Sri Kotapati Murahari Rao garu, |
కొందరిని చూసి ఎలా జీవించాలో నేర్చుకోవాలి.
మరికొందరిని చూసి ఎలా జీవించకూడదో!
మంచికీ చెడుకి నడుమ ఉండే ఆ పారదర్శక పరిధిని ,
పరిమితులను అర్ధం చేసుకోవడంలోనే జీవితం ఆవిష్కరించబడుతుంది కదా...?
ఆ పరిమితులను అధిగమించే ప్రయత్నమే ,
ఆ ప్రమేయాలను ఎదురొడ్డి నిలబడే పోరాటమే కదా...
జీవితం.
మంచి ని పెంచుకోమన్నారు ,
చిన్న చిన్న సంతోషాలతో జీవన వైవిధ్యాన్ని ఆనందించడం ఎలానో జీవించి చూపారు.
అందరిలోనూ ఎంతో కొంత మంచి ఉంటుంది. దానిని పచ్చ బరిచేందుకు ప్రయత్నించ మన్నారు.
ఆ ప్రయత్నాలలోనే , ఆ ప్రయాసలలోనే ,
Rishi Valley School, Dr.KumaraSwamy, Dr.Radhika Hegberger , Raghuveeraa Reddy garu, Kotapati Murahari Rao garu and me. |
కొద్దో గొప్పో చెడును కూదా
భరాయించేస్తూ,
చీకటిని అంగీకరించేస్తూ,
కాపట్యాన్ని క్షమించేస్తూ ...
మిరుమిట్లు గొలిపే వెలుగు సత్యాలకు గుడ్డి వాళ్ళయినట్లయ్యింది.
స్థితిగతులేమిటో తెలుసుకొని మెసలమన్నారు.
ఇవాళ్టి స్థితేమిటి ? ఎటు వైపు గమనగతి సాగుతోంది? తెలివిడి తో మెలగమన్నారు.
చిన్న గీత ముందు పెద్దగీత ... చిన్నకష్టాల ముందు పెద్ద కష్టాలు.!
అయ్యో తండ్రీ,!
కష్టాలకు సుఖాలకు చిన్నాపెద్దలుంటాయా?
అయ్యో నాన్నా !
తప్పొప్పులకు తగ్గొగ్గులు ఉంటాయా ?
జీవితం పట్ల
బోలెడంత నమ్మకంతో...
నిలదొక్కుకొని నిలబడేందుకు...
తిన్ననైన తోవలో సాగేందుకు..
ప్రయత్నం చేస్తూనే ఉంటాము.
మీ స్పూర్తి .... మీ మూర్తిమత్వమూ
మా తోడురాగా.
సజల నయనాలతో...
సజీవ జ్ఞాపకాలతో !
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
KOTAPATI Sir Amar Rahe
ReplyDeleteKOTAPATI Sir Amar Rahe
ReplyDelete
ReplyDeleteఅమ్మాయీ! చాలా బావుంది. మీకు అభినందనలు..