జీవితం తెరిచిన పుస్తకం అంటూ ఉంటారు.
నవల మూసిన గుప్పిట అనిపిస్తుంది అప్పుడప్పుడు.
విప్పనంత వరకు ఆ గుప్పిటలో ఓ అద్బుతప్రపంచం ఇమిడి పోయి ఉందేమో.. అనిపిస్తుంది.
విప్పిచూస్తే ..?
ఏముంటుంది ?
ఒక భ్రమాత్మక నిజం . నిజం అనిపించే భ్రమ.
ఒక సారి ఇలా ఆలోచించండి.
“అతడు – ఆమె” ..ఎదురుబొదురుగా కూర్చుని మనసు విప్పి మాట్లాడుకొంటే..ఏమవుతుంది ?
బహుశా రంగనాయకమ్మగారిదో సీతాదేవిగారిదో నవల అవుతుంది.
“సీతారామారావు “తన అసమర్ధతను మాత్రమే గొంతు నులిమి వేసి .."గొప్ప చైతన్యం " పొంది .పరివర్తన పొందాడనీ ..ఇంటికి తిరిగి వెళ్ళి భార్యాబిడ్డలతో హాయిగా జీవించాడనీ ..రాస్తే..?
పోనీ , “రాజేశ్వరి “భర్త చైతన్యవంతుడై.. ఆమె తరుపున మీరా తరుపునా వకాల్తా పుచ్చుకొన్నాడనీ మార్చేస్తే..?
లేదూ ... ఎన్నాళ్ళీ కీలుబొమ్మలాటా ? పుల్లయ్య చేత నలుగురి ముందు నిజం చెప్పించేద్దాం.
ఊహు..!
ఇవేవీ వీలు కావు.
ఎలా వీలవుతాయనుకొనటం ?
నవల ఒక భ్రమాత్మక నిజం.నిరంతరం సత్యాలను సృష్టిస్తూ పోతుంది.
ఈ సత్యాలన్నీ హేతుబద్ద సత్యాలు కానక్కరలేదు.అసత్యాలు.అపసత్యాలు,అర్ధసత్యాలు ఏమైనా కావచ్చు.
ఆ నవలా సత్యాలన్నీ ఆ నవలకే పరిమితం కావు. మన స్వంతమై పోతాయి. మన ప్రపంచంలోకి సత్యాలుగా విస్తరిస్తాయి.ఆ సత్యాలను ఎంతగా స్వంతం చేసుకొంటామంటే.. మరొకలాగా ఊహించడానికి కూడా ఏ మాత్రం ఇష్టపడం. ససేమిరా వప్పుకోం.
నిజం అంటే సాపేక్షమన్న మౌలికసత్యాన్ని కూడా మనం మరిచిపోతాం. అలా మరిచి పోవడం లోనే మనకు సంతోషం ఉన్నది.ఎందుకంటే..
మనం పాఠకులం !
మన భావోద్వేగాల పెట్టుబడి ని పెడుతున్నాం. తరం తరువాత తరం. ఉమ్మడి పెట్టుబడి .సామాజిక పెట్టుబడి.
నవలా సత్యాలను ఒక రచయిత సృజనాత్మక ప్రతిభగా ..రచయిత సృజియించిన భ్రమాత్మక ప్రపంచపు పరిధిలోని వనీ జ్ఞాపకం చేసుకోం.
పై నుంచి , మన నిజ జీవితం లో ఒక భాగం చేసుకొంటూ పోతాం.
మనం చూస్తూనే ఉన్నాం ..ఇలాంటి మిధ్యా సత్యాలు..సాహితీ సత్యాలు జీవిత సత్యాలుగా పరిణమించడాన్ని ..అవే అక్షర సత్యాలుగా చలామణి కావడాన్ని.
కనుక ,
సాహితీ సత్యాన్వేషణ ఆషామాషి వ్యవహారం కాదు.
కానే కాదు.
సెలవు
***
"తెలుగు నవల పూర్వా పరాలు "నుంచి.
డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ , దశమ వార్షికోత్సవాలు,20-21/9/2
***
All rights @ writer.
Title,labels, postings and related copyright reserved.
చాలా చెప్పేసారే! కొంచెం ఆలోచించి మళ్ళీ చదవాలి. అన్నట్టు మీ "చేపలెగరా వచ్చు" కోసం హైదరాబాద్ (చిక్కడపల్లి) ప్రజాశక్తి, దిశల్లో అడిగి నిరాశపడ్డాను. మరెక్కడ దొరుకుతాయి?
ReplyDelete:-)
ReplyDeleteBooks are available at Vishalandhra and Navodaya. Thank you.
ఒక లుక్కేయండి..
ReplyDeletehttp://palakabalapam.blogspot.com/2009/08/blog-post_08.html