Oct 7, 2010

అఖిలాంధ్ర పాఠకులకు

అసలు సిసలు వైరాగ్యం అంటే ఏంటో-
నన్నడగండి. చెపుతా.
అచ్చమైన స్వచ్చమైన వైరాగ్యం అంటే ఏంటో-
అదీ నాకు తెలుసండోయ్!

చిదంబర రహస్యం..
నేనేదో  అడ్డొచ్చిన అడవుల బట్టో..
ముక్కు మూసుకొని ఒంటికాలిమీద తపస్సులు చేసో..
కనబడ్డ గ్రంథాలయాల్లోఅంతా దూరేసి..
చేతికందిన పుస్తకాన్నల్లా గిరిగిరా తిప్పేసో..
గురూజీఅమ్మాజీ శిష్యరికం బట్టో ..
చెప్పిన బోధలన్నీ శ్రద్ధగా చెవిన బట్టో..
తెలుసుకోలేదండోయ్!

పోనీ,  బుద్ధిగా  కూర్చుని  ధీర్ఘంగా చింతన చేద్దామన్నా  , 
మా వీధిలో రావిచెట్టైనా లేదయ్యే !


ఉన్న దాన్ని ఉన్నట్టు ఊరక ఉండక..
అడపా దడపా పుస్తకం అచ్చేసి ..
తెలిసేసుకొన్నా!

అదండీ విషయం!

అసలు సిసలు వైరాగ్యం అంటే..
"అచ్చు వైరాగ్యం..!"
అచ్చమైన స్వచ్చమైన వైరాగ్యం అంటే...
"ప్రచురణ వైరాగ్యం.. " అన్న మాట !!!

చూడండి.
ఎప్పుడు పుస్తకం అచ్చేసినా ..
ఖరాఖండి గా ఖచ్చితంగా..
అనుకుంటాం కదా .. "ఇదే ఆఖరుది !" అని.

ఇంతలోనే అర్ధ రాత్రో, లోలోపల .. చిన్ని ఆలోచన తొలవడం మొదలవుతుంది
అంతే!
ఆలస్యం చేయకుండా , తెల్లారే  అచ్చుపనిలో పడతాం
బోర్లా బొక్కలా!

"అఖిలాంధ్ర పాఠకులకు అక్షర నీరాజనం " అంటూ నోరారా మంగళగీతాలు పాడుకొంటూ "అచ్చు హారతి "ఇచ్చే లోగా..
ఉన్న శక్తియుక్తులతో పాటు
పోపుడబ్బాల్లో బట్టలదొంతర్లో దాచిఉంచిన కొద్దిపాటి రహస్య నిలవలతో సహా ..
సమస్త నిధులూ ..కర్పూరంలా ఇట్టే హరించుకుపోతాయి!

అవన్నీ సరేతాజాగా తళ తళలాడుతున్న సరికొత్త పుస్తకం , అందునా సొంత పుస్తకం, చేతిలోకి తీసుకోగానే ...
లెక్క ప్రకారం ..
పురిటికందు ను తొలిసారి పొత్తిళ్ళలోకి పొదివి పట్టుకున్న అమ్మ లా మురిసి పోవాలా...
అదేంటొ గానీ..
బిడ్డ టీకాల ఖర్చునుంచి ట్యూషను ఫీజుల వరకు , పురిటిస్నానం నుండి ఉద్యోగ ప్రస్తానం వరకూ.. తారలను తాకే ధరచీటిలు తల చుట్టూ గిర గిరా తిరుగుతుంటే ,వెలాతెలా బోయే ...నాన్న లా ..నిలబడిపోతాం!
కొత్త పుస్తకానికి .. అందులోనూ తెలుగు పుస్తకానికి.. అమ్మయినా నాన్నయినా ... 
పాపం .. రచయితేగా!

ఫలానా పుస్తకానికి ఇన్నిన్ని మిలియన్ డాలర్లు ముందస్తు చెల్లింపులు జరిగాయనో ..
ఫలానా రచయిత ఒకానొక ద్వీపంలో రాజభవనంలో పూలతోటల్లో నివసిస్తాడనో .. విన్నప్పుడు ...   కాకమ్మకబుర్లు కట్టుకథలు గా ఎందుకు తోచవు మరి?
సరే, అవన్నీ మనబోటి వాండ్ల ముచ్చట్లు కావు కానీయండి.
అవలా ఉంచండి.

రాసినదేదో రాసినట్లు ఊరుకోక ,తగుదునమ్మా అంటూ అచ్చేసుకోను వెళ్ళడం దేనికి ?
అచ్చుతప్పులు దిద్దుతూ ,అక్షరాలు పేరుస్తూ ..బొమ్మలు గీయించుకొంటూ ,పేజీలు అలంకరింపజేసుకొంటూ ,
బైండింగులను పరిశీలిస్తూ , ఒట్టిఅట్టా ...గట్టి అట్టా ...బేరీజులు వేసుకొంటూ..నిర్ణయాలు తీసుకొంటూ ... 
దుమ్ముధూళిలో పడిపోకుండా కాస్త కనబడేలా పుస్తకాన్ని ,
అరల్లో అమర్చమని అంగళ్ళ వారికి బతిమిలాడుతూ.. విజ్ఞప్తులు చేస్తూ ,


పరిపరివిధాలుగా .. పదే పదే శుభకార్యంలో మునిగి తేలుతూ...
నిశ్శబ్దంగా చేతిలో వచ్చి పడే బిల్లును చూసి కూడా , గుండె నిబ్బరం చేసుకొంటూ..
ఉండే క్రమంలో ..


