వేమన పద్దెమునకు ఎదురు పద్దెము లేదు.
రామలచ్చుమనులకన్నా రాజు లేరు.
సతీపతికన్న సంగాతి లేదయ్యా.
విశ్వదాభి రామ వినుర వేమా !
ఇదేదో నేను ఆశువుగా అల్లేనని
మోసపోయేరు సుమా !
ఎంత ధైర్యం ! వేమననే కాపీ జేస్తావా అని కళ్ళెర్ర జేసేరు !!
ఎవరికి వారు వేమన పద్యాలు కట్టుకొని,
హాయిగా పాడుకొంటున్నారట.
పదికాలాల పాటుగా.
హోసూరు.... తెల్లకొక్కర్ల తెప్పంలో !
చిటుకు పటుక్కు చెనిక్కాయలు ...
అబ్బే కాలక్షేపం పల్లీలు కావండీ..
పొరుగు బతుకు వెతలు..
ఎర్నూగు పూలు,మొరుసునాడు కతలు,ఇరులదొడ్డి బతుకులు, తొండనాడు కతలు .. .
అంతేనా ఎనిమిది వందల ఏళ్లనాడు ..
కృష్ణను వదిలి హోసూరు చేరిన కి.రాజనారాయణ గారి , గోపల్లె.
ఇన్ని పుటల్లో వాళ్ళ బతుకుల్ని పరిచారు.
ఓ మారు తొంగి చూడండర్రా అని పిలుపులు పంపారు...
అవును... మన జతగళ్ళు కత గాళ్ళూ.
హోసూరు కు మీరెంత దూరమైనా.. హోసూరు మీ ముంగిట్లోకి వస్తోంది.
నా మాట నమ్మక పోతే ,
మీ పుస్తకాల అంగట్లో అడగండి !
ఇ-దుకాణమో ఏ దుకాణమో!
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
No comments:
Post a Comment