Jan 7, 2010

మరారికులం వంకాయ పండగ

"మరారికులం వంకాయ పండగ"అనుకున్నట్లుగానే అందరి దృష్టినీ ఆకట్టుకొంది.

మళయాళీ నటుడు మోహన్ లాల్ ఈ పండుగను ప్రారంభించారు. కేరళ వ్యవసాయ, ఆర్ధిక,స్థానిక స్వపరిపాలన శాఖల మంత్రులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.27 డిసెంబరు,2009 న మొదలై వారం రోజుల పాటు సాగిన ఈ పండగలో, పలువురు ప్రభుత్వ ప్రభుత్వేతర ప్రముఖులు, పర్యావరణవాదులు,స్థానిక ప్రజలు, రైతులు,శాస్త్రజ్ఞులు ,విజ్ఞులు,విద్యార్థులు,విశ్వవిద్యాలయ అధ్యాపకులు, కళాకారులు,రచయితలు ... అనేకులు పాల్గొన్నారు.
మరారికులం ఉత్తరం అలప్పుజా(అల్లెప్పీ),కేరళ కోస్తా ప్రాంతం నందలి ఒక మండలం. ఇక్కడి వారు సహజ సాగు పద్దతులను పాటిస్తూ,స్థానిక జీవావరణాన్ని సంరక్షించుకొంటున్నారు. బిటి వంకాయ వడగాలిలో ..ప్రఖ్యాతమైన "మరారికులం వంకాయ " భవిష్యత్తు గురించి వారు ఆందోళన పడుతూ, కిం కర్తవ్యమంటూ ..ఆలోచించుకోవడానికే ఈ వారం రోజుల పండుగ చేసుకొన్నారు.
ఈ సంధర్భంగా, వారు అనేక ఆసక్తికరమైన కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా, సహజసాగు కృషీవలురందరినీ సమావేశపరిచారు.చర్చలు, ప్రదర్శనలు ,వివరణలు, డాక్యుమెంటరీలు మొదలగునవి ఒకవైపు సాగుతుండగా , విభిన్న పరిధులలొ "స్థానిక వంకాయ వంగడాలను కాపాడుకోవడానికి కార్యాచరణను ప్రణాళికను తయారు చేసుకొనే ప్రయత్నాలు చేసారు. జనవరి రెండున ప్రారంభమైన రెండు రోజూల పాటు సాగిన జాతీయ సమావేశంలొ , దేశవ్యాప్తంగా బిటి వంకాయను నిరోధించడానికి చేయవలసిన కార్యక్రమాన్ని కూలంకషంగా చర్చించారు.
స్థానిక వంగడాలకు జన్యుమార్పిడి వంగడాలకు మధ్యన బాగోగులను విశ్లేషించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి Dr. పి.ఎం. భార్గవ గారు. 
వారన్నారు కదా...కనీసం ఎనిమిదేళ్ళపాటు మారటోరియం ప్రకటించి, జన్యుమార్పిడి చెందిన ఆహారపంటలను మన దేశంలో అడుగుపెట్టనివ్వరాదన్నారు.ఆ కాల పరిధిలో మనం మన స్థానిక పరిశోధనను పటిష్టం చేసుకోవడానికి వినియోగించుకోవాలన్నారు.
,ఎటువంటి కొత్త జీవసాంకేతిక పరిజ్ఞానం ఎక్కడి నుంచి ప్రవేశించడానికి అనుమతిని కోరినా కూలంకషంగా పరీక్షించగల స్థాయిలో మన స్వంత పరిశోధనశాలలను పెంపొందించు కోవాలన్నారు.
ఒక వేళ, మనం సిద్ధం కాకుండా ఇటువంటి జీవపరిశోధనలకు మన దేశంలో అనుమతిని తొందరపడి ఇస్తే, అది స్వతంత్రభారతం చేసిన పెద్ద తప్పు అవుందన్నారు. మరి, మీరే మంటారు? 
*  
ఇప్పటికే, "వచ్చే యాభై ఏళ్ళ వరకూ జన్యు మార్పిడి వంగడాలను తమ ప్రాంతంలో అడుగుపెట్టనిచ్చేది లేదని" కేరళ ప్రభుత్వ నిర్ణయం ప్రకటించడం ,ఆచరించడానికి అవసరమైన ప్రణాళికను రచించడమే ..ఈ పండుగ కు మూలకారణం.
డేశవ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణకు స్వయంగా బయలుదేరబోతున కేంద్ర పర్యావరణమంత్రి గారి జాబితాలో కేరళ లేకపోవడమే అన్నిటికనా పెద్ద చర్చ. మంత్రి గారిని" మా మాట విందురు మరారికులం రమ్మని స్థానికులు ఆహ్వానించడం" ఈ పండుగ కొసమెరుపు. 
*
"మరారికులం వంకాయ" పదిలంగా ఉండాలని... స్థానికుల ప్రయత్నాలు ఫలించాలని... కోరుకుందాం.
మనలో మాట.
మరి, 
మన వంకాయనేం చేద్దాం?
*


All rights @ writer.
Title,labels, postings and related copyright reserved.

3 comments: