
నిరంకుశ తత్వం ఎంత పురాతనమైనదో ,మానవ స్వేచ్చ అంతకన్నా పురాతనమైంది.
బహుశా , మన జంతుమూలాల్లోనే, ఇవి రెండూ సహ భావనల్లా వ్యక్తీకరించ బడ్డాయి.

దోపిడీ... దౌర్జన్యం... అణిచివేత ... దుర్మార్గం ఒక పక్క..
స్వేచ్ఛ ..స్వతంత్రం ... ఆలోచన ..భావ ప్రకటన ... మరోపక్క..
మొదటి దానికి దగ్గరవుతున్నకొద్దీ ,మన జంతు మూలాలకు దగ్గరగాను,
రెండవ దానికి దగ్గరవుతున్న కొద్దీ , మానవ ప్రకృతికి చేరువగాను ..
మనం జరుగుతూ ఉంటాం .
మన ప్రయత్నాలన్నీ, మరింత మానవులుగా మనలను మనం తీర్చిదిద్దుకోవడానికే కదా !
బావక్ అన్వారి రచించి, దర్శకత్వం వహించి ,నిర్మించిన 2 + 2 = 5 అనే పర్షియన్ భాషలోని ఇరానియన్ సినిమా అలాంటిదే. ఈ సినిమాకు తరగతి గది నేపధ్యం కావడం మనం అందరం మరింత శ్రద్ధగా ఆ సినిమా చూడవలసిన అవసరాన్ని వత్తి చెపుతుంది.
2+2=5 అన్న జార్జ్ ఆర్వెల్ "1984" నవలానాయకుడు నియంతృత్వ దురంతాలను ఖండిస్తూ చేసిన వ్యాఖ్యానం అది.. నియంత చెపితే రెండు రెళ్ళూ అయిదేగా ! అన్నది.
కొస మెరుపు : ఈ సినిమా బాలోత్సవ్ లో " లఘుచిత్ర సమీక్ష" కొరకు ప్రదర్శించారు డా.నరేంద్ర గారు.
http://www.reckontalk.com/225-two-two-must-see-nominated-as-best-short-film-bafta-awards/
మరి పిల్లలూరుకొంటారా? తరగతినీ, పంతుళ్ళనూ, విద్యావ్యవస్థను ఉతికి ఆరేసారు!
అయితే, ఈ సినిమా అంతకు మించినదీ కావడం చేత మనమందరమూ చూసి తీరాలి. ఆలోచించాలి.
***
డా.నరేంద్ర గారికి ధన్యవాదాలతో
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
జార్జ్ ఆర్వెల్ వ్రాసిన 1984 నవల నాజీలను ఉద్దేసించి వ్రాసినది కాదనుకుంటాను. కమ్యూనిస్టులను ఉద్దేసించి వ్రాసినది.
ReplyDelete