ఇవ్వాళ మా బుజ్జి పిల్లలకు సూర్యుడి పాఠం చెప్పబూనాను.
పక్షి లాగా ఎగెరెళ్ళి పెట్రోల్ పోసేసి తిరిగొస్తామని. హృతికేశ్ అన్నాడు.
మా కోసమేనా అన్నట్లు ,
పొద్దుటే Young World ముఖ చిత్రం.
భూమి నుంచి మంగళ గ్రహానికి పంపిన ఉపగ్రహ చిత్రం .
దాని తోక వైపు నుంచి!
మామూలుగా మాట్లాడుకొంటూ ,
పాఠాలాడుకొంటాం కదా…మామూలుగా మాట్లాడుకొంటూ ,
అలాగే అడిగాను
” మొన్న మన వూరి నుంచి పంపిన రాకెట్టు
అకాశంలో పై పైకి
పోతూ పోతూ ఉంది కదా ,
" మరి మన కార్లో స్కూటర్లో పెట్రోల్ పోసుకొంటాం కదా అప్పుడప్పుడు ,
ఇప్పుడా రాకెట్టులో పెట్రోల్ ఎవరు పోస్తారు ?"అని.
ఇక, మా చిట్టిబుర్రలు చకచకలాడి గబగబ చెప్పారు.
తలకొక సమాధానం వచ్చేసింది.
ముందే బోలెడంత పెట్రోల్ పోసేసి పంపామని , కనిష్క అంటే,
మేఘాల మీద నిల్చుని
పెట్రోల్ పోస్తానని అక్షర అంది.
Mangalyaan , Akshara ( 3yrs Old) |
పక్షి లాగా ఎగెరెళ్ళి పెట్రోల్ పోసేసి తిరిగొస్తామని. హృతికేశ్ అన్నాడు.
ఇంకో రాకెట్లో ఎగెరెళ్ళి కుసింత పెట్రోల్ వంపేసి వస్తామని , ఆదిత్య అంటే..
వాన నీళ్ళు పోసినట్టుగా ఆకాశంలో పెట్రోలు వానలు పడుతాయని, గుణ అన్నాడు.
ఒక పైప్ పెట్టి పంపామని… ఆకాశంలో అక్కడక్కడ పెట్రోల్ షాపులు ఉంటాయని.డబ్బులిచ్చేస్తే
ఒక పైప్ పెట్టి పంపామని… ఆకాశంలో అక్కడక్కడ పెట్రోల్ షాపులు ఉంటాయని.డబ్బులిచ్చేస్తే
ఆ పైప్ లో పెట్రోల్ పోస్తారని. అన్విత అంది.
ఇలా తలా ఒక మాట.
భలేగా చెప్పారు.
నేనన్నాను కదా.
అవేవి కావు. సూర్యుడు పోస్తాడన్నాను!
ఏముందీ ..
అప్పుడు నేనా ఉపగ్రహం బొమ్మను , దాని తోక మీద ఉన్న అద్దాల పలకలను చూపించాను.
అవి సూర్యఫలకాలు (" సోలార్ ప్యానెల్స్ " )
అప్పటికే , మా పిల్లలకు సూర్యుడి శక్తి (energy) కాంతి ( light) ..
ఇలాంటి పదాల పరిచయం అయిపోయింది.
ఇలాంటి పదాల పరిచయం అయిపోయింది.
ఇక ఇప్పుడు వాళ్ళకి ఒక విషయం అర్ధమై పోయింది .
ఆఖరికి మనం పంపిన ఉపగ్రహానికి కూడా శక్తి నిచ్చేది సూర్యుడే... అని.
వినదగునెవ్వరు చెప్పిన ...విని ఊరుకోవడానికి వాళ్ళేమీ "నిశ్శబ్దం!" చట్రంలో పెరుగుతూ ఉండే అలాంటి ఇలాంటి పిల్లలు కారు కదా!
అక్షర చటుక్కున అడిగింది.
“” అందరికీ ఎనెర్జీ సన్ను కదా ఇస్తాడు. మరి మూన్ ఎందుకు సన్ను రాగానే వెళ్ళి నిద్దర పోతాడు ? మూను కి ఎనెర్జీ ఎవ్వరిస్తారు? మూను కి ఎనెర్జీ లేక పోతే స్ట్రాంగ్ గా అవ్వడు కదా? నేను కూడా పొద్దున్నే సన్ను రాగానే నిద్దర లేస్తా. మూనుకి ఎనెర్జీ ఎట్లా? చిన్నగానే అయిపోతాడా ? పెద్దగా అయిపోడా ? "
***
ఇక, ప్రశ్నలు కొనసాగుతూనే పోయాయి.
ఊపిరాడకుండా.
సమాధానం కోసం ఆగకుండా.
జవాబులు ఏమైనా ఉన్నాయా ?
***
కార్తీక పౌర్ణమి అందాలను ఆనందించేప్పుడు ..
మా బడి పిల్లలకు జవాబులేమైనా దొరుకుతాయేమో చూడండి మరి !
***
All rights @ writer.
Title,labels, postings and related copyright reserved.కార్తీక పౌర్ణమి అందాలను ఆనందించేప్పుడు ..
మా బడి పిల్లలకు జవాబులేమైనా దొరుకుతాయేమో చూడండి మరి !
***
No comments:
Post a Comment