"ఇంద మల్లె పువ్వు
ఇదో గులాబీ పువ్వు
ఇవి డాక్టరు కివ్వు
పువ్వాయన నవ్వు "
అంటూ ,
"ప్రేమకు వేల జవాబులు మంచికి లక్ష కితాబులు" ఎంతో ఆప్యాయంగా డా.రాం గారి పై గుమ్మరించిన కె. వి .రమణారెడ్డి గారి మాటలమల్లెలివి. అర్పించిన అంతిమ నివాళి ఇది .
డా. రామ్స్ సావనీర్
డా. రామ్స్ సావనీర్
పుస్తకాల అడుగున ఎక్కడ దాక్కుందో ...
మొన్నీ మధ్యన మళ్ళీ నన్ను పలకరించింది. ఆర్తిగా .ఆప్యాయంగా.
ఈ పుస్తకం అన్ని జ్ఞాపికల్లాగా ..
మరుగైన వ్యక్తి ని అతని మంచిని గోరింతలు కొండంతలు చేసేసి ,నాలుగు బొమ్మలు, పదిమంది పరామర్షలతో..
పుస్తకాన్ని ముడిచేసేది కాదు.
మరుగైన వ్యక్తి ని అతని మంచిని గోరింతలు కొండంతలు చేసేసి ,నాలుగు బొమ్మలు, పదిమంది పరామర్షలతో..
పుస్తకాన్ని ముడిచేసేది కాదు.
ఇది , ఒక విశిశ్ట వ్యక్తి జీవితాన్ని, ఆలోచనను, కార్యశీలతను..అన్నింటినీ ఎన్నింటినో ప్రకటించే సంధర్భం.
సమాజానికి మౌలిక అవసరాలైన విద్య, వైద్యం.. ఈ రెండు రంగాల్లో ..వారు రెండు తిరుగు లేని ఉదాహరణలను మన ముందు ఉంచారు.
"A realistic idealist"అంటూ సంజీవదేవ్ గారు సంభోధించినట్లుగా, ఆదర్శాలకు సజీవ రూపకల్పన చేయ కలిగిన వారు, డా. రాం,డా.పుచ్చలపల్లి రామచంద్రా రెడ్డి గారు....
ప్రస్తుత నెల్లూరు రామచంద్రా రెడ్డి ప్రజావైద్య శాల స్థాపకులు. కావలి విశ్వోదయ వ్యవస్థాపకమూలస్థంభాల్లో ఒకరు.
కావలి విశ్వోదయ లో, డా.రాం విగ్రహ స్థాపన చేసిన సంధర్భంలో ,తిరగవేసిన జ్ఞాపకాల పేటిక " డా. రామ్స్ సావనీర్" ఈ స్మారక సంచిక కు సంపాదకులు ప్రముఖ పాత్రికేయులు జి.కృష్ణ గారు.

సంపాదకీయం ఇలా ఈ పుస్తకాన్ని పరిచయం చేస్తుంది.
"ఇది రాం పుస్తకం.పుస్తకాల పుటల్లో నిక్షిప్తం కాని కాలేని వ్యక్తిత్వం రాం ది. ఏ రచయితకు అంతు చిక్కదు ఆ శైశవ దరహాస హేల. ఏ శిల్పరుచికీ లొంగదు ఆ త్యాగ నిరతి మధురిమ ."
పాత్రికేయులు జి.కృష్ణ గారు అన్నట్లు,
" మానవత, నైపుణి, ముక్కోపం ,ధీరత్వం, త్యాగం, ఉద్వేగం, అసంతుష్టి .. ఇన్నింటిని భగవంతుడు ఒకే మనిషి లో ఎందుకు కలిపి పెట్టాడా అనిపించేది ."
" మానవత, నైపుణి, ముక్కోపం ,ధీరత్వం, త్యాగం, ఉద్వేగం, అసంతుష్టి .. ఇన్నింటిని భగవంతుడు ఒకే మనిషి లో ఎందుకు కలిపి పెట్టాడా అనిపించేది ."
"పదాలు జడాలు. పదార్ధాలు సజీవాలు. అర్ధాలు మనం వెతుక్కోవాల్సిందే.
ఎక్కడ?
శూన్యంలో. నిశ్శబ్దంలో . ప్రేమలో. కారుణ్యంలో."
నా బోటి వాళ్ళకు,
అప్పిచ్చువాడు , వైద్యుడు లేని ఊళ్ళో ఉండడం ఎలాగో తెలియక పోవచ్చు. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి కావచ్చు.
ప్రథమ చికిత్స నుంచి బేర్ ఫుట్ డాక్టర్ల వరకు, మౌలిక వైద్యం నుంచి మానసిక చైతన్యం వరకు, సామాజిక రుగ్మతల చికిత్స నుంచి రాజకీయప్రక్షాళన వరకు...వైద్యుని బాధ్యతను విస్తరింపజేసిన ", నెల్లూరు పరిసరాల్లోని ఊరూరికీ వైద్యాన్ని చేర వేసిన... .ప్రజావైద్యులలో డా.రాం గారిని ప్రముఖంగా ప్రస్తావించుకోవాలి.
"His life was a triple stream of compassion, wisdom and freedom" అని డా.సంజీవ దేవ్ గారంటే ,
ఇక డా రాం గారి సతీమణిశ్రీమతి రాజ్యలక్ష్మి గారంటారు,
My husband was a mountain of strength ,ocean of generosiy and a sea of self -sacrifice"
ఇక డా రాం గారి సతీమణిశ్రీమతి రాజ్యలక్ష్మి గారంటారు,
My husband was a mountain of strength ,ocean of generosiy and a sea of self -sacrifice"
ఆయన జీవన సహచరిణికి మించి ఆయనను అర్ధం చేసుకోగలవారెవ్వరూ?
***
(ఇది వ్యాసం మొదటి భాగం మాత్రమేనండోయ్!)
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
No comments:
Post a Comment