|
Sri GuruBabu and Aruna GoginEni, Dr.indumathi Parikh, me and KotapaTi Murahari Rao garu ( father)
1998,January, IHEU International conference,Bombay. |
ఏ దానం గురించైనా
మాట్లాడానికైనా, ఆట్టే సంశయాలు
ఎదురురావు.
ఎందుకంటే , వాటికి సంబంధించిన
సామాజిక వాతావరణం
మన చుట్టూ ఆవరించుకొని ఉంటుంది. ఆయా సంస్కృతులు
సమాజాలు ... ఏ యే దానాలు ఎలా చేయాలో,
ఏ దానాల
వలన ఏ
యే పుణ్యలోకాలకు
చేరుస్తాయో కూడా సవివరంగా చెపుతాయి. ఇక,
ఏ దానం చేస్తే ఏ పాప విముక్తి కలుగుతుందో
కూడా.
అదలా ఉంచి,
మానవ సమాజాల్లో
, మనిషన్న వాడు సాటి మనిషికి
తనకు తోచినంత
సాయం చేయడం
,చేయాలనుకోవడం, తన మానవధర్మ గా కర్తవ్యంగా
భావించడం కద్దు .
అయితే, కాలాలు మారాక
,పొరుగింట్లో గిద్దెడు పంచదార అయినా అప్పు పుడుతుందే కానీ , చేసాయం అందడంలేదు. దానికి గల
సామాజిక ఆర్ధిక
కారణాలలోకి మనం వెళ్ళక్కరలేదు.
కానీ, మాయమై
పోతున్నడమ్మా మనిషన్న వాడు .. అని వాపోతున్న
ఈ నాటి
రోజుల్లో ... మానవ ధర్మాలు మళ్ళీ కొత్త
నిర్వచనాలను చిగురిస్తున్నాయి.
కుడి చేత్తో
చేసిన దానం
ఎడమ చేతికి తెలియ కూడదు అనే వారట .. పూర్వం. ఇక,
మా తాయ్యగారు
మా నాన్నగారికీ
చెప్పినిదీ , వారు అనేకానేక సంధర్భాలలో వివరించినదీ,
ఏమిటంటే,
"ఇచ్చిన దానాన్ని జ్ఞాపకం ఉంచుకోకూడదు.
పుచ్చుకున్న దానాన్ని మరిచి పోకూడదు."
మా
తాతయ్య ఒట్టి
రైతే, కానీ
వావిళ్ళ వారి
గ్రంథమాలలన్నీ ఆకళింపు చేసుకొన్న మనిషి. మా
వూళ్ళొ ఒక
బడి కోసం
ఆయన పడ్డ
తాపత్రయం ఎందరో చెపితే వింటూ పెరిగాం.
నాన్న గారు
వారి తండ్రి
నుంచి
నేర్చినదదే . "చేయగలిగిన సహాయం
చేయి. అది
నీ మానవ
ధర్మం. "
అందుచేత ,ఆయన కూడబెట్టుకున్నదంతా
,
ఆ నిశ్శబ్ద సంస్కారాన్నే.
విద్యాదానం అన్ని దానాలలోనూ
మిన్నని తాతయ్య
నమ్మారు. నాన్నగారు అదే ధర్మాన్ని పాటించారు.
తన బిడ్డల
చదువుల గురించి
ఆయన ప్రత్యేకంగా
సమయం పెట్టలేదు
కానీ, చుట్టూ
ఉన్న పిల్లలందరితో
పాటే, వారు
కలిసి చదువుకోవాలని
,అందుకు కావలసిన
ఏర్పాట్లు చేసారు.
నడిగడ్డ వీధిబడిలో
పలక బట్టి,
పాలమూరు
మున్సిపల్ బడి లో తరగతి మెట్లెక్కింది
మా చదువులు.
మాకేదో నాలుగు
అక్షరం ముక్కలు
వస్తున్నాయని, అప్పటి బంధుమిత్రులలోని
యువబృందం మమ్మల్ని కాన్వెంటులో ఆంగ్లమాధ్యమం లో
చేర్పించడం, నాన్న గారు మళ్ళీ మమ్మలను ,తెలుగు తరగతుల్లో పెట్టి,
"గాట్టి ఇంగ్లీశు" మాష్టారూ, వీర వసంతా చారి గారికీ మమ్మలను అప్పజెప్పడం , మా సాయంకాలాలనూ సెలవలనూ.. బందీ చేయడం ఒక ఎత్తు.
