Sep 5, 2017

పెన్నేటి తీరాన పుట్టిన "దయ్యం"!

మనలో మాట! మడిసన్నాక కుసింత భయమూ ఉంటదండీ ! మన పంతులయ్య ఎన్ని పాఠాలు చెప్పినా, మడిసేగా! భయపడ్డాడు.మనలని భయపెట్టాడు. కూసేపు. అంతే!
ఈ రోజు పంతుళ్ళ పండగ కదా , ఈ పెన్నేటి తీరాన పుట్టిన "దయ్యం" కథ గురించి అందరితో పంచుకోవాలనిపించింది .

https://chandralathablog.wordpress.com/2017/09/05/%E0%B0%B8%E0%B1%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A6%E0%B0%BE%E0%B0%97%E0%B0%BE-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A0%E0%B0%82/



All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Apr 28, 2017

నల్లరేగడి దున్ని చూడు !

ఎంతెంత? తానెంత?
ఈ విశాల ధరిత్రి ముందు మనిషెంత?nallaregadi 3nallaregadi 2
అయినా, కొలతలు వేస్తాం.  కొరతన పడతాం. కలతలు పడతాం.కలవరపెడతాం.
కక్షలు కార్పణ్యాలు, యుద్దాలు,వ్యాజ్యాలు …అంతా ఆ సూది మొన మోపే భూమి కోసమే గా.
కరువులు కాటకాలు , వానలు వరదలూ…ఎన్నెన్ని చూసిందో ఈ భూమి తల్లి !
పంటలూ పబ్బాలు…చావులూ పుట్టుకలూ… ఆయమ్మ ఎరుగని వైనాలా వైభోగాలా ?
తన వేలాది ఏళ్ళగమనంలో.
***
నలువైపులా పరుచుకొన్న నడిగడ్డ నల్లరేగడి !
నివ్వెరపోతూ నిలబడి పోయిన నేను!
nallaregadi 1
***
నా మట్టుకు నాకు, స్పూర్తీ మూర్తీ ఈ నడిగడ్డ నల్లరేగడి !
nallaregadi






rights @ writer. Title,labels, postings and related copyright reserved.

May 16, 2016

మనసెరిగిన మీకు , మనసారా !

ఈ మధ్య తరుచు ఒక ఆలోచన వస్తోంది.
కొంత గట్టిగానే.
మరికొంత కుతుహలంతో.
షేక్ స్పియర్ గారి హామ్లెట్ , శరత్ గారి దేవదాసు, ఆస్కార్ వైల్డ్ గారి డోరియన్ గ్రే , గోపీ చంద్ గారి సీతారామా రావు,
తటస్థ పడితే, మన అన్న గారు,  డా.జంపాల చౌదరి గారు ,ఏం చేస్తారా అని!
మాయలు చేయరు. మంత్రాలు వేయరు.
మరి, ఏం చేస్తారబ్బా?
మాటలు చెపుతారా? మాత్రలు వేస్తారా? 
సరదాగా అంటూన్నానని కాదు.




All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

May 6, 2016

సమ్మర్ హోం వర్క్!


వేసంకాలం సెలవలకు వెళ్ళే ముందు, పిల్లల అమ్మానాన్నలు కొంత హడావుడి పెట్టారు .
"ఏమిటండీ మరీను, సమ్మర్ హోం వర్కు లేదూ ప్రాజెక్ట్ లూ లేవు" అని.


https://chandralathablog.wordpress.com/2016/05/06/%E0%B0%B5%E0%B1%87%E0%B0%B8%E0%B0%82%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2%E0%B0%82-%E0%B0%87%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF%E0%B0%AA%E0%B0%A8%E0%B1%81%E0%B0%B2%E0%B0%82%E0%B0%A1%E0%B1%8B%E0%B0%AF%E0%B1%8D/


All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Apr 23, 2016

నా పేరు షేక్ స్పియర్ !


గులాబీని గులాబీ అని పిలవకపొతే , పరిమళం తగ్గుతుందా? వన్నె తరుగుతుందా ? షేక్ స్పియర్ ను శేషప్పయ్యర్ అని పిలుచుకొన్నా , షేక్ స్పియర్ స్కేస్పియర్ కాకుండా పోతాడా? షేక్స్పియర్ షేక్ స్పియరే ! అవును, "నా పేరు షేక్
స్పియర్ !" చూసి ,విని, ఆనందించండి.
My name is...

https://chandralathablog.wordpress.com/2016/04/23/my-name-is/




All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Mar 30, 2016

మధ్యే ..మధ్యే ..!

