సాహిత్యంలో పరీక్షంటే ,
భలే ఉంటుంది.
ఏదో ప్రశ్నలూ జవాబులూ రాస్తున్నట్లుగా తోచదు.వీటిని దిద్ది మార్కులు వేస్తారనీ అనిపించదు.
ఎవరికో ఏకబిగిన ఉపన్యాసం దంచేస్తున్నట్లు, ఎవరితోనో వాదోపవాదాలకు దిగినట్లు, తీరికగా తోచిన ఓ కథనో నవలనో నెమరు వేసుకున్నట్లు..అనిపిస్తుంది.
మొదలు పెట్టామా ,మళ్ళీ ఇన్విజిలేటర్ వచ్చి..దారం ముడేయ్యండి ..అని హెచ్చరించే వరకు, హాయిగా .. ఓ అక్షరవిహారం చేసేసి రావచ్చు.
ఫలానా ప్రముఖ రచయిత ఎత్తిన కలం దించ కుండా దంచేస్తాడు అని అంటూ ఉంటారే , అదేమో కానీ, ఓ మోస్తారుగా అచ్చం అలాగే, ఎత్తిన కలం దించకుండా, వొంచిన తల ఎత్తకుండా ..ఇచ్చిన కాగితాలు నలుపు చేసి...దారం ముడేసి.. నిలువుగా మడతేసి..అయ్యవారికి అప్పజెప్పేసి..గాలిలో తేలుతూ ..పరీక్ష గదిలోంచి బయటకు కులాసాగా రావచ్చు.కాదు మరీ.
ఈ సౌకర్యం .. మాబోటి సాహిత్యవిద్యార్థులకే సుమండీ..అంటే మీకు అసూయ కలుగుతుందేమో.
అప్పుడప్పుడు.. రచయిత జీవిత చరిత్ర గట్రాలు , తారీఖులు దస్తావేజులు ..లాంటి బూజుదులిపే కార్యక్రమం ,
ఫలానా పెద్ద మనిషి అలా అన్నాడు అని అక్షరం పొల్లు పోకుండా రాయగలగడం ..లాంటి కష్టాలు మాకూ ఉంటాయ్. మేం చెప్పుకోను నామోషి పడతాం కానీ!
తప్పించి మిగిలినదంతా... మన సొంత కథ రాసుకున్నంత సుఖం గా రాసుకోవచ్చంటే నమ్మండి.
ఏ పత్రిక్కో , ఓహో .. బ్రహ్మాండం! ఆహా... పరమచెత్త! అంటూ ఎడతెగని ఉత్తరాలు రాసే వారిలా రాసేసి, ఊపిరి పీల్చుకోవచ్చు కూడాను. మనలను ఎవరాపుతారు గనుక!
పాపం దిద్దేవారు.ప్చ్!
దాదాపు పద్దెనిమిదేళ్ళవుతుంది.
నా ఆఖరు పరీక్ష రాసి.
రాయడం వరకూ మన ధర్మం.ఆ పై , దిద్దేవారి ఖర్మం ..సారీ,దయాధర్మం ..
ఏ మూలో .నా పరీక్షాపత్రం దిద్దే వారి కాస్త కష్టాలకు దిగులు పడుతూ..అనుకున్నామో అప్పుడు ..నాకు సరిగ్గా గుర్తు లేదు.వారు మంచి వారు కనుక , నా అక్షరాలను శ్రద్దగా చదివి , బోలెడన్ని మార్కులు ఇచ్చారు. నేను బుద్ధిగా బీరువాలో దాచి పెట్టుకున్నా.
అవన్నీ , అప్పటి సంగతులు.
ఈ నడుమ ,మళ్ళీ పరీక్ష రాయాల్సి వచ్చింది.
అదీ ,సాహిత్యం లోనే.
*
ఆ విశేషాలు మళ్ళీ చెపుతా.అంత వరకు విరామం.
All rights @ writer. *
ఉండనా మరి?
Title,labels, postings and related copyright reserved.
All the best..
ReplyDeleteమురళి గారు, థ్యాంక్సండీ.
ReplyDeleteపరీక్ష పూర్తయ్యింది. ఆ వివరాలు పంచుకోవడానికే,విరామం.
చంద్రా ,
ReplyDeleteఏది రాసిన అలవోకగా ,ఆహ్లాదకరంగా రాయగల రచయిత్రి మీరు!మీ పేపర్లు దిద్దేవారికి అదో సాహితీ వన విహారమే.సురభిళ సుమ సౌరభాల మధ్య సరదాగా షికారుకి వెళ్తూంటే వద్దనుకున్నా 'వహ్వా' అనకుండా ఎవరుండ గలరు?
నాగలక్ష్మి
అహ్హ..హ్హ.. లేదండీ బాబు.
ReplyDeleteఈ సారి పరీక్ష ఒకటే .కానీ ..అదొక ఎపిసోడ్ :-))
పాపం మా మాష్టారు !