అందునా ,గుప్పెడు అక్షరాలు వారి చేత చిక్కాయనుకోండి...
ఎన్ని చమత్కారాలు చేయ గలరో..
చూడండి.
ఈ చిన్నారి.. ఏకంగా తన స్వంత బ్లాగునే మొదలు పెట్టేసింది.
అచ్చమైన తెలుగమ్మాయి. ఇప్పుడిప్పుడే అక్షరాలు చేతబట్టింది.
తెలుగు నాట ఉన్న ఎన్నో బడుల్లాగే,వాళ్ళ బడిలోనూ తెలుగు తక్కువ.
తనకూ తెలిసింది తక్కువే.
అందుకే, తను రాయగలిగిన విషయాలను తనకు వచ్చిన మాటల్లో చెపుతోంది..
చూడండి.
పిల్లల సృజనకు భావ వ్యక్తీకరణకు వారి భాష అడ్డంకి కాకుడదు కదా ?
వారికి వచ్చిన మాటలను మనం ముందుగా తెలుసుకోవడం మొదలు పెడితే బావుంటుందేమో.కదండీ?
ఇంతకీ, ఆ అమ్మాయి పేరు , సుహానా.
నిజమే, నాకూ ఎంతో ఇష్టమైన పాట,
" సుహానా సఫర్ ..ఔర్ యే మౌసం హసీన్.."
ఇక, ఆమె బ్లాగుకు పెట్టుకొన్న పేరు, "ఫెయిరీ ల్యాండ్ ఆఫ్ సుహానా "
ఇంకెందుకు ఆలస్యం అందులో "కో జా నేకు" తయారవ్వండి.
http://fairylandofsuhana.blogspot.com/
ఇలాంటి పిల్లల బ్లాగులు ఇంకా ఉండే ఉంటాయి. మీకు తెలిస్తే ,
అందరితోను పంచుకోరూ..
*
చిన్నారి సుహానా చేయ దలిచిన సుధీర్ఘ సాహితీ ప్రయాణానికి ఇది తొలి అడుగు.
ఆమెకు అనేక శుభాకాంక్షలు .
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
చిన్నారి సుహానా చేయ దలిచిన సుధీర్ఘ సాహితీ ప్రయాణానికి ఇది తొలి అడుగు.
ఆమెకు అనేక శుభాకాంక్షలు .
*
No comments:
Post a Comment