Nov 11, 2009

పిల్లలు...పుస్తకాలు * 3

? టివి చూడటం కన్నా బుక్ రీడింగ్ విధంగా మేలు చేస్తుంది?

1. టివి పెనుభూతం కాదు. ఇది ఒక సాంకేతిక పరమైన ప్రగతి చిహ్నం..అలాగే ఇంటర్నెట్. మన ముందు తరాలకన్నా అనేక రెట్లు మనం సమాచారపరం గా ముందున్నాం. అయితే, మన ప్రగతి ఫలం మన ఆరోగ్యం కొసమే కాని అజీర్తి కోసం కాకుడదు.మన శక్తిని మన ప్రగతికి వినియోగించుకోవాలే కానీ మనలను నిర్వీర్యురులను చేసేందుకు కాదు.

2.టివి, పుస్తకపఠనం .. వీటిలొ.. పుస్తకపఠనం లోనే ఇందాక చెప్పిన సృజనత్మక అనుభవానికి చోటెక్కువ. వాక్యాల నడుమ ఒక గొప్ప ఊహా ప్రపంచాన్ని మనం ఆవిష్కరించుకొంటాం. ఇది నూటికి నూరు పాళ్ళు రచయిత రాసింది కాదు. కథ చుట్టూ ..ఎవరికి వాళ్ళం మన స్వతంత్ర ప్రపంచాన్ని సృష్టించుకొంటాం. రచయిత ఊహా ప్రపంచానికి పరిచయకర్త .కనుక, ఒక కథ రాయడం ఎంతటి సృజనాత్మక అనుభవంతో చదవడం సృజాత్మక అనుభవమే. అందులోను.. సాహితీ ప్రపంచంలో..సర్వ స్వతంత్రమైన జీవి ఎవరంటే ..పాఠకుడే.పాఠకుడికి "freedom of interpretation" ఉంటుంది. తనకు నచ్చినట్లుగా స్వతంత్రంగా నిర్వచించుకో గల వారు పాఠకులే. ఇక, దృశ్యమాధ్యమానికి వస్తే.. కథలోని నేపధ్యానికి, పాత్రలకు...ఒక " స్పష్టమైన "రూపము, సంభాషణలకు..ధ్వని...ఇలా ప్రేక్షకుడి సృజనకు ఊహకు అవసరం లేకుండా ...స్థిరీకరించబడతాయి. కనుక. .ఇందులో స్వతంత్ర సృజనాత్మకత కు అవకాశం దాదాపు గా లేనట్టే.

3. మధ్య కాలంలొ పిల్లలను అంతగా అలరించిన పుస్తకాన్నైనా తీసుకొండి. హ్యారీ పాటర్ నవలకు సినిమాకు ఉన్న తేడా..లేదా"జురాసిక్పార్క్ ".."ఎరగాన్ " ..ఏదైనా. 4. ఇక్కడ మనం ఇంకో విషయం కూడా గుర్తించాలి.. కథలు పుస్తకాలకే పరిమితం కాలేదు..అవి ఇతర మాధ్యమాలకు విస్తరించాయి. కథల విషయంలో.. మాధ్యమంలోనైనా..పెద్దల ధోరణి ఒక్క లాగానే ఉంటుంది.. సమయం వృధా..distraction..అని. 5. కథలు రూపం లో ఉన్నా మనతో పాటు ప్రయాణించడమే మనం ఆశించాలి. వయసుకు ముచ్చట..!

? చివరగా..మీరు చెప్పబోయేది..?

* అమ్మానాన్నలు పిల్లలను దగ్గరగా తీసుకొని కథలు చెప్పడం అన్నది .. మానవ సంబంధాలలోని ఒక నాజూకైన ఆత్మీయ కోణం. రూపేణా, కుటుంబంలోని వ్యక్తుల మధ్య ఒక emotional bond తెలియకుండానే ఏర్పడుతుంది. అమ్మానాన్నలు అనగానే ఇప్పటి పిల్లలకు...homework చేయించే వారు.. పోటీలకు సిధ్ధం చేసేవారు..progress reports కొలిచే వారు ..అన్న జ్ఞాపకాన్ని మిగల్చడం మన సామాజిక విషాదం.