ఆ మహానుభావులందరికీ, ఓ దండం పెట్టి,మనం గ్రహించుకోవాల్సింది ,ఏమిటయ్యా అంటే, ..."
మిగిలినది ఇక్కడ చదవ మనవి.
మధ్యే ..మధ్యే ..!







All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Jan 8, 2016

అక్కడ కలుద్దాం!


కొత్త గూటిలో కళ్ళు తెరిచిన మడతపేజీ ...!

https://chandralathablog.wordpress.com/

ఇక్కడి ముచ్చటను ముగించి ,
అక్కడ కలుద్దాం! :-)
నమస్కారం. 
***

Facebook link :

https://www.facebook.com/chandralatha.prabhava

***


All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Dec 14, 2015

వారింట పూచిన పూలు !

డాక్టర్ల ఇళ్ళంటే ,
ముఖ్యంగా మాబోటి చిన్నాచితక పట్టణాళ్ళో ,
ఎవరో నియంత్రించి నట్లు, మూసపోసినట్లు , 
ఒకేలా ఉంటాయి.
కింద ఒకటో రెండో అంతస్తులు ఆసుపత్రి .ఆ పైన మెట్లెక్కితే ఇల్లు.
 ఒక విధంగా, రోగులు, వారి బంధువులు ,పుట్టే బిడ్డలు, గిట్టే ఊపిరులు.నిలబడే ప్రాణాలు.నిలకడ లేని క్షణాలు. నమ్మకం. అపనమ్మకం.
ఒక వైపు ఆనందం, ఒక వైపు విషాదం. ఓ పక్క నిబ్బరం మరో పక్క నిస్పృహ .
 అటు జీవితం పట్ల చివరి ఆశ. ఇటు జీవితం చిగురించిన  సంబరం.
అనేకానేక భావోద్వేగాలు కిక్కిరిసిన ఆ జాగాల్లో... మేడ మెట్లెక్కిన నిశ్శబ్ద ఆవాసాల్లా ఉంటూ ఉంటాయి.ఆ ఇళ్ళు.
 ఇరుగు పొరుగు , ముంగిలి లోగిలి అన్నీ , ఆ ఇళ్ళ వాకిళ్ళలో   ఆగి , ఊరించే  జ్ఞాపకాలే.
వూళ్ళో ప్రతి ఒక్కరికీ , ఆ ఇంటి చిరునామా తెలిసే ఉంటుంది. వారికో,వారి బంధు మిత్రులకో ఎప్పుడో ఏదో
అవసరానబడి ఆ గడప తొక్కే వుంటారు.
అలాంటి ఒక ఇల్లే , కొత్త గూడెంలోని డా.శ్యామలాంబ ,డా .నరేంద్ర కుమార్ గార్లది.  వారి ఆసుపత్రి మిద్దె మీది ఇంటి లో ఉన్నంతలోనే, కాస్త చోటు చేసి, బోలెడు మొక్కలను ఆప్యాయం గా    పెంచుకొంటున్నారు.

ఒక చిన్న తూగుటుయ్యాల ,కొన్ని కుర్చీలు ఎప్పుడూ సిద్ధంగా వుంటాయి . అలసిన డాక్టర్ దంపతులు సేద తీరడానికే కాక ,వచ్చే పోయే అతిథులకోసం.
శ్రద్ధగా ఎంపిక చేసుకొన్న పుస్తకాల ఖజానాలో వేలు పెడితే, ఇక అంతే. ఆ ఉయ్యాల్లో కూర్చుని , నరేంద్ర గారి చేతి ఆకుపచ్చ తేనీరు చప్పరిస్తూ,శ్యామల గారి హిమాయల సానువుల్లో ని ,పూలలోయల సోయగాల ముచ్చట్లువింటూ, పుస్తకాల కబుర్లాడుతూ కూర్చుంటే,
రోగాలురొప్పులు మంత్రం  వేసినట్లు మాయమై పోవూ ?
మరో వైద్యం కావాలేంటి ? 


డా.శ్యామలాంబ, డా.నరేంద్ర కుమార్ దంపతులకు స్నేహంతో,అభిమానంతో.)










All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Nov 21, 2015

తెలుగు విడుపరి

సన్మానపత్రం అందజేస్తున్న శ్రీమతి మార్టూరి పద్మావతి గారు. వేణుగోపాల రెడ్డి గారు,మార్టూరి వసంత్ నాయుడు గారు , సామల రమేష్ గారు. పుష్పరాజ్ గారి కుమారుడు. 


