Feb 26, 2011

నేను లేనూ- ఇపుడిపుడే రానూ ..


వురేయ్ ఈ ఖద చదివేవాడూ..ఈ ఖద చదివేవాడూ! ఆ గోపిగాడొస్తే నేను లేనూ- ఇపుడిపుడే రానూ -తెలుగు సినిమాకి వెళ్ళిపోయానూ అని చెప్పరా- ఎం?"
***అయిపోయింది***

అయిపోయిందంటూ  మనకి దూరంగా పరుగులు పెట్టేసిన ఆ పెద్దాయనకు 
ఏమని చెప్తాం?
 బుడుగు ని ఇలా మనకు అప్పజెప్పేసి .. తాను తప్పుకున్న పెద్దాయనకు!
ఎప్పటికీ అయిపోని  ఈ బురుగు ఖదలకు, ఆ కథకుడి కలం పోషణకి......జై!
 ఆ పసితనపు పచ్చదనం పదికాలాలు పదిలం.పదిలం.
ముళ్ళపూడివారికి  జేజేలు పలుకుతూ.. అన్నట్లు, అదేంటో, ఆయనను వంటరిగా సాగనంపడం ఇష్టం లేక కాబోలు
అంకుల్ పాయ్ తోడెళ్ళారు.
సజల నయయాలతో ..సగౌరవంగా వీడ్కోలు.వారిరువురికీ.
ఇది ఎన్నటికీ అయిపోయేది ఆగిపోయేదీ కాదు కదా.

మరి వారి జ్ఞాపకంగా అందరూ ఒక మారు నుల్చుని, కళ్ళు మూసుకొని ,గొంత్తెత్తి, గాఠిగా, గడగడా  పదమూడో ఎక్కాం వప్పజెప్పేయండి!
కుదర్దూ?
ఎక్కాల బుక్కు తరవాత వెతుక్కుందురు.
ముందీ కథ చదివేయండి.

రాచ్చసుడూ ..పదమూడో ఎక్కం... ఖద..

***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

1 comment:

  1. Dear chandralatha.,

    Congrats for your sucess in your attempt to enliven budugu giving continuation of ramana'jis inkling. as i am aware of your grandsucess in reflecting the regional dialects of andhra pradesh it may not be difficult to bring back ramana'ji. I wish that you continue your efforts as a writer on this new track. Wish to speak in person at the earliest.. with best wishes...

    ReplyDelete