ఇక, కథ చెప్పడము ఒక సృజనాత్మక కళే కదా.పిల్లలను ఆకట్టుకోనేలాగా వాళ్ళను మెప్పించేలా కథ చెప్పగలగడం పరస్పర సంబంధ బాంధవ్యాలకు..మూలం కాగలదు.కథ చెప్పడం ఎంతో నేర్పుతోనూ ఓర్పుతోనూ ముడి పడి ఉంది. అమ్మానాన్నలు ఒక సాంస్కృతిక వారసత్వంలా అంది వస్తోన్న కథనకళ ను ...నీళ్ళు వదులుతున్నారు. ఎంత సంతోషాన్ని వాళ్ళు కోల్పోతున్నారో ..అనిపిస్తుంది. తలుచుకున్నప్పుడల్లా..!

ధన్యవాదాలు : పద్మశ్రీ యలమంచిలి గారు 8-11-2008న "వసుంధర,ఈనాడు" కొరకు చేసిన ఇంటర్వ్యూ లోనుంచి

మరికొంత.

4 comments:

 1. ఈ విషయమై అమెరికాలో చాలా ప్రాధాన్యమిస్తారనిపిస్తుంది. లాంగ్వేజ్ అండ్ ఆర్ట్స్ లో భాగంగా, రాయటం, చదవటం పిల్లలికి బాగా అలవాటు చెస్తారు..

  ReplyDelete
 2. Chandra Latha garu,
  this is a subject close to my heart.

  I read both parts of this post and read the comments too.

  I understand the point of view that there isn't the right kind of encouragement for reading in our community.
  There are a few exceptions. They think exactly like you, I'm sure.
  At least I do.
  Yes, during preschool years, expose them to letters. It could be a cheap (price wise) magazine or picture book
  which we can afford the kids to play with, scriblle in and tear too even.
  As the slogan goes here, "learn to read, read to learn".

  There are points on which I have a strong opinion too.
  Please show some good childrens books in Telugu. Please!

  We have literature that is incredibly sweet and great.
  What we don't have are stepping stones. If there's a ladder leading upto the great literature, it has some of its rungs missing.
  If they are there, they are exteremely hard to find, to the extent of being invisible.

  As of reading itself, I wouldn't discourage kids reading English or Hindi or any language for that matter, if that lays a habit of reading in them in the first place.
  Language skills have to have a foundation somewhere.

  Let us produce a great quantity of quality childrens' literature in Telugu.
  Let us let interested parents know about such exisiting literature.

  Meanwhile, parents like me also have to bend a little and just let them read a Telugu book, even if it doesn't meet their standard.
  I struggle with it here.

  Most importantly, please make good childrens' literature in Telugu be widely known.
  Please suggest books that are good for beginning readers, plenty of them :-) !

  Thanks,
  Lalitha.

  ReplyDelete
 3. లలిత గారు
  విషాదం ఏమంటే ,మనకు లభిస్తున్న తెలుగు పిల్లల పుస్తకాల్లో సమకాలీనత తక్కువ.దాదాపు లేదనే చెప్పాలి. ఉన్న వాటినీ ...
  నా దృష్టి కి వచ్చిన వాటినీ ఒక్కొక్కటిగా పరిచయం చేసే ప్రయత్నం చేస్తా..ముందు ముందు..
  మీ సూచనకు ధన్యవాదాలు.

  ReplyDelete
 4. After having read this interview (in fact I read in the newspaper too), I am glad to know that not only do you feel this way, but are also able to express it. Especially the 2nd point.

  I'm sure there's a good future for Children's literature in Telugu with voices like yours advocating in good spirit. Looking forward to see what good books will see the light of your introduction :-) Even a few are to begin with. The more we read the more we will want and hopfeully make.

  As one of my aunts said, the kind of bonding you described, is in fact, a pleasure for parents, one of their treasures and rewards for being a parent.

  What we need is plenty of good books in Telugu for the pre-chandamama age.

  ReplyDelete