నా అక్షరమే నా పరిచయం.
అంతకు మించి ఏమీ లేదు.
ఏముంటుందనీ...?
అయినా,
ఒక్క క్షణం..!
పసితనాన్ని పచ్చదనాన్ని వెతుకుతూ ... ఎప్పుడైనా రాస్తూ ..ఉంటాను.
వర్ధని (1996)రేగడి విత్తులు(1997) దృశ్యాదృశ్యం (2003) నవలలు,నేనూ నాన్ననవుతా(1996),ఇదం శరీరం(2004),వివర్ణం(2007) కథాసంపుటాలు.
పిల్లలతో చేసిన చిన్న సృజనాత్మక ప్రయత్నాలకు రూపాలు.. విరిగిన అల(2005),పిల్లన గ్రోవి(2006),పట్టుపువ్వులు(2006) ప్రియమైన అమ్మా నాన్నా!(2006).
సస్యపథం, తెలుగు వ్యవసాయ శాస్త్రజ్ఞుల జీవన పదం(2009)," చేపలెగరా వచ్చు..!!!"(2009),"ఇతనాల కడవకు ఈబూది బొట్లు...! " (2010), "వచ్చే దారెటు"(2010)"మడత పేజీ" (2010)...మరి కొన్ని పుస్తకాలు.
వీటన్నిటికన్నా ముందుగా చేసిన చిన్న ప్రయత్నం నార్ల వారి పురాణ వైరాగ్యం పూరణ(1994).
చదవడం అంటే చాలా ఇష్టం.
నలుగురితోనూ నేను చదివిన మంచి పుస్తకాలు చదివించాలని గొప్ప తాపత్రయం. అలా ప్రభవించిన ఆలోచన.."ప్రభవ". పిల్లలతో కథాకాలక్షేపం.
ప్రభవ ,మన పిల్లల తొలిబడి ..బుడి బుడి చదువుల ఒరవడి..ఆటల పాటల పసిఒడి. http://www.prabhavaschool.com/
ఇక, సరికొత్త పుస్తకం "వాళ్ళు ..వీళ్ళు ..పారిజాతాలు "జూన్ నెల చతురలో చదవవచ్చును.
http://www.onlinemagazineshub.com/chatura.html
కొన్ని పుస్తకాలను మీరు ఇప్పుడు ఇక్కడ చదవొచ్చు.
http://kinige.com/kauthor.php?id=19
మీ ఈ పుస్తకం పేరు, ముఖ చిత్రం, గ్రాఫిక్స్ చక్కగా నచ్చేసాయండీ. ఇండియాలో వుంటే పుస్తకం చదివేసి కొనుక్కొని వుందును.
ReplyDeleteకామెంట్సులో వర్డ్ వెరిఫికేషన్ తీసేస్తే నాబోటి కామెంటేటర్లకి సులభంగా వుంటుంది.
ReplyDeleteపుస్తకం రూపురేఖలు నచ్చినందుకు ధన్యవాదాలు.
ReplyDelete