Nov 21, 2009

మాటలు వేయేల?

క్యరాజ్య సమితి ,"బాలల హక్కులతీర్మానము" ప్రకటించి నవంబరు,20 ,2009 నాటికి యాభయ్యేళ్ళు.మరియు ఐక్యరాజ్య సమితి "బాలలహక్కుల సదస్సు" తో చట్టబద్దంగాఅనుసంధానమైన ఇరవయ్యవవార్షికోత్సవం.

ప్రత్యేక సంధర్భంగా,

అనేక మానవవాద సంఘాలు, బాలలమరియు స్త్రీల హక్కుల ఉద్యమసంస్థలు,హేతువాదులు,నాస్తికులు,లౌకికవాదులు,శాస్త్రీయవాదులు,మనసికవైద్యనిపుణులు,పిల్లల వైద్యులు,విద్యావేత్తలు మరియుమేధావులూ అంతర్జాతీయమానవవాద హేతువాద సంఘాలసమాఖ్య (International Humanist and Ethical Union, IHEU ,మతం పేరుతో ..మతంముసుగులో బాలలపై జరిగేఅత్యాచారాలను అరికట్టేఅంశాలలో...ఐక్యరాజ్య సమితి,న్యూయార్క్ ,జెనీవా మరియువియన్నా, యొక్క ప్రత్యేక సలహాదారు) సారధ్యంలో ...

- జాతీయ బాలల హక్కుల సంరక్షణాసమితి

- ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల సమితి..లను కలిసి,

ఏడేళ్ళ శాంభవి అన్న బాలిక పై మతంపేరిట జరుగుతున్న వింతైన,విషాదభరితమైన అత్యాచారం ...పెద్దలమూఢవిశ్వాసానికి పావు కావడం...మాధ్యమాల అవాంచిత ప్రసారశైలికికేంద్ర బిందువు కావడాన్ని ....ఖండిస్తూ...

సంయుక్తంగా చేస్తోన్న ప్రకటన.శాంభవిపై అర్ధరహితంగా ఆపాదించబడిన పునర్జన్మ , తదుపరి మాధ్యమాలు చూపించిన అత్యుత్సాహ ధోరణి,శాంభవి "సంరక్షకులు " చేసిన ప్రచార ఆర్భాటాల వైఖరి , క్రమంలో, బాల్యం పై ఎటువంటి సున్నితత్వం లేకుండా ప్రవర్తించిన తీరును...అది పసితనానికి చేస్తోన్న గాయాన్ని ,పసి మనస్సు పై చూపే శాశ్వత దుష్ప్రభావాన్ని గమనించి ...

మేము తీవ్రంగా స్పందిస్తున్నాం.

డిసెంబరు ,2009 ఆంధ్రప్రదేశ్ నందలి సూర్యనంది గ్రామానికి ,దలైలామ రాక నిర్ధారణ కావడం, ఒక పవిత్రస్థలంగా అక్కద తలపెట్టిన నిర్మాణానికి శంకుస్థాపన చేయబూనడం, శాంభవిసంరక్షకులు” ప్రకటించినట్లుగా ..శాంభవిని దేవతగా గుడిలొ ప్రతిష్టించబూనడం...నిర్ధారించబడింది.శాంభవి ద్వారా ఇప్పించ బడుతున్న అనేక సందేశాలు మతపరమైన వాటికన్నా టిబెట్ సంబంధిత రాజకీయ పరమైనవే .

రాజకీయసాధనల కోసం,..మతమూఢత్వాల స్థాపన కోసం , విధంగా పిల్లలను వినియోగించడాన్ని...నీచాతినీచమైన దోపిడీగా దౌర్జన్యంగా భావిస్తూ,ఒక అమాయక పసిబాలిక ను విధమైన అవాంఛనీయ పరిస్థితిలోకి నెట్టివేయడాన్ని

మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.

