Apr 24, 2010

ఉచితము మరియు నిర్బంధమూ !






రైట్ టు  ఫ్రీ అండ్ కంపల్సరి ఎడ్యుకేషన్  యాక్ట్  , ఈ నెల ఒకటో తేదీన అమలులోకి వచ్చింది. ఈ నేపధ్యంలో , రిషీ వ్యాలీ ప్రిన్సిపాల్ డా.కుమార స్వామి గారు,  డైరెక్టర్ ,టీచర్ ఎడ్యుకేషన్ ,రిషీ వ్యాలీ, శ్రీ  అలోక్ మాథుర్, గారు , ఈ చట్టాన్ని ప్రయివేటు పాఠశాలలూ ఎలా స్వీకరిస్తాయన్న అంశంపై కొన్ని ముఖ్యమైన విషయాలను ఇక్కడ విశ్లేషించారు. చదవగలరు.http://beta.thehindu.com/education/article309771.ece RTE Act: Private schools as catalysts? A. KUMARASWAMY,ALOK MATHUR

 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

1 comment:

  1. చాలా ముఖ్యమైన అంశాన్ని చర్చకి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు.
    ఉచిత నిర్బంధ విద్య అన్న ఆశయం తప్పకుండా హర్షించదగ్గదే. అందులో సందేహం లేదు. అభివృద్ధి చెందిన దేశం యొక్క లక్షణాల్లో అదొకటి. అభివృద్ధి చెందిన దేశాల దాకా ఎందుకు? మనకి ఇరుగు పొరుగున ఉన్న చిన్న దేశాలైన శ్రీలంక, వియట్నామ్ లాంటి దేశాలలో కూడా అక్షరాస్యత 90% పైగా ఉంటే, మన దేశం – న్యూక్లియర్ సబ్మెరిన్లు, క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్లు నిర్మించగల మన దేశంలో – చదువు 66% అక్షరాస్యతతో కుంటినడక నడవడం బాధాకరం. దీన్ని అత్యవసర పరిస్థితిగా తీసుకుని 66% ని వీలైనంత త్వరగా 90% వద్దకి తీసుకుపోవడానికి వలసిన ప్రయత్నాలన్నీ చెయ్యాలి. ఆ లక్ష్యం కోసం ఈ ఆర్.టి.ఇ. చట్టం తోడ్పడితే మంచిదే.

    కాని పైన మీరు పేర్కున్న వ్యాసాన్ని రాసిన కుమారస్వామిగారు వెలిబుచ్చిన భయాలు చాలా సమంజసమైన భయాలు. ఉచితంగా పేద పిల్లలని చేర్చుకుని చదువు చెప్పమంటే మన కార్పరేట్ స్కూళ్లు ఊరుకుంటాయా. ర్యాంక్ హోల్డర్ లని తప్ప తక్కిన పిల్లలని అసలు మనుషులుగా చూడని విద్యాసంస్థల యాజమాన్యం ఈ విషయంలో ప్రభుత్వంతో సహకరిస్తుందా? సహకరించని పక్షంలో ప్రభుత్వం మెడ వంచి వాటి చేత పని చెయ్యించుకోగలదా? ఇవన్నీ జరిగే పనిలా కనిపించడం లేదు.

    కొంచెం వాస్తవికంగా చూస్తే అట్టడుగు వర్గాలకి విద్యాసేవలు అందాలంటే homeschooling ఒక చక్కని మార్గం అనిపిస్తోంది. అమెరికన్ విద్యావేత్త జాన్ హోల్ట్ తదితరులు దీన్ని బాగా ప్రచారం చేశారు. తదనంతరం అదొక ఉద్యమంలా ప్రపంచం అంతా విస్తరించింది. ఇందులో తల్లిదండ్రులే తమ పిల్లలకి ఇంటి పట్టున చదువు చెప్పుకుంటారు. దానికి కవలసిన material అంతా దొరుకుతుంది. ఈ ప్రయత్నంలో ఓ homeschooling సంస్థ ఆ తల్లిదండ్రులకి అండదండగా ఉంటుంది. ఈ రోజుల్లో స్కూళ్ల తలబిరుసు ప్రవర్తన చూసి విసిగిపోయిన కొందరు తల్లిదండ్రులు (బాగా చదువుకున్న వారు, ఆర్థికంగా కూడా ఉన్నత స్థాయిలో ఉన్న వారు కూడా) తమ పిల్లలని స్కూళ్లకి పంపకుండా ఇంటి పట్టునే ఈ ’గృహ విద్య’ పద్ధతిలో చదువు చెప్పుకుంటున్నారు.

    ఈ గృహవిద్య పద్ధతికి ప్రభుత్వ సహకారం ఉంటే, దాన్ని అట్టడుగు వర్గాల విద్యా అవసరాలని సాధించగల చక్కని వ్యవస్థగా తీర్చిదిద్దడానికి వీలవుతుందని అనిపిస్తోంది. ఈ విషయాన్ని మరింత వివరంగా (మరి కొన్ని వివరాలు సేకరించి) ఒక వ్యాసంగా రాయడానికి ప్రయత్నిస్తాను.

    ReplyDelete