వారు ఒక ప్రవాసాంధ్రులు.
వారు  ఒక తెలుగువాచకం అచ్చు వేశారు. 
వారు చాలా కాలంగా తెలుగు పాఠాలు చెపుతున్నారు.  

ఖచ్ఛితంగా , వారు భాషావేత్త, పండితులు,అధ్యాపకులు, ఆ పై సంపన్నులు అయి ఉండాలి. సాహిత్య మారాజ పోషకులు అయి ఉండాలి .
ప్రవాసాంధ్రులకు  తమ పిల్లలకు తెలుగు నేర్పించాలన్న తాపత్రయం ఎక్కువ గనుక, ఈ సంధర్భాన్ని బాగా సొమ్ము కూడా చేసుకొని ఉండవచ్చు ! 
బోలెడంత ప్రచారము ,ఆ దరిమిలా కొండంత కీర్తి అబ్బి ఉంటాయి. 
అటు ప్రభుత్వము ఇటు విశ్వవిద్యాలయము బ్రహ్మాండంగా సహకరించి ఉంటాయి. 

బర్మానాయుడి గారిని పరిచయం చేస్తున్న స వెం రమేశ్ గారు. 
మొదటి మూడు వాక్యాలు మినహా, మిగిలినవేమీ ,వారు  కాకపోవడమే మొన్నామధ్యన జరిగిన ఘన సన్మానానికి మూల కారణం.
 బర్మా నాయుడిగా పేరు పొందిన  శ్రీ యర్రా నాయుడు గారు, అతి సామాన్యులు. అనామకులు. బర్మలో కనీస జీవనాన్ని సాగిస్తోన్న అనేక మంది తెలుగు వాళ్ళ చేతిలో తెలుగు అక్షరాన్ని పెట్టిన , బర్మా నాయుడు  గారు చదివింది రెండో తరగతి. తన కనీస అవసరాలను అతి కష్టాన తీర్చే పనుల్లో ఉన్నా, బర్మాలో తనలా ఉన్న అనేక మందికి తెలుగు పట్ల ఉన్న మమకారాన్ని గుర్తించి , వారికి తనకు తెలిసిన అక్షరం ముక్కను పరిచయ్మ్ చేసారు. ఆ సంధర్భంగా , ఒక వాచకం అచ్చు వేయాలని తాపత్రయ పడి, కాళ్ళరిగేటట్లు అన్ని చోట్లా తిరిగినా ఫలితం లభించక పోవడంతో ,చివరికి తనే ఆ ఫనికి పూనుకొన్నారు. ఆ సంధర్భంగా , స .వెం.రమేశ్ గారి ఎల్లలు ఎరుగని తెలుగు పాఠాల గురించి తెలవడమూ, తెలుగు వాణి పరిచయమూ , ఒక వాచకాన్ని రూపు దిద్దించాయి. 
యర్రానాయిడి గారి పెట్టుబడి తెలుగు పట్ల మమకారం. ఆదాయం నలుగురి చేతిలో ఒక అక్షరం ముక్క పెట్టగలిగానన్న ఆనందం .ఆయన మిగుల్చుకొన్నదీ ఆ అనుభూతిని. అంతే. 
  శ్రీ కంకణాల B.W.J. ఫుష్పరాజు గారి పేరిట  శ్రీమతి మార్టూరి పద్మావతి గారు గారు అందజేసిన  "తెలుగు విడుపరి" గౌరవ సత్కారాన్ని , మొట్ట మొదటి సారి యర్రా నాయుడి గారికి  అందజేసారు. బర్మా నాయుడు గారు ఆ సంధర్భంగా అందజేసిన ధనానికి తన కష్టార్జిత సొమ్మును మరికొంత జత పరిచి, తెలుగు అక్షరం అభివృద్దికే వినియోగించమని ,తెలుగు వాణి కి బహుకరించారు. యర్రా నాయుడి గారి నుంచి ఎంత నేర్చుకోవల్సి ఉన్నదో! గౌరవ వందనం. వినమ్రంగా .

స వెం రమేశ్ గారు,వసంత్ నాయుడు గారు ,తదితర తెలుగు అభిమానులు.

Nov 9, 2015

రేగడి నీడల్ల


రేగడి నీడల్ల పొత్తం వెలువరింత వేడుక .
నాణ్ డు :శనివారం తావు :ఉడుముల పేట.

