బతకలేక బడిపంతులనేవారు ఒకానొకప్పుడు.
వారు అప్పుడూ ఇప్పుడూ
అంతే. పంతుళ్ళలో
పుణ్యపంతుళ్ళు వారు !
ఇకపోతే, బతకనేర్చిన బడిపంతుళ్ళు
మనం చూస్తుండగానే,
ఇంతై ఇంతింతై
తామింతై ...పోతూ ఉన్నారు.
వారి సంగతీ అటుంచండి.
బతకడానికి బడి పంతుళ్ళయిన
వారు ...ఉద్యోగధర్మమో
యాజమాన్యనిర్బంధమో విధివిధానమో నిర్వర్తించక
తప్పదు కదా"
అనవచ్చు!
అయిప్పటికీ,
ఒకానొక పాఠం ...ఒక్క
పంతులు /పంతులమ్మ
..మనల్ని పల్టీలు కొట్టనీయకుండా..తిన్నని బాటలోకి
మళ్ళిస్తుంది.
నయానో భయానో.
చెవి నులిమో .మొట్టికాయ
వేసో.
మెత్తగా మాట్లాడో.గట్టిగా పోట్లాడో.
సరిగ్గా .. అలాంటి ఆర్ద్రత
తరగతి గదిలో
ఆవిరయిపోయినట్లుగా తోస్తోంది
కదా !
పాఠ్యప్రాణాళికల్లో పరీక్షలనిర్వహణల్లో ఫలితాలకొలతల్లో మునిగితేలుతూ.
ఒకానొక పాఠం ...ఒక్క
పంతులు /పంతులమ్మ
...నిరాశలో ముంచి నిస్పృహలో దించి
మనల్ని పక్కదోవ పట్టించవచ్చు !
పిల్లల కడుపు నిండిందో
లేదో చూసే
తీరిక గానీ
,ఏ బిడ్డ
కంట నీరుందో
ఏ కనుల్లో
కలలు దాగున్నాయో
ఏ మునివేళ్ళలో
ఏ ఏ
కళలున్నాయో గ్రహించ గలిగే లోగానే, బడి
గంట గణ
గణ మంటొంది
కదా !
బడిలో
నేర్చే పాఠాలు బతుకుతెరువు కొరకు పరిమితమవుతూ పోతుంటే ..అసలుసిసలు పాఠాలు గుణపాఠాలు
నేర్పేందుకు మన బతుకు బడి సదా సిద్ధమై ఉంటుంది !
ఒకమారు
తడబడి నపుడు , తోలిసారి తప్పు కంటబడినపుడు , ముసిచీకటిలో ముసురుకొట్టున్నప్పుడు, వడగాడ్పులో
కొట్టుమిట్టాడుతున్నప్పుడు,
నొప్పించక
...
తెలివిడిగా
మనకు ఒక వెలుగు బాట చూపిన వారందరూ మన పంతుళ్ళేగా!
వారందరికీ
సవినయ నమస్కారాలు.
ఈ పాఠాలన్నీ మన
జీవితాంతం అందుతూనే ఉంటాయి.
బతుకు బడి నేర్పే
పాఠాలను అర్ధం
చేసుకోవడానికి , మన జీవిత కాలం
సరిపోతుందా?
బడిలోనో కళాశాలల్లోనో విశ్వవిద్యాలయాల్లోనూ...
పాఠం చెప్పను
పూనుకొన్న వారందరికీ జేజేలు.
మీరు విన్నపాలు వినవలే ఒక మారు.
***
All rights @ writer.
Title,labels, postings and related copyright reserved.
No comments:
Post a Comment