ఇదే మొదటి సారి భద్రాచలం వెళ్ళడం.
గోదావరమ్మకు వాయినం ! |
" అదుగో భద్రాద్రి గౌతమి ఇదుగో
చూడండి..." రామదాసు చెవుల్లో రింగు మంటుంటే , ఒక అద్భుతమైన భావనతో గోదావరిని నావలను దాటుకొంటూ
వెళ్ళాం.
కార్తీక స్నానాలు చేయడానికి భక్తజనం రాకపోకలు బాగానే ఉన్నాయట ఈ నడుమ.
పై నుంచి నిన్న కురిసిన వాన. గోదారి మెట్లంతా బురద . జారుడు మెట్లంటే అవే కాబోలు.
అంచేత , కింద చూపే కానీ , గోదారమ్మని కళ్ళారా చూస్తూ నడవలేక పోయాం.
తీరా వెళ్ళాక, అక్కడ శ్రాద్ధ కర్మలు చేస్తోన్న బృందం ఒకటి . మరో పక్కన , కార్తీక స్నానాల వారు. నావల వాళ్ళు కేకేసారు. కార్తీక
స్నానాలకి అవతలి గట్టుకి తీసుకెళతాం రమ్మని . వేళ కాని వేళ. అయినా, చూసి వెళ్ళడానికి
వచ్చినవారమే కదా!
ఒక ఒంటరి గువ్వ |
ఆపై ఒక అక్క కార్తిక మాసం గోదారమ్మ వాయినాలను , అరటి బోదేపై అమర్చి కొనుక్కోమంటూ
వెంటాడింది. అది సమయం కాని సమయం.
మరొక అన్న , స్నానాలు చేసి వచ్చే
వారి కోసం పొడి బట్టలు అమ్ముతున్నాడు.
వాయినాల అక్క ! |
వానకి చెదురయిన ,గూటిని కట్టుకొంటూన్నరు
మరో జంట.
"గోదావరి కలుషితమై పోవడాన్ని
చూస్తూ పెరిగాం కదా..." ఆతిదేయ దంపతులిద్దరూ వాపోయారు.
"భద్రాద్రి ఒక
పచ్చటిగుట్టలా ఉండేది.." జ్ఞాపకం చేసుకొన్నారు.
గోదారి గట్టు |
అక్కడికి వెళ్ళాక కానీ తెలియలేదు.
బాపూ గారు భద్రాద్రి ని ఎంత ఆప్యాయంగా తీర్చిదిద్దారో.
ఆ కళాకృతుల తయారిలోనూ , ప్రతిష్టించడంలోనూ,
ఆ తరువాత వాటి బాగోగులు చూడడం లోను.. బాపు గారుఎంతో శ్ర్ద్ధ తీసుకొణే వారట. రాముడంటే
బాపు గారికి ఎంత ఇష్టమో మనకు తెలియనిది ఏముంది? బాపూ రేఖలు అలా శిల్పరూపంలో పలకరిచడం
, ఎంతో రమ్యంగా ఉన్నది. ముఖకవళికలు హావభావాలు ఎంత ఒడుపుగా పట్టుకొన్నారో ఆ శిల్ప కారులు.
వారికి జేజేలు.
కానీ, ఒక్కో బొమ్మను చూస్తూ
నడుస్తోంటే , కలుక్కుమన్నది. వెలసి పోయిన రంగులు,
పోషణ లేమి కళ్ళకు కొట్టొచ్చినట్టు
కనబడుతోంది.పెరిగిన కంప చెట్లు బొమ్మలను కప్పేస్తున్నాయి. ఇక, చుట్టూ "Junk foods "
ప్లాస్టిక్ అవశేషాల గుట్టల మేటలు.
బాపూరామాయణం |
గోదావరమ్మ బిడ్డలు, బాపు అభిమానులు
, తెలుగు శిల్ప కళాభిమానులు,
సీతారాముల అభిమానులు, భద్రాచల అభిమానులు పూనుకొంటేనే..
సీతారాముల అభిమానులు, భద్రాచల అభిమానులు పూనుకొంటేనే..
భద్రాద్రి... భద్రం. భద్రం
!
గోదావరమ్మ... శుభ్రం..శుభ్రం !
***
All rights @ writer.
Title,labels, postings and related copyright reserved.
You are always welcome to Bhadrachalam ...Chandralatha garu..!
ReplyDelete