సామలు శ్రీమతి చెన్నా కల్యాణి , మార్టూరి పద్మావతి గార్లు ఒక మామిడి మొక్క నాటి , మనవరాలు మార్టూరి సంజనా పద్మం రాసిన పుస్తకాన్ని విడుదల చేసారు. 
సంతోషంలో అబ్బా అమ్మ , 
సంజనలో సృజనశీలత ను గుర్తించి నాలుగేళ్ళ కిందటే "Creative Thinker " అని అవార్డ్ ఇచ్చి ప్రోత్సహిస్తూ ,సంజన పక్కన నిలబడ్డ బడి పంతులమ్మ ,
తెలుగు అక్షరాలని చిన్నారి సంజన చేతిలో పెట్టి, గుంభనం గా ముసి ముసి నవ్వుతూ వేదిక ముందు కూర్చున్న అయ్య వారు , స. వెం. రమేశ్ గారు.
చప్పట్లు కొడుతూ మేమందరమూ.












All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Nov 1, 2015

అమ్మో ...! ఆహా... !

జీవితం ...
చూసినంతేగా -
కనబడుతుంది!



















భయపెడుతూనో...!
సంతోషంగానో...!!!







Happy HALLOWEEN !


All rights @ writer. Title,labels, postings and related copyright reserved.


Oct 23, 2015

అర్ధమయితే ఒట్టు!

ఏమిటో ఈ ఇంగ్లీషు భాష !
తలకిందులుగా తపస్సుచేసినా ఒక్క ముక్కా తలకెక్కడంలా!
బడికి సెలవలు కందా అని నాలుగురోజులనుండీ , ఎడా పెడా చదివేస్తున్నా ...
ఊహు... అర్ధమయితే ఒట్టు! 

ఒకే ఒక్క వాక్యం కొరుకుడు పడక గిజగిజలాడుతున్నా. పైనుంచి,రేపో మాపో బడి తెరవగానే మా పిల్లలకి ఏం మొహం పెట్టుకొని పాఠాలు జెప్పేది ?

బాబ్బాబు ...ఎవరన్నా కుసింత ప్రయివేటు జెప్పి పుణ్యం కట్టుకొందురూ...!

అయ్యల్లారా , అమ్మల్లారా...
నా తెలుగు బుర్రను ముప్పతిప్పలు పెడుతోన్న
సదరు వాక్యమిదీ...

Rome wasn't built in a day !
ముందస్తు ధన్యవాదాలు !

***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Oct 22, 2015

జయం.విజయం. !


"అమ్మా, ధైర్యంగా ఉండు ! " ధైర్యం తెచ్చుకొని అన్నాను ఒక రోజు.
"ధైర్యంగానే ఉన్నా .  నేను ధైర్యంగా ఉంటేనేగా, మీరూ ధైర్యంగా ఉండేది " 
గొంతులోనుంచి ఊపిరితిత్తుల్లోనికి సాగుతోన్న గొట్టం పొడవునా... అమ్మ కంఠం  ధైర్యంగా ధ్వనించింది!

 కొండ మీదెక్కిన అమ్మ శక్తినే కాదు,
 గుండెలో ఉండాల్సిన అమ్మనూ , ఆమె అనామక జీవితాన్ని ,ఆమె అంతులేని బలాన్ని ,ఆకటివేళల అలసిన వేళల అడగని అండగా నిలిచే వైనాన్ని, అందిన దానిలోనే అన్నిటినీ అమర్చి సమర్ధంచగల ఆమె నేర్పునూ. ఆమెలో గల అపారమైన ధైర్యాన్ని ,
జ్ఞాపకం చేయదూ ఈ రోజు!

***
దసరా శుభాకాంక్షలు.
జయం.విజయం.దిగ్విజయం






All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Oct 15, 2015

గండుచీమ ....పేద్ద లడ్డూ ...!

