పండక్కో పబ్బానికో మనింటికి వచ్చిన అతిధులకు తిరిగి వెళ్ళేప్పుడు
మన శక్తి కొద్దీ పండో ..ఫలమో..ఆకువక్కో ..పసుపోకుంకుమో ఇచ్చిపంపుతాం.
పెళ్ళీపేరంటాలయితే ఇకచెప్పక్కరలేదు. పెళ్ళికి పిలుపులతో పాటూ అతిధులకు కానుకలతాంబూలం అందించే అలవాటు కొందరిది.వెండికుంకుమ భరిణల దగ్గరనుంచి...చీరసారెల వరకు...పువ్వుల నుంచి మిఠాయిలవరకు..ఏదో ఒక కానుకతో అతిధులకువీడ్కోలు పలకడం మన ఆనవాయితి.వట్టి చేతులతో అతిధులనుసాగనంపడం మనకు అలవాటు లేదు.
అనుకుంటాం కానీ, కాలం తో మన ఆనావాయితీలు...అలవాట్లూ మాయంఅయిపోవు.
మరో రూపంలోకి మారిపోతాయి.
అంతే..!
చూడండి.
ఇప్పటి అమ్మానాన్నల హడావుడి.
పిల్లల పుట్టిన రోజుకి వచ్చి వెళ్ళే బుజ్జిఅతిధుల కోసం ఎన్ని రిటర్న్ గిఫ్ట్స్కొంటున్నారో..! అవి ఎంత ముచ్చటగా..అందంగా.. కొత్తగా ..ఉంటున్నాయో..!
చక్కగా రంగు రంగు కాగితాలు చుట్టి..ఓశాటిన్ రిబ్బనుముడేసి.మరీఇస్తుంటారు. ఒక్కో మారు... జరిగిన పార్టీలో చేసిన అల్లరి కన్నా అందిన ఈ చిట్టి కానుకలను పిల్లలు తలుచుకొని తలుచుకొని తెగ సంబరపడి పోతుంటారు. మరి ,మన సృజనాత్మకత అంతా ఆ వీడ్కోలుకానుకలలో పెడితిమయ్యే..!
చలిమిడి ...గుగ్గిళ్ళు..పప్పూబెల్లాలకాలమా ఇదీ? కుడిమిస్తే పండగని సంబరపడ్డానికి మన పిల్లలేమైనా మనలాంటి లోకం తెలియనివారా? వారిని బట్టే మనం నడుచుకోవాలి కదా!
అందరితో పాటు ..ఎవరికీ తగ్గకుండా ..ఎంత ఖరీదైనా పిల్లల ముచ్చట తీర్చాలి కదా? నిజమే !
నేనొక పిల్లల పండుగకు వెళ్ళి వచ్చా.
ఒకరా ఇద్దరా ..
సుమారు పదమూ డు వేల మందిపిల్లలు.
ఒకటా రెండా ..
సుమారు పాతిక అంశాలలో అనేకవేదికలపై నిర్విరామంగా పిల్లలకు"స్పర్దలు"
వేయించిన వేరుశనక్కాయలు..వేడి వేడిమిరపకాయ బజ్జీలు..చల్లటి చాకోబార్లు,జాంకాయలు..మొక్కజొన్న కంకులు..
ఒకటా రెండా ..
పిల్లలు కోరుకున్నన్ని చిరుతిళ్ళు.
కోరి కోరి వండించి ...కొసరి కొసరి వడ్డించిన విందుభోజనాలు...వెరశి..బాలోత్సవాలు.
బహుమతుల మాట అటుంచి ..ప్రతి బడికీ ...ప్రతి అతిధికీ ...ఒక అపురూపమైన వీడ్కోలుకానుక అందింది.
అది ఏమిటంటే, వారి ఇంట నాటను ఒక మొక్క!
