Apr 19, 2010

అమ్మానాన్నలుగా

ఒక్కోసారి అనిపిస్తుంది.
ఎవరు ఎక్కువ ప్రమాదకరం అని?
క్రూరాతిక్రూరమైన నేరాలు ఘోరాలూ ,ఒక్క బొట్టు రక్తం చిందకుండా , ఎంత సునాయాసంగా విచ్చలవిడిగా జరగవచ్చుననీ.

ఒకావిడ ఒకాయన  ఉన్నారు.
వారి చిన్నపిల్లలతో పని చేసుకోలేక , మరో చిన్నపిల్లను పనిలో  కుదుర్చుకున్నారు.
అదేంటని మన లాంటి వాళ్ళం అప్పుడప్పుడు నోరు  చేసుకొంటాం .మరింత సున్నితమైన వాళ్ళమైతే,అయ్యో పాపం అనుకుంటామేమో. కాస్త గట్టి వాళ్ళమైతే , అన్యాయాన్ని తప్పించడానికి గల న్యాయసంబంధ అవకాశాలను అన్వేషిస్తావేమో. బడి లోనో చేరుస్తావేమో.
సరే, అదలా ఉంచుదాం.
ఒకావిడ గారిని పలకరించి చూద్దాం.
"పనిలో కుదుర్చుకున్నాం అన్న మాటే కాని, ఒక్క చోట కుదురుగా పిల్ల ఉండదు. ఫ్రిజ్ లో నీళ్ళు తాగేస్తుంది. పిల్లలకు ఇచ్చిన చాక్లెట్ తినేస్తుంది.టివి చూస్తూ కూర్చుంటుంది.మొన్న కొన్న కొత్త రిబ్బను కనబడడం లేదు. ఇదే తీసుకొని ఉంటుంది. మీకు తెలియదు , మీరలాగే మాట్లాడతారు.మేమెంత బాగా చూసుకుంటున్నామో తెలుసా? మొన్నటికి మొన్నా మిగిలిన పిజ్జా అంతా అమ్మాయికే పెట్టాం. మాట కొస్తే కోక్ కూడా ఇదే తాగేసి ఉంటుంది.నిన్నటికి  నిన్న ,మేం సినిమాకి వెళ్ళోచ్చే సరికి, ఉయ్యాల్లో కూర్చుని ఊగుతుంది. ఎంత ధైర్యం ! "
మరో మాట.
“నీడ పట్టున కూర్చుని కడుపులో చల్ల కదల కుండా పని చేసుకుంటుంది.కోరినంత  తిండి దొరుకుతుంది.
లేకపోతే ,ఎండనబడి మాడుతూ చేల గట్ల మీద కలుపుతీస్తూ బతకాల్సిందేగా?”

సరేనండీ, ఒక క్షణం.
ఇలాంటివి లేదా ఇలాంటివో ..మాటలు తెగ వినబడుతుంటాయ్ ..మన చుట్టూ. కాకపోతే, మన మనసుల్లో నిజంగానే , పేరేంటల్ సెన్సిటివిటీ ఉన్నదా .. ఉంటే అది మన స్వంత పిల్లలకు తప్ప వేరొకరికి పంచలేమా..పంచితే మన  శక్తీ,సమయం వృధా అయిపోతాయా..అయిపోతే మనకేదైనా నష్టం జరుగుతుందా.. అహా...అసలిన్ని ఆలోచించి స్పందించాలా?
అదండీ విషయం,
 సహజంగా మనం జంతువులమే కదా ,ఒక సివంగి లా పిల్లలను కాపాడుకోగలం.
కాగా,ఈ మానవస్పందనలన్నీ ,మనం నేర్చుకున్నవే. అంచేతేనేమో, మాటిమాటికీ , ఎవరో ఒకరు గుర్తు చేయాలి.మరెవరో కన్నెర్ర చేయాలి. ఇంకెవరో కొరడా ఝుళిపించాలి .మాటిమాటికీ గుర్తు చేయాలి, ఇది మానవత్వం కాదు సుమీ అని.
 ఎంచేతంటే, ఒకావిడగారు, వారి ఒకాయన గారు ఒక చిన్నపని చేసారు. అమ్మాయి నాన్న కడచూపులకు బిడ్డను పంపమని ప్రాధేయ పడితే,పంపలేదు. వాళ్ళ కె.జి. పిల్లలకు నెల పరీక్షలటమన బడుల్లో నిత్య పరీక్షలు ఉంటాయి కదా ,అని చొప్పదంటు ప్రశ్నలేయ బోయేరు!
తీరా అమ్మాయి ,ఇంటికి వెళితే ఏముందీపోయిన తండ్రి తిరిగి వస్తాడా? వాళ్ళమ్మ  మళ్ళీ పనిలోకి పంపింది.      అమ్మాయి బుద్దిగా తిరిగి వచ్చింది.ఆపై రావాల్సిన ఫోన్లూ లేవూ ఇక చీటికి మాటికి ఊరికి పంపాల్సిన బాదరబందీలు లేవు! హమ్మయ్య !  ఒకాయనా ఒకావిడా తెరిపిన బడ్డారు!
నిజమే, మనలో ఎంతమందిమి మనుషులం ? ఎంతమందిమి అమ్మగా నాన్నగా ఎదగగలుగుతున్నాం ? మనలోని మానవప్రవృత్తిని నిలుపుకోగలుగుతున్నాం ?
ష్ !
All rights @ writer.
Title,labels, postings and related copyright reserved.