మా పిల్లల్లో సృజనాత్మకత పొంగి పొర్లు తోందంటే నమ్మండి !
మొన్నటికి మొన్న, ఇద్దరి పిల్లల పుట్టిన రోజులూ ఒక్క రొజే వచ్చాయి.రాక రాక.
ఇక, పిల్లలంతా చేరి , రెండు రెండు బొమ్మలు గీసేసి.చక చక రంగులు నింపుతున్నారు. చెరొకటి ఇవ్వడానికి.
 గదిలో ఓ పక్కగా , నేల  మీద తన మానాన తాను  చక చక వెళుతోన్న గండుచీమను చూసింది మన శరణి .
"ఆక్కా ! నేను  ఆ చీమ బొమ్మే వేస్తా !" వెలుగుతోన్న ముఖంతో చెప్పింది. ఆ గండు చీమ వంకే చూస్తూ.
 "బొమ్మ సరే, రంగులేం వేస్తావ్?"    
ఎన్ని రంగులేస్తే అంత సంతోషం కదా పిల్లలకి నలుపు కన్నా’, అని ఆరా తీసింది అక్క.
"నల్ల రంగు."
"నల్లగా ఉంటుంది పరవాలేదా? రంగులేం ఉండవ్!" అక్క హెచ్చరించింది.
"సరే!"
అప్పటికే  పిల్లలు సీతాకోకచిలుకల నుంచి పూల తోటల దాక అనేక బొమ్మలు గీసేసారు. శరణి కూడా నీలం రంగు ,ఎర్ర రంగు తూనీగల బొమ్మలు గీసింది. 
కాసేపు ఆ గండు చీమతో పాటు నేల మీద పాకి , ఓ చిరిగిన కాగతం ముక్కమీదకు దానిని ఎక్కించుకొని , తిరిగివచ్చింది శరణి.
 " చీమని అలా పట్టుకోవచ్చా?" అక్క అడిగింది.
" చీమ బొమ్మ రాదు కదా అక్కా ?" నింపాదిగా చెప్పింది.
అక్క చీమ ఉన్న కాగితం ముక్కని జాగ్రత్తగా నేల మీద పెట్టింది.
 చక చక వెళుతోన్న చీమను చూస్తూ ,శరణి గబ గబ  ఓ పెద్ద బొమ్మ గీసింది.

"చీమ చిన్నదిగా ఉంటుంది. ఇంత పెద్ద చీమ బొమ్మేసావే ? " అక్క అడిగింది.
లడ్డూ పెద్దగా ఉంటది కదా?” శరణి ఎదురు ప్రశ్న వేసింది.
లడ్డూనా ?”
" ఈ బొమ్మ ఇస్తే , ఆదిత్య , తస్నీం లడ్డూలు ఇస్తారు కదా?"
"అవును"
"చీమకు లడ్డూ ఇష్టం కదా? "
"అయితే?"
"నేను పేద్ద చీమయిపోతా.., పేద్ద లడ్డూ తినేస్తా!"  ముక్తాయించింది శరణి"చాలా లడ్డూలు తినేస్తా!"
అదండీ విషయం !


All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Oct 11, 2015

నోరారా ...!


"శుభ్ శుభ్ బోలో" అని హిందీమిత్రులు అంటూంటే బావుందనుకొన్నా.
"శుభం కార్డు పడింది .ఇక బయలుదేరండి !" అంటే కథ ముగిసింది లెమ్మనుకొన్నా.
కానీ, "శుభోదయం" తో మొదలయ్యి "శుభ రాత్రి" గా పరిణమించి ," శుభ మధ్యాహ్నాం" గా అవతరించే సరికి ,ఎలా స్పందించాలో తెలియక కొట్టూమిట్టాడుతున్నా.
ఇక, " శుభ దినం" అని ఎక్కడ అంటారో అని జడుసుకుంటున్నా !

" మన తెలుగులో మనం ఎలా పలకరించుకొనే వాళ్ళమబ్బా !" అని అనుకుని,  మన తెలుగు తెల్లారినట్లే ఉంది ... పోనీ , మన  ముత్తవ్వాతాతలు
నోరారా ఎలా పలకరించుకొనే వారో అని ఓ ఫ్లాష్ బ్యాక్ వేసుకొందామన్నా ,ఏమీ గుర్తుకురావడం లేదు !
శుభం !

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Oct 2, 2015

జై కిసానో ... !!!

నిజమే,
మీ  పుట్టినరోజున మిమ్మల్ని తలుచుకోవడం ,
ఎప్పటిలాగానే ,
 కాస్త నిశ్శబ్దంగా....
మరి కాస్త  నిదానంగా ...
ఎలాంటి హడావుడి లేకుండా.
పెనుచీకట్లు కమ్మాక.
ఆగి ఆగి  భోరు మంటూ కురుస్తున్న వాన గోల పడలేక..
ఇప్పటి కయినా ఆలస్యం కాలేదు లెమ్మని,
"అయినా మన శాస్త్రి గారికి ఈ హడావుడులేవీ గిట్టవు "లెమ్మని ..
అదనీ ఇదనీ అనుకొని..
ఇప్పటికి తెముల్చుకొన్నా.

మరి మామూలుగా  అయితే,
"అరరే...అవును కదా .. మరిచే పోయాను."అని దాటవేయవచ్చు .

