May 14, 2014

తెలుగమ్మ పలుకు !

ఊరిని చూడాలని కొండ దిగి ,
భార్యతో పాటు ఎద్దుపై వచ్చిన చంద్ర చూడేశ్వర స్వామి,
ఉత్తిత్తినే నిందించే జనుల మాటలకు విసిగిపోయి,
" ఏమి చేసినా విమర్శ చేస్తా ఉండారు, ఈ జనం , ఎట్లాప్పా?"
అని రామస్వామితో మొరబెట్టుకొన్నాడట!

"శివప్పా! లోకులు కాకులు.
వాళ్ళ మాటలు పట్టించుకొంటే అంతే!
నేను సత్యము తెలుసుకొనేటప్పటికి
రామాయణం ముగిసిపోయింది " అన్నాట్ట !

 జతగాళ్ళు కతగాళ్ళు ( హోసూరు)

మట్టిలో పుట్టి,  మానులతో మాకులతో పెరిగి,
గుట్టలు మిట్టలు ఎక్కి, ఏటిలో నీటిలో ఈది ,
గట్టుపై మిట్టపై పల్టీలు కొడుతోన్న ..
ఆ తెలుగమ్మ పలుకుల్నీ పలుకుబడుల్నీ
మీరూ మూట కట్టుకోవాలంటే,
మీరూ హోసూరుకు రావాల్సిందే  ,
మరో మార్గం లేదు !
***
రాండప్పా... జతగాళ్ళు కతగాళ్ళు మీకోసం కాపుకాసుండారు ! 

మే 21 -23 , హోసూరు నందు
 3 కథాసంపుటాలు, ఒక సాహితీ విశ్లేషణ 
 (రేడియో ప్రసంగాలు) పుస్తకం విడుదల వేడుక .

కథాభిమానులు మరిన్ని వివరాలకు  స వెం రమేశ్ గారిని సంప్రదించ మనవి.
8500548142

డా. రాయదుర్గం విజయ లక్ష్మి గారికి ధన్య వాదాలతో.
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

1 comment:

  1. నేను సత్యము తెలుసుకొనేటప్పటికి
    రామాయణం ముగిసిపోయింది
    >>
    యెంత గొప్పగా చెప్పారండి!రాముల వారు అల్లానే అనుకుని ఉండాడేమో అనిపించేటట్టు!!

    ReplyDelete