Jan 8, 2010

మత్తిగుళ్ళ మహా ప్రసాదం

ఉడిపి హోటల్ లో ఉప్మా అయినా ఉల్లిదోశయినా,
అబ్బ !
తలుచుకొంటూనే నోరూరిపోదూ?
తినేదాకా ఆగగలమా కమ్మటి వాసనే నిలవనీయ కుండా చేస్తుంటే
ఇక,బిసిబిళే బాత్ ,వాంగీ బాత్ సంగతి సరేసరి !
వాంగీ బాత్ మాట ఎలాగు ఎత్తాను కాబట్టి , మీకు మత్తిగుళ్ళ మహాప్రసాదమూ రుచి చూపించాలి కదా
వాంగీ బాత్ అంటూ మహాప్రసాదం అంటున్నాని ఆశ్చర్య పోకండి

వాంగీ అదేనండీ , వంకాయ , సాక్షాత్తు ఉడిపి కృష్ణుడి కి భక్తులు అందించే మహాప్రసాదం
కాస్త ఓపిక పట్టండి. విషయమే ,ఇప్పుడు గొప్ప విశేషమై పోయింది.

ఉడిపి నుంచి మంగళూరు వెళ్ళే దారిలో ,కాతపాడి వద్ద మలుపు తిరిగితే వచ్చే ఒక గ్రామమే " మత్తి/మత్తు". అక్కడ మాత్రమే పండే ఒక ప్రత్యేకమైన బుజ్జి వంకాయ " ఉడిపి మత్తిగుళ్ళ వంకాయ" "సివల్లి" బ్రాహ్మణులు వారి ఆరాధ్యదైవమైన ఉడిపి కృష్ణుడికి , మత్తిగుళ్ళ తొలిపంటను మహాప్రసాదం గా అందిస్తున్నారు.

ఆచారం స్వయానా ఉడిపి కృష్ణుడి ఆరాధన అంత పురాతనమైంది. అంత పవిత్రమైనది
ఆరాధ్యనీయమైన దే కాక ఆరోగ్యకరమైనదీ కావడం చేతదక్షిణ కర్ణాటకలోని తీర ప్రాంత గ్రామమైన "మత్తి"వాసులతో పాటు కన్నడిగులంతా మత్తిగుళ్ళను అపురూపంగా చూసుకోవడం సహజమే కదా
ఉడిపి మత్తిగుళ్ళ వంకాయను కర్ణాటక ఉద్యానవన శాఖ వారు "భౌగోళిక గుర్తింపు" కొరకు ప్రయత్నిచడమే..ఇప్పటి విశేషం

అన్ని వంకాయల్లాగా వంగ రంగులో కాకుండా , లేత ఆకుపచ్చ రంగులో ,గుండ్రంగా ఉండి,మంచి కండ కలిగి ,రుచికరమైన ఉడిపి మత్తిగుళ్ళ కన్నడిగుల మనసు దోచడంలో ఆశ్చర్యం ఏముంటుంది

భౌగోళిక గుర్తింపు కోసం ప్రయత్నించడం అంటే , నాగపూరు నారింజ లాగా ,కాంజీవరం పట్టుచీరలాగా అన్నమాట. మీకు, బనగానపల్లి మామిడికాయ , నూజివీడు రసాలు జ్ఞాపకం వస్తున్నాయా

