" మాయమై పోతున్నడమ్మా..
మనిషన్నవాడు...
ఓ చెల్లీ చెందురమ్మా..."
" కలతల్ల కదుముల్ల
కల్లోల బతుకుల్ల ..
కడమారి చితులల్ల
కటికబారిన
వెతలల్ల..,
ఇగ్గులాడి.....ఈదులాడి
పొద్దొడ్డుకు జేరినమంటే,
పక పక నవ్వినమంటే...
ఇంతన్నా కొంతన్నా ఎంతన్నా
,
మనిషితనమున్నదన్నా
ఆ మనిషితనమే
తోడాయన్నాన్నా..
తోడాయే నీడాయే
దరిచేర్చు తెడ్డాయే యన్నా..
మనిషితనమున్నదన్నా...
మంచితనమున్నదన్నా..
మాయమైన మడిసిని
ఒడుపుగా బట్టి...
మాపుల్ల రేపుల్ల
మాయ జేసి తెచ్చి ..
మన సుటుముట్టు జేరిన
ఈ చిటిపొటి బిడ్డల్ల
గుట్టు గుట్టుగా
నాటి చూతమన్నా..
మనిషితనమున్నదన్నా...
మంచితనమున్నదన్నా..
చిట్టి గుండేల్లోనా ..
నాటుకున్న మంచి
కరుకు వేటుకైనా బోదు ...
విషపుకాటుకైనా బోదు....
నిండారా గుండారా
కండ్లల్ల బెట్టి సాకుతరన్నా..
కంటిపాపోలే సాకుతరన్నా..
ఆకేసి పూవేసి
కాయేసి పండేసి..
విత్తుల్లా విరజిమ్ముతరన్నా...
అడవిలా వెలుగొందునన్నా... మనిషితనమున్నదన్నా...
మంచితనమున్నదన్నా..
అడవిలా వెలుగొందునన్నా... మనిషితనమున్నదన్నా...
మంచితనమున్నదన్నా..
ఈ లోకాన ఉన్న నదీనదాలన్నిటిని కలుపుతూ ఒక విశ్వగీతాన్ని రాయాలని ప్రయత్నిస్తున్న అందెశ్రీ గారికి, నమస్కారాలతో..Balotsav 2014 , PC: Amarendra Dasari garu.
All rights @ writer.
Title,labels, postings and related copyright reserved.
చాలా బావుంది
ReplyDelete