మీరు తప్పేమి పట్టబోరు.మీ అభిమానులూ పెద్దగా పట్టించుకోరు.

కానీ,  జై జవానులనీ జై కిసానులనీ ఎలా మరవగలం?  ఎలా పట్టించుకోకుండా ఉండగలం?

జవానులకన్నా పరమపదించాకయినా  పరమవీరచక్రాలు ప్రసాదింపబడతాయి.
పలకరించే దిక్కు లేని  పల్లెటూరి రైతుల కుటుంబాలకు పట్టెడు మెతుకులు పుట్టవు !

అసలు రైతులన్న మాటే అదృశ్యపదాల జాబితాలో పడేసి,
అన్నదాత అన్న పదాన్ని  చెత్తబుట్ట పాలు చేసి,

పొలాలనన్నీ హలాల దున్ని ....మహానగర  ఆకాశహర్మ్యాల నిర్మాణాలు చేసేస్తూ.....
ఆ తళ తళ లాడే  గాజు భవనాల  కలల నీడల్లో నిలబడి....
జై కిసానో ... !!!

అని  గొంతు చించుకొని అరవాలంటే ....
ఎలాగ  నాయనా ?

అందుకే, మరుపే దివ్యౌషదమనీ.. మరిచిపోయాం కానీ ...
లాల్ బహదుర్ జీ... మీ మీద ప్రత్యేకమైన కినుకేమీ లేదు మాకు !

"అ" అంటే అప్పు , "ఆ" అంటే ఆత్మహత్య .
అదీ  సంగతి తండ్రీ !
ఇక,
ఎవరికి జేజేలు చెప్పేము ? ఏమని జేజేలు చెప్పేము ?
***



All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Oct 1, 2015

తలరక్ష రక్ష!!!


శిరస్త్రాణం అంట ! 
కాసేపు తల బర బరా గోక్కుని,
 ఆంధ్ర భారతిలోని  తెలుగు నిఘంటువుల్ని చకచకా తిరగేసా!
హెల్మెట్  అంటే తెలుగులో  ఏమిటి చెప్మా అని. 
తెగ బారెడు మాటలు. 

యధాప్రకారము శిరస్త్రాణం తో పాటు,

 శిరః కవచము ,తలజీరా,ఇనుప కుళ్ళాయి , బొమిడకము, నలికాముకుటము  మొదలగునవి వరసబెట్టాయి.

గూగులమ్మేమో ... తేటగా తేల్చి పడేసింది " ఇనుప టోపీ " అని. తలకు పెట్టుకొనే కవచం అని కూడా అందండోయ్!
తలవని భారాన్ని తలకెత్తుకొన్నానే అని తల బాదుకో బోయి,తమాయించుకొని , తటాలున తలపుల్లో మునిగా.
తలపాగా, తల తొడుగు, తల భద్ర , తల రక్ష ,తలచం ....
అబ్బబ్బో ... నా తల తిరిగిపోతోంది ! 
తెలుగండీ తెలుగు ! 

***
సురేశ్ కొలిచాల గారికి ధన్యవాదాలతో.
Suresh Kolichala My entries: 
తలకాపు, తలోలిమి (ఓలము = cover, ప్రొటెక్షన్), తలజీర, తలతొడుగు, తలయుడుపు, గూడ, తలపొదుగు, తలచూడి, తలమఱుగు/వు, తలమాటు, తలమేగు


Chandra Latha Suresh Kolichala garu. ధన్యవాదాలు. 
ఈ మధ్య తరుచు పత్రికల్లో పలకరించే మరో పదం... యూనిఫాం ... సమ దుస్తులు ,ఏక రూప దుస్తులు ... అంటూ. ప్రతి పదానికి అనువాదం చేయకుండా , సరి అయిన తెలుగు పదాన్ని ఎందుకు ప్రతిపాదించలేక పోతున్నారో తెలియడం లేదు. పోని.. ఈ రెండు మ
ాటలు నలుగురి నోళ్ళల్లో నానుతున్నాయా అంటే అదీ లేదు. యూనిఫాం అంటారే కానీ ...ఆ రెండింటిలో ఏ పదమూ వాడరు. 

ఒకే పత్రికలో ఒక సారి ... "ఏక దుస్తుల పంపిణీ " అని రాస్తారు. మరోసారి , "సమ దుస్తుల కొరత" అంటారు. నా బోటీ సామాన్య పాఠకులం ఏం జేస్తాం?" యూనిఫాం అని అనకూడదా నాయనా , ఎందుకొచ్చిన గందరగోళం ?" .. అని తేల్చేస్తాం. అదన్న మాట సంగతి!

