల వెనుక పరుగులు పెట్టించావా?
నీ మాటల గుట్టులన్నీ తెలుసుకోలేం అనుకున్నావా?
చిక్కుముళ్ల ఇంద్రజాలాలను ఛేదించలేమనుకొన్నావా?
శుభ్రంగా ఉతికి ఆరేసిన దుప్పట్లతో బాటు , గాల్లోకి తేలే తంత్రం ...
మాకు తెలియదనుకొన్నావా?
తీగెపై ఆరేసిన అక్షరాల్లో...
రహస్యాలన్నీ మూటకట్టేసి మాకిచ్చేసావ్ కదా?
ఆ రహస్యాలన్నిటిలోనూ నీవు దోబూచులాడుతూ గుస గుస లాడట్లేదూ...రహస్యాలన్నీ మూటకట్టేసి మాకిచ్చేసావ్ కదా?
గుంభనంగా నవ్వుతూ?
మా గుండెల్లో తిష్టవేయలేదూ?
***
అవునా?
నిజమా?
నిజమేనా?
మాటల మాంత్రికుడు మనలోంచి మాయమైపోగలడా ?
***
మాటల మాయావికి జేజే !
మనసున్న మేధావికి జేజే!
మార్క్వెజ్ కు బోలెడంత అభిమానంతో ..
వీడ్కోలు.
***
Some thing VERY personal !
" One Hundred years of Solitude "( English translation)
is as old as me !
no.. no.. As Young as me !
గబ్రియెల్ గర్సియా మార్కిస్ ...(మార్క్వెజ్ అంటాం మనం :-)>
(http://en.wikipedia.org/wiki/File:Es-Gabriel_Garcia_Marquez.ogg)
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
As you have said he is reallly a magician of wordsl. we r going to conduct his condolence meeting on 23rd along with 450th birthday celebrations of Shakespeare.
ReplyDeleteHow do you do ? How is your mother.? greetings to your son and daughter.
ravibabu praja sahithi.
It's really good news. Two important and different literary gaints on the same stage.
DeleteFine .Thank you. We oblige.and Same to you all. Wish the program a great success.