ఇక, శ్రీమతి అరుణ
గారి గురించి
చెప్పాలి.
మరణం గురించి ప్రతి
మనిషి కీ ఒక
స్వీయ నిర్ణయాధికారం ఉండాలన్న ఆలోచన ( Euthanasia) గురించి నిర్ఘాంతపోతూ తెలుసుకొన్నది , ఆమె పక్కన కూర్చునే.
నార్వే నుంచి వచ్చిన మానవ
వాదులు ఒక
కొత్త ఆలోచనలను మా ముందు పెడితే,
ఆకళింపు చేసుకోను
కొంత తడబడుతుంటే,
ఆమే, తల్లిలా
వివరంగా చెప్పారు.
అవయవ దానం గురంచి
కూడా విడమరిచి
చెప్పారు.
వారు, శ్రీమతి.అరుణా గోగినేని
గారు.
శ్రీమతి అరుణ గారిని
గురించి చెప్పాలంటే
ఆమె ఇంట ఆతిధ్యం పొందిన
అతిదులందరి గురించి చెప్పాలి.
నార్వే నుంచి
నంధ్యాల వరకు,
బుడాపెస్ట్ నుంచి భొధన్ వరకూ. లండన్
నుంచి ఇంకొల్లు
వరకు.. వారని
వీరని లేకుండా,
అప్పుడని ఇప్పుడని లేకుండా,ఆమె ఆప్యాయం గా ఆతిథ్యం ఇచ్చే వారు.
ఎవరికి కావలసిన రీతిలోవారికి .. ఎవ్వరినీ నొప్పించకుండా..
వారింటి
గాలులలో తెలుగు, ఇంగ్లీష్ హిందీ,
ఫ్రెంచ్, జర్మన్ భాషలుసాహిత్యాలు, సంస్కృతులు
గుస
గుసలాడేవి .
కాళోజీ , రావిపూడి,లెవిఫ్రాగిల్ నుంచి
నాబోటి వారి
అందరూ ఆమె
చేతి బువ్వ
తిన్న వారే.
ఆమె ఏదో అన్నంపెట్టి సాగనంపే తల్లి కాదు, అందరి
మాటలోనూ తన
మాట కలుపుతూ
, అందరి చేతల్లోనొ
తనూ ఓ
చేయి వేస్తూ..
అందరికీ అమ్మలా
ఉండేవారు.నాలాంటి బిడియస్తులను మరింత ప్రేమగా
వెన్ను తడుతూ..అభిమానంగా చూసుకొనే వారు.
(బహుశా ఆడపిల్లలు
లేని లొటు
ఆమె ఇలా
తీర్చుకొనే వారేమో.)
తల ముక్కలయ్యేంత నొప్పిని కూడా నిశ్శబ్దంగా ఓర్చుకొంటూ చిరునవ్వులా మార్చుకొనే , ఆ వ్యక్తి ...నిండా యాభైఏళ్ళు లేని వయస్సులో ,ఆకస్మాత్తుగా ,అర్ధాంతరంగా
, కోమా లోకి
వెళ్లి పోయారు.
ఉన్న ఒక్క బిడ్డ
దేశాంతరాన ఉన్నారు. వారు వచ్చేదాకా, ఊపిరిని
నిలబెట్టిన వైద్యులు ఇక, ఆఖరి నిర్ణయం
తీసుకోమన్నారు.
ఎంతయినా ఆ
తల్లి మురిపాల
బిడ్డ. అలాంటి
కఠిన నిర్ణయం
ఎలా తీసుకోగలరు.
?
అప్పుడే , డా ..జయ ప్రకాశ్ నారాయణ గారు, నాన్నగారు , ప్రభృతులు పక్కన నిలబడి,
ఆ ముప్పైదాటని బిడ్డను. అతని తండ్రినీ నిర్ణయం చెప్పమన్నారు.