పూర్వం కూడా సైనికుల కవాతుల్లో ఒకే రకం బట్టలు, ఆయుధాలు వేసుకొనే వారు కదా .. వారేమి అనే వారో ?


***
  • Suresh Kolichala Uniform అన్న పదానికి దండువుడుపు (దండు ఉడుపు) అన్న ప్రయోగం కనిపిస్తోంది. "ఇంగ్లిషువారి దండు వుడుపును వేసుకొన్నారు"
    • Chandra Latha బావుంది.ఇప్పుడే తెలిసింది. దండు ఉడుపు .. సైన్యం దుస్తులు అనుకోండి. మరే సంధర్భం లోనూ .. ఇలా వాడ లేదా? ముఖ్యంగా, యూని ఫాం ... బిళ్ళ జవాన్ల నుంచి బడిపిల్లల దాకా ... మామూలేగా .. ఆనాటి నుంచి ఈ నాటి వరకు. 
      మీ మాట వలన , నాకు అర్ధమయింది, ఆయా వృత్తి వ్యాపకాలను, సందర్భాలను బట్టి పదాలను వాడారు , ఒకే ఒక సామాన్య పదం కన్నా అని.
    • Giridhar Duggirala మీరు చెప్పింది నిజమే... కాని నాబోటి అర్ధజ్ఞానేస్వరుడికి.. ఎదో దండు వచ్చి ఊడ్చుకు పోఇన తరువాత అన్న అర్ధంలా ఉంది..
    • Charan Raj Pasupuleti · 3 mutual friends
      దండు ఉడుపు అంటే సైనిక వస్త్రాలే అవుతుందే తప్ప యూనిఫాం ( ఏకరీతి వస్త్రాధరణ) ఎలా అవుతుంది.... 
  • నా తెలిసినంతమేర యూరోపియన్ సాంగిత్యంతోటే మనవాళ్ళకు ఏకరీతి సైనిక వస్త్రధారణ అలవర్చుకున్నారు అంతకు మునుపు వారు చిహ్నాలు, జెండాలు ధరించి పోర్లో కొట్టుకునేవారు... రాజ దుస్తులకు, సైనిక దుస్తులకు, పురోహిత దుస్తులకు, సామాజిక, అధికారిక దుస్తులకు మధ్య తేడా కలిగిన ఉండవచ్చుకాని, ఆ దుస్తులు ఒకే రంగు, కుట్టు లేవని శ్రీకృష్ణదేవరాయల మీద వచ్చిన ఓ Monographలో చదివినట్లు గుర్తు.
  • Suresh Kolichala Charan Raj: భాషలో కొత్తపదాలు సృష్టించేనప్పుడు అర్థసంకోచం (narrowing), అర్థవ్యాకోచం (widening) సహజం. ఇంగ్లీషులో అలాంటి పదాలు కోకొల్లలు. 

    నిజానికి "ఉడుపు" అన్న పదాన్నే uniform dress అన్న అర్థంలో వాడుకోవచ్చు. " వాడి ఉడువు చూచి వాడు గుర్రపురౌతని తెలుసుకొన
    ్నాను". ఉమ్మడిఉడుపు, దండుడుపు లాంటి పదాలను కూడా వాడుకోవచ్చు. మనకు తెలుగు ఆకాడమీ వంటి ఒక ప్రామాణిక సంస్థ ఇటువంటి నిర్ణయాలు చేసి పుస్తకాలు ప్రచురిస్తే అందరూ ఒకే పదజాలం వాడటం సులభమౌతుంది.
  • Nagaraju Pappu Suresh Kolichala నాకు ఏమాత్రం ప్రవేశం, పరిచయం లేని విషయం ఇది, అయినా ఉండబట్టలేక - కొన్ని ఇంగ్లీషు పదాలకి తెలుగు అనువాదాలు చూస్తే అవి వాడేవిధంగా ఉండవు. యూనిఫాం అనేది ఇంగ్లీషులో, భాషాపరంగా 'బట్టతో' ఏ సంబంధమూలేని పదం, అందుకే "సమ", ఏక" వంటీ అనువాధాలు దానికినప్పవేమో!! ఇక కొన్ని పదాలకి సింప్లిసిటీ చాలా అవసరం, మనకి రోజువారి వాడకంళో ఉన్న పదాలు కావాలి, తడుముకోకుండా ఎవరికైనా అవి తట్టాలంటే.. యూనిఫాంకే కొలువు బట్టలు అనో బడి చొక్కాలు అనో అంటే చాలదా?
  • Suresh Kolichala Nagaraju: I have always been for all for creating new words based on what is natural and idiomatic in Telugu, instead of attempting to translate English words literally, word-for-word. I hate translations like "సమ దుస్తులు", "ఏక దుస్తులు". If "బడి చొక్కాలు" is currently in usage, then, by all-means it should be encouraged and popularized by the media. 

