మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని ..ఒక ఉవాచ!
మనం పోగొట్టుకొంటున్న బాల్యాన్ని.. ఆగండి ఆగండి.
మీకు ఎలాంటి భారీ ఉపన్యాసం ఇవ్వాలన్నది నా ఉద్దేశం కానే కాదు.
కానీ..,
మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని ..ఒక ఉవాచ! మనం పోగొట్టుకొంటున్న బాల్యాన్ని.. ఆగండి ఆగండి. మీకు ఎలాంటి భారీ ఉపన్యాసం ఇవ్వాలన్నది నా ఉద్దేశం కానే కాదు.నిజం.
మరేనండీ, ఆ నిజం ఏమంటే మన బాల్యం మనం అంటే నా తరం అంతకు అటూ ఇటూ ..హాయిగానే గడిపాం.
నాకు బాల్యం అంటే గుర్తొచ్చేది.. బోలెడన్ని కథలే .
ఆ కథలన్నీ ..చెప్పుకొన్నవి.చదివినవీ. విన్నవీ. చదివి చెప్పుకొన్నవి.చదివి వినిపించినవీ.
ఇదేదో ..కాలం నాటి కథ కాదు కానీ,
అప్పుడు.. ముఖ్యంగా కాస్త పుస్తకానికి చోటిచ్చే ఇంటిలో తప్పక కనిపించే విశేషం ఇదే.
పిల్లల పుస్తకాలు... విశాలాంధ్ర వారు రోడ్డు పక్కనే కొయ్య బెంచీల మీద అమ్మిన రంగురంగుల "రాదుగా" పుస్తకాలు.
క్రమం తప్పకుండా ఇంటికి వచ్చే , చందమామ, బుజ్జాయి,బొమ్మరిల్లు,బాల..ఎన్నెన్ని పిల్లలపుస్తకాలో.
మరి, ఇవ్వాళ పిల్లల పుస్తకాలు లేవా ?అంటే,
"ఇదుగోండి ..ఇలా రండి.. పిల్లలకోసం ఎన్నెన్ని మంచి పుస్తకాలున్నాయో ..." అంటూ ఆత్మీయం గా పలకరిస్తున్నారు..సురేష్ గారు, భాగ్యలక్ష్మిగారు, CAప్రసాద్ గారు.
అనకూడదు కానీ,
పిల్లలకు పుస్తకాలు కొనాలంటే ,ఎన్ని సందేహాలో.
ఎలాంటి పుస్తకం కొనాలి?
ఏ వయసుకు ఏ పుస్తకం?
కథలదా? పాటలదా?
కథలంటే ఏ కథలు?
ఎవరు రాసినవి? ఏ పుస్తకంతో మొదలు పెట్టాలి?
బొమ్మలదా? రంగులు నింపేదా?
తెలుగా? ఇంగ్లీషా ?
ఇలా , ఒక దాని మీద ఒకటి. సందేహాల వెల్లువెత్తుంది.
ముఖ్యంగా, తెలుగు మాట మరుగున పడి పొతున్న ఈ తరుణం లో.. పిల్లలలకు పుస్తకాలా? అందులోనూ తెలుగులో..! ఇక, స్వయానా , ఈ శుభ కార్యానికి నడుం బిగించి, అటు ఉపాధ్యాయులకు ఇటు తల్లిదండ్రులకూ ..మరీ ముఖ్యంగా పిల్లలకు ..వివరించి చెపుతూ విడమరిచి చూపిస్తూ,సరిగ్గా అదే చేస్తున్నారు.. .
పిల్లలతో కలిసి మెలిసి.. పిల్లల కోసం...చాల కాలంగా పని చేస్తున్న , సురేష్, CA ప్రసాద్ భాగ్యలక్ష్మి గార్లు.
వారు స్వయాన అచ్చు వేసినవి, పై నుంచి, CBT,NBT, జనవిజ్ఞాన వేదిక ,పాలపిట్ట,Peacock, తదితర పిల్లల పుస్తకాలను శ్రద్ధగా సేకరించి అందిస్తున్నారు, హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ లో,
"మంచి పుస్తకం" లో.
ఇవన్నీ,
అచ్చైన తెలుగు పిల్లల పుస్తకాలు మాత్రమే..!వీరి పక్కనే NBT వారి నెలవు.వీరి చుట్టూ, లెక్కకు మిక్కిలి పుస్తకాల కొలువు.