-ఇప్పటి వరకు పునర్జన్మ ఉదంతం నిరూపించబడలేదు. పైనుంచి,ఇలా పునర్జన్మ ఆపాదించబడిన పిల్లలు వయోజనులవ్వడానికి ఎంతో ముందుగానే తీవ్రమైన మానసికరుగ్మతలకు బలి అయ్యినట్లుగా గుర్తించబడింది.

-శాంభవి ఉండవలసింది బడిలో కాని గుడిలో కాదు.

-శాంభవి కి అందరి పిల్లల లాగానే ఆటలాడుకొనే హక్కు ,సామాన్య బాల్యాన్ని జీవించే హక్కు ఉన్నది.

-తల్లిదండ్రుల సంరక్షణలో ఉంటూ..అమ్మానాన్నల ఆలనాపాలనలో అల్లారుముద్దుగా పెరగడం శాంభవి ప్రాధమిక హక్కు.

-శాంభవి సంరక్షకుల మాటలను బట్టి స్పష్టపడుతున్నది ఏమంటే, పాప 4 ఏళ్ళ వయస్సులోనే సన్యాసినిగా మార్చబడింది.అప్పటినుంచి వాస్తవప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

పిల్లలపై జరిగిన ఇటువంటి అత్యాచారం ,బాలల సంక్షేమాన్ని సంరక్షించే అన్నిరకాల చట్టబద్ద నియమావళినీ అతిక్రమిస్తుంది.పిల్లల తల్లిదండ్రుల మతవిశ్వాసాల కన్నా పిల్లల హక్కులు మౌలికమైనవి. ప్రధానమైనవి.

-మధ్యమాలు పిల్లలను అత్యంత ప్రత్యేక వ్యక్తులుగా చూపించడాన్ని మానుకోవాలి.

పిల్లల వార్తలను ప్రసారం చేసేటప్పుడు అవలంబించవలసిన పద్దతిని ఆవిష్కరించాలి.పిల్లల భవిష్యత్తుపై తీవ్రప్రభావాన్ని చూపే ఇటువంటి వార్తలను ప్రసారం చేసే ముందు ,పిల్లల పట్ల వ్యవహరించవలసిన తీరును నిర్వచించాలి. బాధ్యతను గుర్తించాలి.

నేపధ్యం లో ,

మేము జాతీయ బాలల హక్కుల సంరక్షణా సమితి మరియు ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల సమితి.. ... వారిని విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని , మార్గనిర్దేశం చేయాలనీ కోరుతున్నాము.

1. శాంభవి కి పిల్లల మానసిక వైద్య నిపుణుల సలహాను అనుసరించి సంరక్షణ కల్పించాలి.

2.రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్దేశించి , సంబంధిత శాఖలకు పాటించవలసిన కార్యాచరణపై ఆదేశాలు జారీ చేయాలి.మొట్టమొదట శాంభవి నిర్బంధాన్ని నిరోధించాలి.అందుకు అవసరమైన సివిల్ మరియు క్రిమినల్ చట్టాలను వినియోగించాలి.

3.శాంభవి అపహరణ కు గాని నిర్బంధాని కి గానీ గురికాలేదని నిరూపించడానికి, ఆమె తల్లిదండ్రులను వెంటనే ప్రవేశపెట్టి , ఆమే birth certificate బహిరంగ పరచాలి.

రియాలిటీ షో లలో పిల్లలపై అవాంఛితధోరణి మొదలయినప్పుడు, జాతీయ బాలల హక్కుల సంరక్షణా సమితి జోక్యం చేసుకొని , బాలల హక్కులను విఘాతం కలగకుండా వ్యవహరించవలసిన తీరును నిర్దేషించింది.మాధ్యమాలు బాలలతో వ్యవహరించవలిసిన వైఖరిలో సున్నితత్వాన్ని , బాధ్యతగా ప్రవర్తించవలసిన అవసరాన్ని మరొక మారు నిర్దేశించవలసిందిగా కోరుతున్నాం.

