కారం దోసెలు ...
కమ్మటి కబుర్లు ...
కథా విశ్లేషణలూ ...
***
emergence (పుట్టుక), evolution (పరిణామం), epiphany (పరిణితి).
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
కమ్మటి కబుర్లు ...
కథా విశ్లేషణలూ ...
వెరసి . . . కథ 2013 ఆవిష్కరణ.
P.Satyavati garu |
Sri Ramana garu |
Sivareddy garu, Uma Maheshwara Rao garu. |
ఎంతగా మబ్బులు ఆకాశంలో దోబూచులాడి ఊరించినా ,
తెల్లారేపాటికి ఎటో మాయమయ్యాయి. ఏదో పనున్నట్టుగా, గుంపు కట్టుకొని మరీ !
ఎప్పటిలాగానే తన అలవాటు తప్పకుండా ,
“ సింహపురి “ అతిథులను ఓ గంటన్నర ఆలస్యంగా తెచ్చి దింపింది.
ఎందుచేతనో , కార్యక్రమ నిర్వాహకుల ఫోను ఎంతకీ పలకలేదు. సరే లెమ్మని, పడుతూ లేస్తూ కల్యాణ మండపం చేరుకొనే సరికి,
పగలు పదిగంటలు. చిమ్మచీకటి.
పగలు పదిగంటలు. చిమ్మచీకటి.
కరెంటుకోతలు..ధారాపాతంగా చెమటలు.
కాస్తంత వెలుగు,గాలి ఆడే చోట, తిరుపతి ,ఒంగోలు సాహితీ మిత్రులు .
వేదిక మీద ఇంకా , కుర్చీలయినా సర్దనేలేదు. వెలుగొచ్చాక చూద్దాంలెమ్మనుకొన్నారో ఏమో.
కాస్త , హడావుడి పడగానే,
అటు వేదిక , ఇటు తేనీరు తయారు!
దీపాలు వెలగడం.. కోమల విలాస్ లో టిఫిన్లు ముగించుకొని ,
అతిథులు రావడం అటూ ఇటుగా ఒకమారే.
ఇంతలోనే, పోలిసుల కవాతు. అదేమిటి చెప్మా అనుకొనే లోపలే, వారి వెనుకగా, చిరునవ్వుతో సరికొత్త కథకులు సునీల్ కుమార్ గారు సభాప్రవేశం.
ఇక, అన్నీ సిద్ధం. అందరు సర్దుకొని, కార్యక్రమం ప్రారంభం.
ఈతకోట సుబ్బారావు గారి స్వాగతోపన్యాసం . వాసిరెడ్డి నవీన్ గారి కథాసాహితి పరిచయం.
ఈతకోట సుబ్బారావు గారి స్వాగతోపన్యాసం . వాసిరెడ్డి నవీన్ గారి కథాసాహితి పరిచయం.
కుడిఎడమల , శ్రీరమణ గారు శివారెడ్డిగారు .. ధగధగా మెరియగా, మైకు నా చేత బడింది!
మధ్యే మధ్యే శివారెడ్డి గారు "అధ్యక్షులు ఎలా ఉండవలెనన్న" పాఠాలతో ,
నా చెవి మెలి వేస్తుండగా.... కార్యక్రమ నిర్వహణ.
Front / L to R prameela rani garu, VPratima, Vishnu. chandra latha, Second /R to L/Sndhu amdhuri ,Subhadra Kumari, Paturi annapoorna, sasi kala |
శ్రీ రమణ గారు ముఖ్య అతిథి ప్రసంగము, శివారెడ్డి గారు, డా.వి.చంద్ర శేఖర్ రావు గారు ప్రధాన వక్తలుగా, నవీన్ వాసిరెడ్డి గారు, పాపినేని శివశంకర్ గార్లు కథాసాహితి ప్రయాణాల్లో ఒడిదొడుకులను పంచుకోగా, పెనుకొండ లక్ష్మీనారాయణ గారు , మరి కొన్ని సంగతులను ముచ్చటించారు.
కార్యక్రమం హాయిగా సాగింది.