వారి ఇష్టాన్ని అడిగి ..వారి వూరివాతావరణాన్ని బట్టి .. మీరు తీసుకెళ్ళడానికి వీలుగా చక్కగా అమర్చి... మరీ చేతికి అందిస్తున్నారు.... శ్రీ రాయి వెంకటయ్యగారు. సింగరేణి విశ్త్రాంత చిరుద్యోగిగా కన్నా ...మొక్కల వెంకటయ్య గారిగా వారు అందరికీ పరిచయం. మీ ఇంటవారింటి మొక్క పెరగడమే వారుకోరుకొనేది.
అంతే కాదు. అరుదైనమొక్కలు సేకరించి వృద్ధి చేయడంపలకరించిన వారి చేతికి ఒక మొక్కనిచ్చి సాగనంపడం వారికి నిత్యకృత్యం. వారింటి పెళ్ళికి వచ్చిన ప్రతి అతిధికీ..ఒక మొక్కను ఇచ్చి పంపారంటే ..మరి ఊహించుకోండి..!
పండగైనా పబ్బమైనా పెళ్ళైయినాపేరంటమైనా..నిర్విఘ్నంగా ఈ మొక్కలకానుకలు అందిస్తూనే ఉన్నారు. మరి వారి వూరిలో పిల్లలపండుగ జరుగుతుంటే పిల్లలను వట్టి చేతులతో ఎలా తిప్పి పంపుతారు వారు?
ఒక గొప్ప నమ్మకం తో..ఆవేదనతో..ఆశతో..ఆశయంతో వారీ పనినిచేస్తున్నారు.
రెండు రోజులు వారిని దగ్గరగా చూశాక..అనిపించింది.. ఇంత నిశ్శబ్దంగానిరాడంబరం గా తను నమ్మిన పనిని తాను చేస్తూన్న వెంకటయ్య గారి నుంచి నేర్వవలసి ఉన్నది ఎంత ఉంది కదా అని!
మరి మీరీ సారి వీడ్కోలుకానుక ఏమిస్తారు?
ఒక మొక్కా? ఒక బుక్కా?
అవునండీ.. పుస్తకాలనూ అంత అపురూపంగా మనం ఇచ్చిపుచ్చుకోకపోతే ...వనాల వలే సాహితీవనాలూ అరుదై పోతాయి..మృగ్యపోతాయి..!
కదండీ?
రాయి వెంకటయ్య గారు ప్రకృతి ప్రేమికులే కాక , స్వయానా కవికూడా..!
చూడండి..
డా.రమేశ్ బాబు,కొత్తగూడెం,గారికి ధన్యవాదాలతో...
Title,labels, postings and related copyright reserved.
WOW!
ReplyDeleteఆ మధ్య వచ్చిన రెడ్డిశాస్త్రిగారి కథలో పాత్రలాగున్నారీయన!
సంతోషం.
Dear Chandra Latha garu, I learnt about a great personality today... Thank you very much.
ReplyDeleteDear Raghurama Rao garu, please read this blog. It is about a plant-lover. Very inspiring... we may motivate our 'Green army' with such examples.
ఈ బాలోత్సవం గురించి నేనూ ఈనాడులో చదివాను. ప్రతీ సంవత్సరం జరుపుతారటకదా! ప్రభుత్వం హైదరాబాద్ లో నిర్వహించే కార్యక్రం కన్నా కొత్తగూడెం లో జరిగే ఈ కార్యక్రమమే ఎంతో ప్రయోజన కరంగా ఉంటుందని విన్నాను.
ReplyDeleteavunanDee..baalOstav pratyEkam gaanE unnadi. mukhyamgaa.. pillala kathaku chaala pramukha sthaanaanni vaaru ichchaaru.katha cheppaDam, raayaDam,vishlEshinchaDam ilaa anEka vidhaalaugaa pillala kahtanu vEdika pai velugulO unchaaru! idi naaku nachhcina amSam.
ReplyDeleteChandra Lata gaaru, in support of your suggestion about exchanging books as goodies /gifts, I felt like quoting:
ReplyDelete"A book is a gift that you can open again and again."
People like this are an inspiration to nurture goodness ourselves. And articles like this, are an inspiration to take pleasure in that kind of effort.
Thanks for your encouragement.
ReplyDelete