Mar 30, 2014

లక్కసీళ్ళ సంచుల్లో.. !

హమ్మయ్య!
పరీక్షలయిపోయాయి!

భయం, కోపం,
వత్తిడి,అసహనం,
ఉద్రేకాలు,

నకలు చీటీలు,గుసగుసలు,
"చే"బదుళ్ళు,చూచిరాతలు,
ఉద్వాసనలూ,

కళ్ళనీళ్ళు,పొర్లు దండాలు,
బతిమిలాటలు, సెంటిమెంట్లు,
ఉద్వేగాలు,

క్షమాపణలు మన్నింపులు
బెదిరింపులు, బతిమిలాటలు,
ఉపశమనాలు,

జలుబులు జ్వరాలు
వాంతులు  వడదెబ్బలు
ఉపచారాలు,

మంచీ మర్యాద,
హక్కులు బాధ్యతలు,
ఉపదేశాలు

హమ్మో ... పరీక్షంటే ..
ఇంత తతంగమా !

హమ్మయ్య!
పరీక్షలయిపోయాయి!

పరీక్ష రాయడానికి కాదండీ...
పరీక్షలు పెట్టడానికి వెళ్ళొచ్చాను...
అదీను,
ఒక ఊరి చివర బడికి.

రేకుల షెడ్డు .మిట్టమధ్యాహ్నం.
కరెంటుకోత,చెమటలధార
యంత్రాంగం ఎత్తులుచిత్తులు !

పరీక్షల నిర్వహణ
ఓ కఠిన పరీక్షే!

నిలబడి చేయాలంటే !
నిలబెట్టేలా చేయాలంటే!


హమ్మయ్య!
పరీక్షలయిపోయాయి!

***
మరి ,
లక్కసీళ్ళ సంచుల్లో..
బ్యాంకులాకర్లలో, పోలీసుకస్టడీల్లో,
కళాశాల యంత్రాంగం పర్యవేక్షణలో ..
సురక్షితంగా భద్రం చేయవలసిన ...
ప్రాణదాతల పరీక్షాపత్రాలు
ఆ వంతన చేజారిపోయాయంటే ,
యంత్రాంగం మంత్రాంగం ఏమిటో ..
స్పష్టంగానే తెలిసిపోతోంది.
కదండీ!

***
ఓ మారు ,ఎంసెట్ వ్యవహారాల గురించి మాట్లాడుతూ ఉండగా, ఉన్నతవిద్యామండలి డైరెక్టరు  ,ప్రొ. సి. సుబ్బారావుగారు అన్నమాట గుర్తొస్తున్నది.
"కోట్ల రూపాయల వ్యాపారానికి మేమొక పరీక్షాపత్రం సమర్పించుకొంటున్నాం ! " అని!
***
హతోస్మి!

***


( ISC బోర్డు వారి సూపర్ వైజింగ్ ఎక్షామినర్ గా, పన్నెండవ తరగతి వారికి పరీక్షలు నిర్వహించడం జరిగింది.)



All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

1 comment:

  1. ముందున్నాయి అగ్ని పరీక్షలు ( ఎండలు )

    ReplyDelete