పిల్లల పై దౌష్ట్యాలను అరిగట్టడం మనందరి బాధ్యత. భారతదేశం ప్రపంచంలోని 10% బాల కార్మిక వ్యవస్థను కలిగి ఉన్నది.ఇది విషాదం.

వారి చుట్టూ ఉన్న పెద్దల సంరక్షణ కావల్సిన కోట్లాది మంది పసిపిల్లలలో శాంభవి ఒకటి.మేము మతస్తులను, మతాతీతవ్యక్తులను అందరినీ ఆలోచించవలసిందిగా పిలుపునిస్తున్నాం.

దోపిడీ మతం పేరిట జరిగినా మతం ముసుగులో జరిగినా ఒక నైతిక నేరం నేరమే.ఘోరం ఘోరమే.

మేము ప్రొ. శాంతా సిన్హా, అధ్యక్షులు , జాతీయ బాలల హక్కుల సంరక్షణా సమితి గారికి విజ్ఞాపన పత్రం అందజేస్తున్నాము.

- జస్టిస్ సుభాషణ్ రెడ్డి, అధ్యక్షులు ,ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల సమితి, , గారికి , ఫిర్యాదు దాఖలు చేస్తున్నాము.మానవహక్కుల కమిషన్ వద్ద పిటిషన్ దాఖలు చేస్తున్నాము.

ఇది మానవ హక్కుల పోరాటం. మత విశ్వాసాల పై చర్చకాదని మనవి.

మానసికంగా శారీరకం గా స్వేచ్చగా ఎదగడం పిల్లల హక్కు. హక్కును అమలుచేయడం ,కాపాడడం పెద్దల బాధ్యత.

అంతర్జాతీయ మానవవాద హేతువాద సంఘాల సమాఖ్య (International Humanist and Ethical Union,)హైదరాబాద్, www.iheu.org

6 comments:

 1. జాతీయ బాలల హక్కుల సంరక్షణాసమితి,ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల సమితి వారికో విజ్ఞప్తి ,మనదేశంలో బాలురపైనా,బాలికలపైనా ఇంతకన్నా ఘోరమైన అత్యాచారాలు జరుగుచున్నాయి.వాటిగురించి పట్టించుకోండి స్వాములూ.తినడానికి తిండిలేక, కట్టుకోవడానికి బట్టల్లేక ,చదుకోవడానికి అవకాశాలు లేక చాలామంది బాలబాలికలు సతమతమవుతూ ఉన్నారు.వాళ్ళ హక్కుల గురించి కూడా ఆలోచించండి.ఇలాంటి సంఘటనలు ఇతర మతాల్లో జరుగుతున్నా మీ కారుణ్య కళ్ళకు కనిపించవా?

  ReplyDelete
 2. నమస్కారం.
  మతం వ్యక్తిగతం.
  "ఏమీ తెలియని చిన్న పిల్ల" ను కొందరు పెద్దల స్వార్ధ ప్రయోజనాల కోసం ఒక పావు లా వాడడం...అన్నది ఏ మతం లోని విజ్ఞులు ప్రోత్సహిస్తారు?
  ఇది, బాలికా హక్కులకు సంబధించిన మౌలిక ప్రశ్న.
  ఈ రోజటి ఈనాడు పత్రిక నందలి "నకిలీ దేవత శాంభవి?" అన్న వార్త చూడవలసిందిగా సవినయ మనవి.
  అన్నట్లు, వాటికన్ నందలి child abuse కేస్ నందు వాటికన్ ప్రతినిధిగా ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్ ముందు చర్చకు వచ్చిన వారు , సరిగ్గా ఇలాగే వ్యాఖ్యానించారు, "ఇతర మతాల్లో మాత్రం లేదా ? "అంటూ. అంటే , "మీ లో ఉనంట్లు అంగీకరిచినట్లే కదా".. అని ...తన పని తాను చేసుకు పోయింది ..UN Humanrights Commision.
  ఈ వివరాలు www.iheu,vatican.com నందు కాని Guardian పత్రిక లందు కాని చూడవచ్చు.