సందర్భంగా మాట్లాడుతూ,ఉధ్యానవన శాఖ డెప్యుటీ డైరెక్టర్,హెచ్ .ఎం. కృష్నమూర్తి గారు గట్టి ప్రయత్నం చేస్తూ , స్థానిక వంకాయ ను అందునా మత్తిగుళ్ళ ను కాపాడుకోవాలని బలంగా చెప్పారు. ఎందుకంటే, కర్ణాటక ,ధార్వాడ్ యూనివెర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ వారు బిటి జన్యువు చొప్పించే ప్రయోగాలకు స్వీకరించిన 6 రకాలలో మత్తి గుళ్ళ మొదటిది కావడమే
 మత్తి గుళ్ళ జన్యుకాలుష్యానికి లోనవుతుందని వారు ఆవేదన వ్యక్త పరచడం ,మత్తిగుళ్ళ అదృశ్యమై పోతుందని ఆక్రోశించడం ,మహికో మోన్శాంటొ సొంత సొత్తుగా మారుతుందని ఆవేశ పడడం ...సహజమే కదా?
మత్తి గుళ్ళ, మంజరి గోట, మలాపూర్ లోకల్ మరికొన్ని స్తానిక వంగడాలను బిటి వంకాయలుగా అమర్చే ప్రక్రియ పూర్తి అయ్యిందని ధార్వాడ్ వ్యవసాయవిశ్వవిద్యాలయ శాస్త్రవేత్త ,డా.ఫక్రుద్దీన్ గారు తెలియ చేశారు.దక్షిణ ,ఉత్తర కర్ణాటక మరియు గోవా ప్రాంతవాసులు నిత్యం ఎంతో ఇష్టంగా భుజించే , వంకాయల బి.టి.విత్తనాలు సిధ్దమనీ రైతులకు ఇవ్వడమే తరువాయి అనీ ..వారు చెప్పడం మరింత  విశేషం.
అందరికీ అన్నం పెట్టే ఉడిపిసివాళ్ళి” బ్రాహ్మణుల ఆరాధ్యభావం కానీకన్నడిగులు గోవాప్రాంతీయులు ..మత్తిగుళ్ళతో మంజరిగోట తో మలాపూర్ లోకల్ తో  పెంచుకొన్న అత్మీయభావం కానీ... ప్రజాభిప్రాయ సేకరణకు బయలుదేరబోతోన్న పర్యావరణమంత్రి గారి చెవిన పడకపోతుందా?
ఏది ఏమైనా,
ఉడిపికృష్ణుడి మహాప్రసాదానికే మలినం అంట బోతుండడం.. 
మరి స్వయానా కన్నడిగులైన మన మంత్రి గారికి తెలీదనే అనుకుందాం
కాసేపు!!
ష్!!!

4 comments:

 1. Interesting.
  మొదటగా బిటి జన్యువు అంటే ఏంటి?
  రెండు -ఆ జన్యువుని ప్రవేశ పెడితే ఏమి జరుగుతుంది? ఏమి మాలిన్యం అంటుతుంది?
  జన్యు పరమైన అభువృద్ధివల్ల వంగడం (వంకాయ కాదు) మరికాస్త దృఢపడినట్టే కదా. అది ఆ జాతి మనుగడని బలపరిచినట్టే కదా?

  మలినం అంటబోవడం వంటి మానసికోద్రేక విశేషణాల్ని ప్రయోగించడం శాస్త్రీయమైన శాస్త్ర సమ్మతమైన అభివృద్ధిని ఆటంక పరచడమే కాదా?

  దీన్ని గురించి రవి వైజాసత్య ఏమంటాడో వినాలనుంది.

  ReplyDelete
 2. @kotha paali..
  have you raised these questions for discussion sake or genuinely asking the implications of BT?
  The BT issue is a worldwide movement..reading a little online about other issues raised regarding BT, can probably clarify most of your doubts on this issue and might help understanding chandragaru's post better.

  ReplyDelete
 3. అచ్చు ఇలాంటి వంకాయే మాఊర్లోనూ పండుతుంది,దాన్ని మేమంతా 'దెందులూరు వంకాయ" అని పిలుస్తాము. ఈ రకం వంకాయ ఇంకెక్కడా ఉండదు గాబోలు అనుకున్నాను ఇన్నాళ్ళూ!

  ReplyDelete
 4. The question seems to be simple enough. The answers are difficult.
  "Which is better, pesticides or BT? How much can we depend on regulatory forces to be completely ethical and totally knowledgeable and have the control over manufacturers?"
  BT in corn, cotton and potatoes is already in use in some parts of the world (US too)
  It is resisted in Europe.

  A quick search led to some views, one seemingly balnced discussion, another seeming to support its production(US) and another showing resistance(Europe).

  http://www.ca.uky.edu/entomology/entfacts/ef130.asp

  http://www.gmo-safety.eu/en/debate/723.docu.html

  http://www.pfamhealth.net/filecabinet/gecorn.pdf

  Does it help anybody(as a consumer) to decide one way or the other?
  It doesn't to me.

  The main concern is the proper maintainance of regulations.

  Questions should be raised and voiced effectively. I just hope it becomes a healthy discussion instead of an argument of different beliefs.

  ReplyDelete