అసలు రచయిత చేయ వలసిన రచనలన్నీ కొండెక్కుతాయంటే , ఎక్కవు మరీ?

ఇక ,అచ్చుతప్పుల దిద్దుబాటు కార్యక్రమం పుస్తకం అచ్చయ్యాక కూడా
నిద్రనడకలా పగటికలలా వదలక వెంటాడం లో వింతేముందీ?

చుట్టూ గుట్టలు పడ్డ అట్టపెట్టెలోంచి అందమైన ముఖపత్రాలు వెక్కిరిస్తుంటే
మంచం కిందా, అటకల్లో .. ఎక్కడపడితే అక్కడ , వాటిని దూర్చేసి పేర్చేసి ,
అటు వెళుతూ ఇటు వెళుతూ .. 
కాలి  బొటన వేలికి ఎదురు దెబ్బలు తగిలించుకొంటూ
బీరువా మీద నుంచో దభీలున వచ్చి పడే బౌండు పుస్తకం నుదుటికి కట్టించే బొప్పిని తడుము కొంటూ ..
మరికొన్నాళ్ళు ఇలా పుస్తకాల దొంతరల మధ్య సహజీవనం చేయాలన్న
 సత్యాన్ని ఇంట్లో వారందరూ జీర్ణం చేసుకొంటూ..

" ఇదే అచ్చు వేసే ఆఖరు పుస్తకం !" అంటూ అడిగిన వారికీ అడగని వారికీ వివరణలూ సవరణలూ గట్రాలన్నీ సవినయంగా సమర్పించేస్తూ.. 
నిట్టూర్చి నిమ్మళపడే లోగా..

మరి ప్రచురణ వైరాగ్యం కలగదేంటండీ?

*
ఒక్క నిమిషం.
ఎవరిదో చిట్టిసందేశం.


"మీది ఫలాన పుస్తకం ఎక్కడా దొరక లేదండీ. ఎన్నాళ్ళుగా వెతుకుతున్నానో! ఎక్కడ అడిగినా లేదన్నారు.మీ దగ్గరేమైనా ఉందేమోననీ.."
"అది అయిపోయింది.అచ్చేయాలి."
వేయండి మరి! "
*
తథాస్తు !

***
 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

12 comments:

  1. "చూడండి.
    ఎప్పుడు పుస్తకం అచ్చేసినా ..
    ఖరాఖండి గా ఖచ్చితంగా..
    అనుకుంటాం కదా .. "ఇదే ఆఖరుది !" అని.
    ఇంతలోనే ఏ అర్ధ రాత్రో, లోలోపల .. ఓ చిన్ని ఆలోచన తొలవడం మొదలవుతుంది.
    అంతే!
    ఆలస్యం చేయకుండా , ఆ తెల్లారే అచ్చుపనిలో పడతాం.
    బోర్లా బొక్కలా!"
    I had similar experience with mathematics research for the first thirty years or so. Then suddely, in certain topics, I could see ahead things that could and would occupy me for years. But it was hard work. After another fifteen years, I wanted to move away from it. One never knows what is in store.

    ReplyDelete
  2. వారెవా.. అచ్చేయండి మరి.
    మళ్ళీ మొదటికి రావాలికదా...

    ReplyDelete
  3. waah రే waah..ఏమి వ్రాసారండి. ఒక రచన బయటికి raavaalante enni పురుటి కష్టాలు వుంటాయో ఎంత andam గా చెప్పారు..బాగుంది.

    ReplyDelete
  4. అందరికీ ధన్యవాదాలండీ.

    ReplyDelete
  5. Chaalaa correct gaa raasaarandi. Ikkada kotta writers okka book raasesi millionaires ayipoyaarani vallu prati channel lo interview lu ivvadaaniki vasthe, mana medadulo manam eppudo venakki tosesina oka idea manani panduni purugu tolichinattugaa tolicheyadam modalu pedutundi.

    Kaani andariki alaage avutundanna nammakam ledu kadandi. andukani malli T.V kattesi mana panulevo avi chesukuntu koorchuntamanna maata.
    Thanks for your 'Acchu Vairagyam,'andi Chandralatha garu.

    ReplyDelete
  6. ధన్యవాదాలండి.

    ReplyDelete
  7. వైరాగ్యాల లో అచ్చువైరాగ్యం కూడా వునందన్నమాట ! బాగుంది .

    ReplyDelete
  8. మీకు 'ప్రచురణ వైరాగ్యం'కలుగ
    కుండు గాక'!
    ఇది దీవెన అనుకోండి,ఆశీర్వాదం అనుకోండి!
    మీ రచనలు పునర్ముద్రణ కోరు గాక!

    మీ
    శ్రీదేవి

    ReplyDelete
  9. ఈ మధ్యే అచ్చుసంద్రం లో దూకాగా!నిండా మునిగాక చలి ఎంతనీ !:-)

    ReplyDelete
  10. అచ్హు వైరాగ్యం..వినడానికికుడా బాగుందండి..చాలా బాగా రాసారు.
    లక్ష్మి రాఘవ

    ReplyDelete
  11. "ప్రచురణ వైరాగ్యం "
    -బాగుంది; ఇది ప్రసూతి వైరాగ్యం లాంటిదిగా తోస్తుంది. అవే లక్షణాలు. మరో బిడ్డకు తల్లి, మరో పుస్తకానికి రచయిత అడ్డు చెప్పగలరా?
    పుస్తకాల ప్రచురణలో మీ అనుభవాలతో ఒక టపా వ్రాసేయండి మరి.
    -సి.బి.రావు
    హైదరాబాదు.

    ReplyDelete