  మతస్తులలో ఉన్న విశ్వాసాన్ని ఎరగా వేసి.. చేసే మోసాన్ని.. పెంచే మౌఢ్యాన్ని.. చేసే దౌష్ట్యాన్ని ...ఎవరు ప్రోత్సహిస్తారు?
  బాలల హక్కులే మానవ హక్కులు..!

  ReplyDelete
 3. శాంభవిని ఒక ఆటబొమ్మను చేసి ఆ పిల్ల మాట్లాడే ప్రతి మాటకూ కళ్ళతోనే ప్రాంప్టింగ్ చెప్తూ ఆడిస్తున్న సంగతి మొదటినుంచీ ఈ ఇష్యూ గమనిస్తున్న ప్రతి వారికీ తెలుసు.

  ఆ పాప తల్లిదండ్రులెవరు అని ఒక్క మీడియా వ్యక్తైనా ఇంతవరకూ అడిగిన పాపాన పోలేదు.

  సొంత స్వార్థం కోసం సదరు ఉషారాణి చేపట్టిన ఈ టిబెట్ స్వాతంత్ర్యం ఇష్యూ మన దేశానికీ, చైనాకు మధ్య విభేదాలు సృష్టించే అవకాశాన్నికూడా తోసిపుచ్చలేం.! ఇటువంటి సంఘటనల నేపథ్యంలో కూడా ఈ శాంభవి ఉదంతం మీద దృష్టి పెట్టాలి.

  పసి పిల్లకు బాల్యాన్ని నిరోధించి,ఆమె జీవితంతో ఆడుకుంటున్న వారి మీద నిజంగానే చర్యలు తీసుకోవాలి. అందరి లాగే శాంభవి బడికెళ్ళాలి, ఆడుకోవాలి, చదువుకోవాలి, పరుగులెత్తాలి, గంతులేయాలి, పసి పసిపిల్లగా మారిపోవాలి.

  ఏ మతంలో ఉన్నా ఇలాంటివి గర్హనీయమైనవే! దీనికి ప్రత్యేకంగా మతం రంగు పులమటం ఇక్కడ న్యాయం కాదు.

  చంద్రలత గారూ, సరిగ్గా చెప్పారు..బాలల హక్కులే మానవ హక్కులు!

  ReplyDelete
 4. అభినందనలు ! BTW who is that little girl in the last photo (first I though that she is Shambhavi later I saw some of her photographs)?

  ReplyDelete
 5. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. మీ వంటి పిల్లల శ్రేయోభిలాషులు ఉన్నంత కాలం పిల్లల మంచి కొరకు చేసే ఏ ఒక్క ప్రయత్నమైనా వంటరి ప్రయత్నం కాబోదు.
  మేమూ మీ వెంట ఉన్నామనీ .. చేయూతను అందిస్తున్న వారందరికీ.. నిలబడి గొంతెత్తిన వారందరికీ జేజేలూ.
  అవునండీ, ఆ చిత్రం లోని పాప ..ఒక ఏడేళ్ళ పాప..తనకు మల్లే శాంభవినీ అల్లరిచేస్తూ.. ఆటలాడుతూ బడిలో చేరమని చెప్పడానికి వచ్చింది. చెప్పింది.అలాంటి మరికొంత పిల్లలు ఆ రోజు అక్కడికి నడిచి వచ్చారు.
  ఇప్పటికే, శాంభవి బాల్యం పణంగా పెట్టబడింది.ఆమె పసితనం వసివాడక ముందే ...తన ఈడు వారితో చేరి.. వారిలో ఒకరిగా... పెరగవలసి ఉన్నది.అదే మనం కోరుకుందాం.

  ReplyDelete
 6. Looks like your effort has made quite a stir.
  I hope this doen't end up as another sensational news item at the other end.
  I hope the girl is properly taken care of.

  ReplyDelete