అయ్యల్లారా.. అమ్మల్లారా..
మీరీ గాథను విన్నారా?
వినండి వినండి.
సారీ..చదవండి.చదవండి.
"మా నాన్న ఎవరో తెలవాలి! మా నాన్నను చంపిన వాడిపై ప్రతీకారం తీర్చుకోవాలి! వారి కుటుంబాన్ని నాశనం చేయాలి!నా మనసు పగతో రగిలి పోతొంది!"
ఇదేదో సీమ బ్రాండు సినిమా స్క్రిప్ట్ లోని క్లిప్పింగ్ కాదండోయ్...!
అక్షరం అక్షరంలో కక్షను ..కనులలో కనుబొమలలో క్రౌర్యాన్ని కార్పణ్యాన్ని ..హావభావాల్లో ద్వేషాన్ని వెళ్ళగక్కుతోన్న ఓ అయిదారేళ్ళ పిల్లవాడి నోటి మాటలు.
రాసిన వారు రాసిరి పో
తీసిన వారు ఏల తీయవలె?
తీసిన వారు తీసిరి పో
చూసిన వారు ఏల చూడవలె?
-అని అడగ దలుచుకోలేదు కానీ,
ఇలాంటి ఘోరాతిఘోరమైన సంభాషణలను శ్మశానాలలో శవాల మధ్య పలికించే సంఘటనలనూ..
ఏర్చి కూర్చి వండి వారిస్తున్న సీరియళ్ళతయారీదార్లు..ఒక్క చిన్న విషయం ఎంత అనువుగా మర్చి పోతారో నాకైతే అర్ధం కాదు.కానే కాదు.
తీసిన వాళ్ళు..రాసిన వాళ్ళు..చూసిన వాళ్ళు..అందరూ పిల్లలు గలవాళ్ళే కదా?
చూసిన పిల్లలు చూసి చెడితే ..అవి చేసిన పిల్లలు..???
ఆ మాటల ఆ వికృతచేష్టల ప్రభావం ఎలా ఉండబోతోంది?
హతోస్మి!
పిల్లలకు అసలే దశరా సెలవలు .
అమ్మలకూ నాన్నలకూ ఇలాంటి ప్రశ్నలూ ఆలోచించే తీరికేదీ?
కదండీ???
చి..ల..సౌ..పిల్లల్లారా..!
పిల్లలను కన్న తల్లుల్లారా తండ్రుల్లారా..!
జర భద్రం!
ఏ సీరియల్ ఏ మోతాదులో విషం గుమ్మరిస్తుందో..!
మీ దశరా సెలవలు సంతోషంగా గడవాలని కోరుకొంటూ ..
సెలవు.
nijamenandi alanti serials chudali antene bhayam vestondi..chinnapillalaku alanti roles ivvatamemito ardham kavatam ledu...
ReplyDeletegud one..serials annintini ban chesthe pida potunde ee bhada undadu
ReplyDelete