అవి శ్రీలక్ష్మి ఆయేషా ఉదంతాల రోజులు. ఆడపిల్లలు వంటరిగా పట్నమెళ్ళి చదువుకోవాలంటే , ఎక్కడ చూసినా ఒక అభద్ర భావన.
పల్లెల గడపల్లోంచి పట్నానికి చదువులకోసం వచ్చే ఆడపిల్లలకు
ఒక సురక్షితమైన ఆవాసం ఉండాలనీ..
ఒక అమ్మాయి చదువు,వృత్తి నైపుణ్యము ,ఆ కుటుంబానికంతా ఆసరా అవుంతుందనీ.. ఆయన చాలా స్పష్టంగా నమ్మారు. తనకు తోచినంతలో కళాశాల విద్యార్ధునిలకు ఒక వసతిగృహం ఏర్పాటులో చాలా కృషి చేశారు. డా. కాసరనేని జయప్రదాంబ డిగ్రీకళాశాలలకు అనుబంధమైన ఈ వసతి గృహానికి నాన్నగారికన్నా ఎక్కువ ఆర్ధిక సహాయం చేసిన వదాన్యులు ఉన్నప్పటికీ. ఆయన ఆలోచననీ కృషిని దృష్టిలో ఉంచుకొని, వారి పేరునే నిర్ణయించారు డా. కాసరనేని జయప్రదాంబ కమిటీ వారు, డా.కాసరనేని సదాశివరావు గారి అధ్యక్షతన.
అప్పుడు, నాన్నగారు ,"తన పేరు వద్దనీ అమ్మ పేరు పెట్టమనీ", ఆఖరుకి అమ్మపేరుతో నాన్నగారి పేరునీ కలిపి, ఇలా.
***

అప్పట్లో అమెరికా ప్రయాణం అంటే ,ఇంత హడావుడి!
పాలమూరు నుంచీ పరిగి నుంచీ,అదిలాబాద్ నుంచీ వరంగల్లు నుంచీ,కర్నూలు నుంచీ గుంటూరు నుంచీ నెల్లూరు నుంచీ, అయినవాళ్ళంతా వెళ్ళి వీడ్కోలు చెప్పి ,సాగనంపాం.
కల్వకూర్తి నుంచి వచ్చే చిరాకి (చి. రామకృష్ణయ్య గారు) గారిది నాన్నగారితో చిరకాల మైత్రి.ఎక్కడ ఉన్నా తప్పక హాజరయ్యి ,ఇలా తిలకం దిద్దేవారు. నీలి అంచుల పంచల చాపు కూడా చిరాకీ గారి కానుకే.అయితే,నాన్నగారెప్పుడూ అంచులున్న ధోవతి కట్టలేదు.వారి అభిమానంతో శాలువాలా కప్పుకొనే వారు.
అయితే, నాన్నగారికన్నా ముందుగా,చిరాకీ గారే తమ అఖరి- ప్రయాణం చేశారు.
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
No comments:
Post a Comment