ఊపిరియంత్రాల బంధవిముక్తురాలిని చేసి , ఆమెను లోకబాంధవిని చేశారు., ఆమెను
పువ్వులా వైద్య
కళాశాలకు అప్పగించారు. వైద్య విద్యార్ధుల
అధ్యయనం కోసం.
కళ్ళు, ఇతర ముఖ్యమైన
అవయవాలన్నీ అవసరమైన వారికి చేర్పించ బడ్డాయి.
అవయవ దానం లో, మతం కన్నా, సామాజిక
ధర్మాలకన్నా, ప్రాధాన్యత జీవించి ఉన్నప్పుడు ఆ వ్యక్తి అభిప్రాయలతోఉంటుంది పేగు ముడిపడ్డ బిడ్డ
మనస్సు తోనూ ఉంటుంది. సహచరుని
జీవితం తోనూ ఉంటుంది.
ఒక వైద్య కళశాలలో విద్యార్ధుల ముందున్న విగత శరీరం పరిస్థితి , ఆ బిడ్డ
కళ్ళ ముందు
కదిలి ఉండదా?
ఆ సహచరుని
గుండెను తాకి
ఉండదా?
ఆమె మబ్బుల నీడల్లోకి
నిశ్శబ్దంలోకి
జారుకొంటూ , మరెందరికో వెలుగు నిచ్చారు.
వారు, శ్రీమతి అరుణా
గోగినేని గారు.
ప్రముఖన కవి “
మో “ (మోహన
ప్రసాద్) గారికి స్వయాన చెల్లెలు. ఆమె
బిడ్డ శ్రీ
బాబు గోగినేని
గారు, సహచరుడు
శ్రీ గురుబాబు
గోగినేని గారు.
ఈ అవయవదానం, విగత
శరీర దానంలో
మానవ కోణాన్ని
మనం అర్ధం
చేసుకోవడం ముఖ్యం.
నాన్నగారు అరుణ
గారిని అంబులెన్సులో
ఎక్కిం చి ,సాగనంపి వచ్చాక అన్నారు,
"అమ్మాయిని పెళ్ళి చేసి
ఆత్తారింటికి
పల్లకిలో పంపినట్టుందమ్మా. కడదాకా
పువ్వులా సాగనంపాం..ఆమె నవ్వుతో సహా."
అని,
" మరి నాసంగతేం చేస్తావ్?"
అన్నారు.
ఆయన ఉద్దేశ్యం తెలిసిపోయింది . కానీ,
" ఆ
మాటలు ఇప్పుడెందుకు
లెండి" అంటూ చనువుగా కోప్పడ్డాను.
అడగగానే నేత్రదానానికి అంగీకరించడం ద్వారా ఆయన
మాట నిలబెట్టింది
మా అమ్మ.
అవయవాలు విఫలం చెందడం
వలన అవయవ దానం వీలు కాలేదు.నేత్రదానం చేయగలిగాము.
అన్ని
దానాలలోకి సున్నితమైన దానం , అవయవ దానం.
అమ్మకు జేజే.
నాన్న
మాట నిలబెట్టినందుకు.
అరుణమ్మకు జేజే
అందరికీ ఆదర్శమై
నిలిచి నందుకు.
***
ఎక్కడ నుంచో నాన్నగారి కనులు
ఈ లోకాన్ని చూస్తూనే ఉంటాయి అన్న భావం ,
ఇవ్వాళంతా నన్ను వెంటాడుతూనే ఉన్నది.
నేను చూస్తున్న
ఈ ఆకాశం ,ఈ మబ్బులు, ఈ వెలుగు ఈ చీకటి ....
ఈ పువ్వుల సౌకుమార్యం, ఈ సీతాకోకచిలకల సౌందర్యం ...
విరుచుకు పడుతున్న ఆ అలల నురుగులు ....
నీలాలనింగి లో విరిసిన ఆ వానవిల్లు వన్నెలు...
ఎవరో మరిద్దరూ చూస్తున్నారు !
వారికి నమస్కారం.
నాన్నకు కొత్త
చూపును ఇచ్చినందుకు !
***
All rights @ writer.
Title,labels, postings and related copyright reserved.