8 comments:

 1. parayi biddala maata atunchandi.
  mana biddalaku manam nerpistunnademiti. ivaala vayusu pai badda tallitandrulni 'enta baaga' chusukuntunnam.
  daanni chusi mana pillalu alage perugutaaru.

  ika manavatvama, manaku panikoste manavatvam, mana rojuvari jeevitaniki addu ranantavaraku manavatvam. ledante manamu 'okayana okaavida' lage svarthaparulam kaada.

  tappadu, ee bandi ila nadavalsinde.

  ReplyDelete
 2. చాలా బావుంది....అమ్మ నాన్నలుగానే కాదండీ, అసలు మనం మనుషులుగా ప్రవర్తిస్తున్నమా, మానవత అనేది మనలో ఉందా అని అలోచించుకోవాలి. మీ విశ్లేషణ బావుంది.

  ReplyDelete
 3. డియర్ ప్రదీప్ ,
  చాన్నాళ్ళకు మీ అక్షరాలు.
  నిజమే. మీరు "నిజానికి" దగ్గరగా జీవిస్తున్నవారు.పిల్లలను బడికి తీసుకురావడం ,ఉప్మాబడి కాదిది అంతకు మించి ఉన్నదేదో ..అని ఒప్పించి ,బుద్దిఒద్దికా నేర్పుతున్నవారు.
  అందుకే మీరన్నట్లుగా ..ఈ బండి ఇలా నడవవలసిందే ..ఆ బండికి అప్పుడప్పుడు కందెన వేయవలసిందే !
  కాకపోతే ఆ ప్రయత్నాల్లో ,అప్పుడుప్పుడు ..ఎప్పుడైనా..కమ్ముకుంటూ వస్తోన్న నిరాశానిస్పృహలను వదిలించుకోవసిందే! కదా?
  శుభాకాంక్షలతో,
  అక్క

  ReplyDelete
 4. సౌమ్య గారు, ధన్యవాదాలండీ

  ReplyDelete
 5. నేను తరచుగా ఆలోచించే విషయాలేనండీ.. "నీడ పట్టున పని" నేను చాలామంది నుంచి విన్నాను, వాదించాను... ప్రదీప్ గారు చెప్పినట్టు బండి ఇలా నడవాల్సిందేనేమో..

  ReplyDelete
 6. మీరు రాసింది నిజమేనండి . సహాయానికి పనిపిల్ల కావాలంటే , పదేళ్ళ అమ్మాయిని తీసుకొచ్చాడు ఒకాయన . మా మనవరాలు కంటే చిన్నది , వద్దు బాబూ , నాకు పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయి కావాలి అంటే , మీకెందుకమ్మా పని బాగా చెస్తుంది , మీ ఇళ్ళలో ఐతే నీడపట్టున వుంటారు , తిండి , బట్ట దొరుకుతాయి అని తెగ బతిమి లాడాడు ఆ అమ్మాయి తండ్రి . వద్దని పంపే సరికి తల ప్రాణం తోక కొచ్చినంత పనైంది . మరి వాళ్ళూ అలాగే పంపుతున్నారు . లేమి ఏం చేస్తారు మరి ?
  ఐనా మీరు చెప్పేది బాగుందండి , ఎవరి పిల్లలను వారు చూసుకోలేకనే కదా పని వాళ్ళను పెట్టుకునేది . ఇంకా పనిల్లకు కూడా సేవ చేయాలా ?? D :)))

  ReplyDelete
 7. మీరు రాసింది నిజమేనండి . సహాయానికి పనిపిల్ల కావాలంటే , పదేళ్ళ అమ్మాయిని తీసుకొచ్చాడు ఒకాయన . మా మనవరాలు కంటే చిన్నది , వద్దు బాబూ , నాకు పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయి కావాలి అంటే , మీకెందుకమ్మా పని బాగా చెస్తుంది , మీ ఇళ్ళలో ఐతే నీడపట్టున వుంటారు , తిండి , బట్ట దొరుకుతాయి అని తెగ బతిమి లాడాడు ఆ అమ్మాయి తండ్రి . వద్దని పంపే సరికి తల ప్రాణం తోక కొచ్చినంత పనైంది . మరి వాళ్ళూ అలాగే పంపుతున్నారు . లేమి ఏం చేస్తారు మరి ?
  ఐనా మీరు చెప్పేది బాగుందండి , ఎవరి పిల్లలను వారు చూసుకోలేకనే కదా పని వాళ్ళను పెట్టుకునేది . ఇంకా పనిల్లకు కూడా సేవ చేయాలా ??

  ReplyDelete
 8. Dear Chandra latha garu,
  . Well written, I am reminded of a poem by the famous Malayali poet and Saraswati Samman winner Balamani Amma, She writes very feelingly about the distance between her child maid and herself, the mistress of the house, Sh. K.M. panikkar had translated the poem into English and I translated it into Telugu from English. My translation appeared about 4 months ago in MISIMI in the write up on Balamani Amma.. If you have the back numbers of MISIMI you can see it,
  I tried to put my comment in the space provided for it. But sopme how I could not do it. Please put it there.
  With best wishes,
  Dr.J.L.Reddy
  New Delhi

  ReplyDelete