పుస్తకావిష్కరణ తరువాత , రచయితలు పుస్తకాలు అందుకొన్నారు.
Lto R, Naveen,Madhurantkam Narendra ,Siva Reddy ,Dr.Chandra Shekhar Rao,C.A.Prasad garlu |
ఇక, ఆ ప్రధాన వేదిక మీది ప్రసంగాల సారాంశాన్ని మూడు ముక్కల్లో చెప్పాలంటే,
Lto R Papineni Sivashakar, Anil Atluri,Vishnupriya, Katragadda Dayanand |
కథ పుట్టుక లోని సహజత్వాన్ని గురించి శ్రీ రమణ గారు, దాని పరిణామం లోని ఆలోచన గురించి శివారెడ్డి గారు, పరిణితికి దోవ తీసే అన్వేషణాదృష్టినీ, సృజనాత్మక నైపుణ్యాన్ని గురించి
డా.చంద్ర శేఖర్ రావు గారు , మాట్లాడిన మాటలన్నీ , ఒకే ప్రసంగం లోని మూడు భాగాలుగా, ముగ్గురి నోట విన్నట్టుగా.. అనిపించింది . నా మట్టుకు నాకు.
ఆ పై, ఏడుగురు కథకులు ప్రత్యక్షంగాను, ఇరువురు పరోక్షంగాను పంచుకొన్న వారి కథారచనా అనుభావాలు ఎంత హృద్యంగా సాగాయో.
ఆవేశం, ఆగ్రహం, వేదన , శోధన , నిశ్శబ్దం, నిబ్బరం, ఆశ్చర్యం, ఆనందం.
అలాగే, జంపాల చౌదరి గారు, పాలన గారు, "లియోసా" సంపత్ కుమార్ గారు, మాధవ్ మాచవరం గారు మరికొందరు పంపిన శుభాకాంక్షలను అందరితో పంచుకొన్నాము.
కథకులు అమరేంద్ర దాసరి గారి అభిప్రాయాలు, పాఠకులు డా. అరుణా పాణిని గారి అభిప్రాయాలను ప్రేక్షకులతో పంచుకొన్నాము.
Sa vem Ramaesh garu, Uma maheswara Rao garu |
సాయంకాలం , సముద్రం గాలిని ఆస్వాదిస్తూండగానే , వీడ్కోళ్ళు మొదలయ్యాయి.
మిగిలిన వారమంతా, గుడిసె కింద చేరి , కారం దోశెలు తింటూ, కబుర్లు పంచుకొన్నాము. వెన్నెలని చూస్తూ ...
భగవంతం, స వెం రమేశ్ గార్లు, చిన్నారి "రాగలీన" ల పాటల వానలో తడిచి ముద్దవతూ...
Anil Atluri garu, Sindhu Madhuri garu |
ప్రభవ వేదిక తీరాన దొరికిన సముద్రం గవ్వలను గుప్పిట్లో దాచుకొంటూ...
***
కథ కంచికి.. మనం ఇంటికి !
***
అదన్న మాట!
చిమ్మ చీకటి నుంచి వెన్నెల వెలుగుల దాకా నిన్నటి కథ-2013 ఆవిష్కరణ సంధర్భంగా సాగిన పడవ ప్రయాణం!
*** P.S. Epiphany కి ఈ కింది అర్ధాలు ఉన్నాయి. బహుశా ,"సాక్షాత్కారం" దగ్గరగా ఉండే పదమేమో.. ఎందుకో .. పరిణితి .. అన్న మాట బావుంటుందనిపించింది.
A sudden manifestation of the essence or meaning of something.
b. A comprehension or perception of reality by means of a sudden intuitive realization:
***
Over a cup of Tea: Manchikanti and other friends. |
Sindhu Madhuri ,Subhadra GovindaRaju and Freinds |
Penugonda, EetakOta, PapinEni, Uma Maheswara Rao, Anil Atluri ,Bhagavantam,Vishnu,S reeramana garu |
***
Congrats!
ReplyDeleteGreat symposium.
Your review made me feel as if I was there.
Thanks.