అంతకు మించి ఏం కావాలి ?
*
అన్నట్టు, అక్కడ అచ్చు తెలుగే కాదండోయ్..
ఆ పక్కనే , ఇ-తెలుగు కూడా పలకరిస్తుంది. మనసారా! మరి ,ఆలస్యం దేనికి ..అటో అడుగేయండి.
మంచి పుస్తకం ప్రాప్తిరస్తు ! తథాస్తు !!!
*
ఏ మాటకా మాట. మంచిపుస్తకం లో గడిపిన కాసేపూ ..చిన్నతనంలోకి వెళ్ళి పోయానండీ.
తప్పు నాది కాదని మీరు ఒప్పుకుంటారుగా?
*
Related posts:
All rights @ writer.
Title,labels, postings and related copyright reserved.
Good Info
ReplyDeleteఎనిమిదో తరగతి చదువుతున్న మా మేనకోడలు కోసం ఏవైనా పుస్తకాలు కొందామనుకున్నపుడు సరిగ్గా మీరు చెప్పిన సందేహమే వచ్చింది.మీ టపా ద్వారా నాకో సమాధానం లభించింది.
ReplyDeleteధన్యవాదాలు.
@ హరినాథ్ గారు
ReplyDeleteధన్యవాదాలండి.
@రవిచంద్ర గారు
మీరు మీ ఇంట్లోని పిల్లల కోసం ఒక పుస్తకం కొనాలన్న ఆలోచన చేస్తున్నారంటేనే ..ఎంతో సంతోషించవలసిన విషయం.మీలా ఇంటికి ఒకరు ఉంటే చాలదా?
మరి, మీరు ఏ పుస్తకాన్ని ఎంపిక చేసుకొన్నారు?
baagundi. manchi blog
ReplyDeleteilaantivi chaala avsaram
చందమామ కథల సంకలనం తీసుకున్నాను. ఎందుకంటే నేను చిన్నప్పుడు చదివిన ఈ కథలు నా వ్యక్తిత్వంపై ఎంతో ప్రభావం చూపాయి. అందుకనే ఈ పుస్తకం ద్వారా వాళ్ళను కూడా అలాగే తయారు చెయ్యాలన్నది నా అభిప్రాయం.
ReplyDelete@శ్రీపాద గారు, ధన్యవాదాలు.
ReplyDelete@రవి చంద్ర గారు,ఒక మాట.
మీరూ గమనించే ఉంటారు. పిల్లలు ఈ మధ్య కొన్ని పుస్తకాలు తెగ చదివేస్తున్నారు.వీరి శాతం ఎంత అనేది అలా ఉంచి , ఆ కొన్ని పుస్తకాలలో..విశేషాల గురించి మాట్లాడుకొందాం.హ్యారీ పాటర్,ఎరగాన్, టైం ప్యారడాక్ష్ లాంటివి.డా విన్సీ కోడ్ కూడా.
ప్రతీ పుస్తకం వరుస పుస్తకాలతో హోరెత్తించేస్తున్నది.
అవి ఇంగ్లీషు పుస్తకాలు.నిజమే.ఆ విషయాన్ని అలా ఉంచుదాం.
పిల్లలు ఆ పుస్తకాలను ఎందుకని అలా చదువుతున్నారు ..అన్నది మనం ప్రశ్నించుకొందాం.
అందులోనే , ఈనాటి పిల్లలకు ఎలాంటి పుస్తకాలు కావాలో తెలుస్తుంది.
ప్రధానం గా..కావలిసింది, ముఖ్యం గా ఎనిమిది లేదా ఆ పై తరగతి చదువుతున్న పిల్లలకు ,సమకాలీన బాలల సాహిత్యం.
మన తెలుగులో సమకాలీన బాలలకు సరితూగే బాలలసాహిత్యం మీ దృష్టికి వచ్చిందా? తెలియ పరచగలరు.
ఇంతకీ,ఈ విషయమై మీరేమంటారు?
Chandra Latha garu,
ReplyDeletethankyou for the update.
"చందమామ కథల సంకలనం " is this in Telugu? I hope it is avaialble to buy online(print version). Can anyone give details?
I am eager to see responses to this very direct question,
"అవి ఇంగ్లీషు పుస్తకాలు.నిజమే.ఆ విషయాన్ని అలా ఉంచుదాం.
