ఎంతెంత? తానెంత?
rights @ writer. Title,labels, postings and related copyright reserved.
ఈ విశాల ధరిత్రి ముందు మనిషెంత?

అయినా, కొలతలు వేస్తాం. కొరతన పడతాం. కలతలు పడతాం.కలవరపెడతాం.
కక్షలు కార్పణ్యాలు, యుద్దాలు,వ్యాజ్యాలు …అంతా ఆ సూది మొన మోపే భూమి కోసమే గా.
కరువులు కాటకాలు , వానలు వరదలూ…ఎన్నెన్ని చూసిందో ఈ భూమి తల్లి !
పంటలూ పబ్బాలు…చావులూ పుట్టుకలూ… ఆయమ్మ ఎరుగని వైనాలా వైభోగాలా ?
కరువులు కాటకాలు , వానలు వరదలూ…ఎన్నెన్ని చూసిందో ఈ భూమి తల్లి !
పంటలూ పబ్బాలు…చావులూ పుట్టుకలూ… ఆయమ్మ ఎరుగని వైనాలా వైభోగాలా ?
తన వేలాది ఏళ్ళగమనంలో.
***
నలువైపులా పరుచుకొన్న నడిగడ్డ నల్లరేగడి !
నివ్వెరపోతూ నిలబడి పోయిన నేను!
నలువైపులా పరుచుకొన్న నడిగడ్డ నల్లరేగడి !
నివ్వెరపోతూ నిలబడి పోయిన నేను!

***
నా మట్టుకు నాకు, స్పూర్తీ మూర్తీ ఈ నడిగడ్డ నల్లరేగడి !

rights @ writer. Title,labels, postings and related copyright reserved.
No comments:
Post a Comment