Dec 27, 2009

అదుగో వారు...!

ష్ !
అదుగో వారు...! 
నిమగ్నమై ఉన్నారు...!! 
నిశ్శబ్దంగా ..నిగూఢంగా ..ఒక సాంకేతిక చమత్కారాన్ని ఆవిష్కరిస్తున్నారు...!!!
ఇదుగోండి.
మనం అప్పుడప్పుడూ ఆడిపోసుకోనే...సాఫ్ట్ వేర్ అబ్బాయిలూ! అమ్మాయిలూ! 
నిలబడి ..నిలదొక్కుకొని ..నిలబెట్టాలని ..ఒక చోట చేరి ..
కలివిడి గా విడివిడిగా... హడావుడిగా బుడిబుడిగా...చేస్తోన్న గట్టి ప్రయత్నాలు!
కళ్ళెదురుగా స్క్రీను ...క్యూబికల్ లో కుంచించుకు పోయిన చిన్న లోకం..ఆంగ్లదాస్యమూ తెలుగు మృగ్యమూ..మంట కలుస్తున్న మానవసంబంధాలు..విపరీత పాశ్చాత్య ధోరణులు...గట్రా గట్రా.
ఇక , ఆఫీసు,ఇల్లు ,వీకెండు..బ్యాంకు బ్యాలన్సు....నిజమే ..ఆర్ధిక మాంద్యం వచ్చాక మన అక్కసు కాస్త మెత్తబడింది కానీ..
నిన్న మొన్నటి దాకా మనం అందరం అటు ఇటుగా వెలిబుచ్చిన అమూల్య అభిప్రాయాలు ఇంచు మించు ఇలాంటివే.కదండీ?
నిజమే., వారి బోధన, జీవనశైలి ,మాట మన్ననల తీరు.. మనకు అలాగే అనిపించేది.అనిపిస్తుంది కూడాను.
లోగడ ,రామారావు కన్నెగంటి గారు, సురేష్ కొలిచాల గారు, తెవికీ రవి గారు విపులంగా విశదీకరించినప్పుడు కాని ..ఈ సాంకేతిక మాయాజాలం మూలాలు అర్ధం కాలేదు!
అటు కంప్యూటర్ క్రేజూ ఇంగ్లీషు మోజూ...! ఆ రెండీంటి ప్రభావంలో పడి నానాటికీ మరుగై పోతుందని దిగులు పడుతోన్న.. మన మాతృభాషను పదికాలాల పాటూ పదిలం చేసుకోవడానికి.. ఆ ఆంగ్ల భాషనే సాధనం గా చేసుకొని.. ఆ సాంకేతిక నైపుణ్యాన్నే నేపధ్యంగా మలుచుకొని.. ఒక కొత్త మార్గాన్ని నిర్మించుకోవాలని..వారన్నప్పుడు.. ఎంత ఉత్తేజం కలిగిందో. 
ఆ ఉత్తేజం మరింత కాంతివంతంగా ..e-తెలుగు లోగిలిలో కూడలిలో ముంగిలిలో ..వెల్లివిరిసింది.
అందుకే కాబోలు వజ్రాన్ని వజ్రం తోనే కోయాలి అంటారు! 
నిజమే, నిన్నా మొన్నటి వరకు.. ఒక చిన్న గుంపు నడుమ ప్రయాణించిన కొన్ని టపాలే.. కొన్ని అసహనాలే..ఆలోచనలే..ఆవేదనలే..అనుభూతులే. ఇప్పుడు నలుగురిలోకి రావనుకోవడమే అసలు సంగతి. ఇ-తెలుగు కోశాధికారి గారు తెలియజేసినట్లుగా... ఇది వారి తొలి అడుగే కావచ్చు గాక.. చేయ వలసిన సుధీర్ఘప్రయాణం ...ప్రారంభమైనట్లే! వారికి అనేక శుభాకాంక్షలు! మీరూ వారికి చేదోదు వాదోడు కావచ్చు నండోయ్!ఇంకెందుకు ఆలస్యం..ఈ కింది టపాలూ చూడండి.ఆదివారమే కనుక..అలా హుస్సేన్ సాగరతీరానికి వ్యాహ్యాళికి బయలు దేరండి!
*
చక్రవర్తి,వీవెన్,సతీష్ కుమార్,రవిచంద్ర,కశ్యప్, చదువరి,సి.బిరావు ,వరూధిని,పూర్ణిమ తమ్మిరెడ్డి,అరుణపప్పు గార్లకు ధన్యవాదాలతో.

Title,labels, postings and related copyright reserved.

4 comments:

 1. నిజానికి ఈ-తెలుగు స్టాలుకి వచ్చి స్వచ్చందంగా పని చేస్తున్నపుడు కూడా నాకింత సంతోషం కలుగలేదు.మీరు రాసిన ఈ టపా చదువుతున్నపుడు అంత సంతోషం కలిగింది. మీరన్నట్లు ఇది ఒక సుదీర్ఘ ప్రయాణమే. నాకైతే ఇది మొదటి మజిలీ. మొదటి మజిలీలోనే మీ లాంటి వారు పరిచయమైనందుకు ఎంత ఆనందంగా ఉందో!

  ReplyDelete
 2. ఆ ఆనందం నాదీను!
  ఇలా ఆలస్యంగా బదులివ్విడానికి మరో మంచి కారణం ఉన్నది.
  శ్రీ హనుమంతరావు కొడవళ్ళ గారు, అనురాధ కొడవళ్ళ గారు వారి స్వగ్రామంలో నిన్ననే ఒక గ్రంథాలయాన్ని ప్రారంభించారు.వారిరువురు సాఫ్ట్ వేరు వారూ ప్రవాసాంధ్రులూ.
  పలువురి మంచి ని ఆలోచించే మీ వంటి వారే నిశ్శబ్ద విప్లవాలకు బీజం వేసే వారు.
  ఆ ప్రయత్నాలు పదిలంగా పదికలాలు కొనాగాలనే మనం కోరుకోగలిగేది.
  మీ అందరికీ అనేక అభినందనలు.

  ReplyDelete
 3. పదికలాలు" .."పది కాలాలు" గా చదవ మనవి.

  ReplyDelete
 4. ఎంతమంది మిత్రులో.. ఎన్ని స్నేహ సంబంధాలో.. తలచుకుంటే ఆశ్చర్యం కలుగుతుందండీ.. నిజమే.. ప్రతి నాణేనికి బొమ్మా, బొరుసూ ఉంటాయి..

  ReplyDelete