పిల్లలు ఆ పుస్తకాలను ఎందుకని అలా చదువుతున్నారు ..అన్నది మనం ప్రశ్నించుకొందాం.
అందులోనే , ఈనాటి పిల్లలకు ఎలాంటి పుస్తకాలు కావాలో తెలుస్తుంది.
ప్రధానం గా..కావలిసింది, ముఖ్యం గా ఎనిమిది లేదా ఆ పై తరగతి చదువుతున్న పిల్లలకు ,సమకాలీన బాలల సాహిత్యం.
మన తెలుగులో సమకాలీన బాలలకు సరితూగే బాలలసాహిత్యం మీ దృష్టికి వచ్చిందా? తెలియ పరచగలరు."
చాలా రోజుల క్రితం సిరిసిరిమువ్వ గారి బ్లాగులో తెలుగులో పిల్లల సాహిత్యం అనే విషయం మీద మంచి చర్చ జరిగిందండీ.. అసలు పిల్లల పుస్తకాలే దొరకడం లేదన్నది అవాస్తవం.. అందుబాటులో ఉన్న పుస్తకాలు మన ప్రాధాన్యాలకి ఎంతవరకూ సరి తూగుతున్నాయన్నదే సమస్య..
ReplyDeleteచంద్రలత గారూ, ఈ విషయంలో నాకూ మీలాగే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఈ టపా ఒకసారి చదవండి..http://vareesh.blogspot.com/2009/03/blog-post_13.html
ReplyDeleteప్రశ్న కు ప్రశ్నే సమాధానం అంటే ఏమిటో ఇప్పుడు అర్ధమైంది.
ReplyDeleteధన్యవాదాలండీ సిరిసిరిమువ్వ గారు.
మంచి చర్చే జరిగింది.
ఇంతకీ , మనం ఆశించిన సమాధానం మన ఇద్దరికీ దొరికిందని..సమాధానపడి పోదామంటారా లేక..ఇంకా వేచి వుందామంటారా?
I happened to read the earlier discussion on Telugu books for teenagers. My advocacy has been about the early childhood Telugu literacy. When I chanced by that post, I thought, "I didn't think about that." Then, "there is hope for books for my kids when they reach that age and reading level", For, the discussion has been quite productive.
ReplyDeleteYet, there are many questions and hopefully that just means more results.
Looks like there is a good effort going on in the beginning readers group. It might catch up in other age groups too.
చంద్రలత గారూ! ఆలస్యంగా సమాధానమిస్తున్నందకు ఏమీ అనుకోకండి.
ReplyDeleteనాకు బాలల సాహిత్యం గురించి పెద్దగా తెలియదు. కాకపోతే ఇప్పటి పిల్లలను, నన్ను చిన్నతనంలో ఉత్తేజితుణ్ణి చేసిన పుస్తకాలను(ఎక్కువగా నీతి కథలు,ఆధ్యాత్మిక కథలు, రామాయణ భారతాల్లోంచి వాళ్ళ స్థాయిలో ఉండే కథలు) మాత్రం చదవమని ప్రోత్సహిస్తుంటాను. అంతే కాకుండా వాటిని తమ నిజజీవితానికి ఎలా అన్వయించుకోవాలో చెబుతాను. ఇంకా సృజనాత్మకతను ప్రోత్సహించడానికి బాలల చందమామలో చిన్న పిల్లలు రాసిన కథలు, కవితలు, అరేబియన్ నైట్స్ కథలు చదవమని ప్రోత్సహిస్తాను.
చిన్న పిల్లల పుస్తకాల గురించి తెలిపారు. సంతోషం. ఇంటర్నెట్ లో పిల్లల కోసం ఓ బ్లాగు పేట్టాను. ఓకసారి చూడండి.
ReplyDeletehttp://audiseshareddy.blogspot.com/
ఇది చూడండి:
ReplyDeletehttp://www.indg.in/primary-education/multimediacontent/languages-1/telugu/c35c3fc15c4dc30c2ec41c28c3f-c2ac30c3ec15c4dc30c2ec2ec41
ఇలాంటివే మరి కొన్ని ఇక్కడ:
http://www.indg.in/primary-education/c24c46c32c41c17c41
మొదలు ఇక్కడ:
http://www.indg.in/india/home-page-te/view?set_language=te