    However, I also believe Telugu has a large set of vocabulary that has become archaic and fallen into disuse, and it would be very useful to revive and reuse it for modern needs. In that sense, "ఉడుపు" can be resuscitated to mean "uniform" in the modern sense, to refer to any uniform (work/office-uniform or school uniform or army uniform).
  • Charan Raj Pasupuleti · 3 mutual friends
    'ఉడుపు' లాంటి 'మోటు' పదాలు ఈ ఆధునిక తెలుగు ప్రపంచంలొ వ్యాప్తిని పొందుతాయని నేను భావించటం లేదు.. ఇటువంటి పదాల పునర్జీవనంతోటి తేనెలొలుకు తెలుగు అనుకునే స్థాయినుంచి తెలుగంటే నాటుపురం మోటు వ్యవహారంలా సగటు తెలుగు వినియోగకారునికి అనిపించే ప్రమాదం ఉంది.. దాంతో వారు 'యూనీఫామ్' అన్నదానితోనే కొనసాగుతారు... 'బడిచొక్కాలు' కూడా సాంస్కృతిగా దిగువతరగతికి చెందిన వారు మాత్రమే బహిరంగా ఉచ్చరించేదానికి అవకాశం ఉంది (నేడు అలాంటివారెవ్వరూ లేరు. బడి అన్న పదోచ్చరణే తగ్గిపోయింది) ...యూనీఫామ్ కు సూచించే తెలుగుపదం ఒక్క వర్గానికి కాకుండా యూనీవర్శల్ గా (సార్వజనికంగా) ఉంటేనే వ్యాప్తిలోకి తేగలమని నా అభిప్రాయము.


Chandra Latha మోటు పదాలని అనబడుతున్నవి తెలుగు పదాలనీ, హెల్మెట్ అన్న పదం ఎంత పరాయిదో శిరస్త్రాణమూ అంత పరాయిదేననీ... అచ్చమైన తెలుగు పదాలు అనేకం ఉన్నాయని ..మనం వాడుకలోకి తేవచ్చుననీ.. అనుకొంటూ ఈ చిన్ని అభిప్రాయం అచ్చేసాను. 
మన హోసూరు తెలుగు ఉద్యమ మిత్రులు " చే పలుకి (Cell Phone) " మప్పిదాలు( Thanks )" మొదలయిన అనేకానేక పదాలను సహజంగా వాడేస్తున్నారు. బడిలో యూనిఫాం ఉండకూడదని భావించే వారిలో నేనూ ఒకరిని. పిల్లలలో అసమానతల పట్ల అవగాహన కలిగేలా, చేతనాభరితమైన చదువులు చెప్పగలిగినప్పుడు, చెప్పలేని మన చేతగానితనానికి ఒకే రకం ముసుగులేయడం దేనికి?
ఇది, మాటల చర్చ కాబట్టి, ఒక గట్టి పట్టుదలతో , మన తెలుగు ని మరింతగా మన తెలుగు గా మన పిల్లలకు అందించవచ్చు. తెలుగు అక్షరాల్లో ఇంగ్లీసు పదాలను రాయడం, ఇంగ్లీషు పదాలకు ప్రతి పద అనువాదం చేయడం ,సంస్కృతం పట్ల పెరిగే మోజే కానీ తరగని వ్యామోహం , తెలుగంటే ఎన్ని సంకృత పదాల సక్లిష్ట సమాసబూయిష్టమయితే అంత గొప్ప తెలుగన్న భావన లాంటి కొన్ని ... మన తెలుగు జాతి సహజలక్షణాలను సంస్కరించుకొంటే.... ఎంతో సరదాగా సంతోషంగా చేయవచ్చును. మిగిలిన భాషాసంబంధ విషయాలు... భాష పై పలువిధాలుగా కృషి చేస్తున్న విజ్ఞులు Suresh Kolichala garu , Nagaraju Pappu garu చెప్ప గలరు !


All rights @ writer. Title,labels, postings and related copyright reserved.