Aug 5, 2010

చదువులలోని సారమెల్లా

మధ్య రాసిన "ఆవర్జా " అనే కథలో విధీశ అనే పాత్ర ఇలా అనుకుంటూ ఉంటుంది.

నేనంటే.. నా ఆలోచనా?
కాదు!
నేనంటే ... నా ప్రతిభా?
కానే కాదు!!
నేనంటే...???
నా లౌక్యం ..!!!
ఇదీ రోజటి సత్యం !"                                                                   (ఆవర్జా", ఇదం శరీరం సంపుటి,2002)
అదండీ అసలు సంగతి !
లౌక్యం నేర్పడానికే చదువు , అదే ఇవ్వాళ మన విద్యావ్యవస్తలో ప్రధాన వినియోగవస్తువు!
ఎందుకంటే,పిల్లలు చదువుకోవాలి. బ్రతుకుతెరువు కోసం. చక్కటి భవిష్యత్తు కోశం.. మనకు మరో మార్గం లేదు.
అందుకే, మనం ఎంతో నిజాయితీగా వెతుకుతున్నాం. పిల్లలు ఏఏ డిగ్రీలు స్వంతం చేసుకొంటే ...పెద్దయ్యాక సుఖంగా జీవించగలుగుతారు  అని ..అన్ని వైపులా అన్వేషిస్తున్నాం. ఎన్నెన్ని  డిగ్రీలు వారు స్వంతం చేసుకొంటే ..అంత సంతోషిస్తున్నాం. లౌక్యుడు అయ్యాడనీ ఆనందపడుతున్నాం.
క్రమంలో మనకు తెలిసిన ఒక చిన్న విషయాన్ని మరిచి పోతున్నాం.
లౌక్యం స్వార్ధానికి మూలం. స్వార్ధం అన్ని అమానుషాలకు కేంద్రం .
అహాన్ని పెంచే స్వార్ధాన్ని నింపే - చదువు గురించి - మన వేమన వేసిన చురకను మరిచిపోగలమా ? విద్యచేత విర్ర వీగువారు పసిడిగల్గు వాని బానిస కొడుకులు ..అంటూ.
నిజమే.
వినయాన్ని ఇవ్వని విద్య ,స్వేచ్చను హరించే విద్య... మనకు సరి పోతుందా?
చదువు ఎలా  ఉండాలంటే -
పసిడి కొరకు బానిసలుగా మార్చేది మాత్రం కాదు .
మనలోని పసితనాన్ని పచ్చ బరిచి ఉంచేదిగా ఉండాలి.
*
  
"చదువులలోని సారమెల్లా చదివి" మనం ఒక లక్ష్యం ఏర్పరుచుకొన్నాం. దాని వైపే మనం ప్రయాణం సాగిస్తున్నాం. అది- స్వేచ్చ ,సమత,సౌబ్రాతృత్వం తో నిండిన మరో ప్రపంచం.
ఎన్నెన్నో మార్గాలను మనం నిర్మించుకొంటూ వస్తున్నాం.
అందులో -పిల్లల చదువు ఒక సచేతనా మార్గం -అని మనం భావిస్తున్నాం.
మన చుట్టూ ఒక స్తబ్దత చుట్టేసి ఉంది.
మనలోని సున్నితత్వాన్ని కోల్పోతూ వస్తున్నాం.
కరుడు కట్టి పోతున్నాం.చట్రాలలోకి ముడుచుకుపోతున్నాం.జిజ్ఞాస , రసజ్ఞత కొరవడిన ఒక నిర్లిప్తభరిత జీవితాన్ని నెట్టుకొస్తున్నాం.
ఆదర్శ ప్రపంచం ఒక బలమైన ప్రేరణగా లక్ష్యంగా - ఎందుకని ఆకర్షించ లేక పోతుంది?
బహుశా మన లో  సామాజిక స్పృహ,చేతన,దృక్పథంతో పాటుగా ..సామాజిక ఆర్ద్రత కావాలేమో ..
నిజమే,
ప్రేమ ,కారుణ్యభావం ,మంచితనం.. మనల్ని మనుషులుగా చేస్తుంది.
చదువు ఎలాఉండాలంటే -
నేనొక మనిషిలా పరివర్తన చెందేలా!

(26-1-07,వికాసవనం, విజయవాడ,ప్రసంగ పాఠం నుంచి మరికొంత    )



***
 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

2 comments:

  1. చంద్రలత గారూ, చాలా నచ్చాయండి ఈ చదువు ఎలా వుండాలంటే సీరీస్ లో మీ ఆలోచనలు.

    ReplyDelete
  2. ధన్యవాదాలండి

    ReplyDelete