Sep 9, 2009

మూడు తొమ్మిదుల

ఎన్నైనా చెప్పండి .
తొమ్మిదో ఎక్కం తొమ్మిదో ఎక్కమే. ఒక్క కంఠాన బట్టీ పట్టేసామా ..ఇక అంతే. వేసంకాలం పడిశంలా ఆట్టే వదలదు ! ఎక్కువ తక్కువ కానీయనీయకుండా... రెణ్ణాళ్ళు గా తొమ్మిదిని తెగ కలవరించేస్తున్నారు..గడ గడ గుక్క తిప్పుకోకుండా చెప్పిన మాటే తిరగలిలో పొసిన మినుముల్లా చెప్పిన మాటే చెపుతూ ..గున గున గునుస్తున్న ఎఫ్ ఎం ఆర్జేలకు ధీటుగా... మేమొక అడుగు ముందుంటామంటూ.. తెగ సంబరాన్ని గుమ్మరించేసాయి. నవధాన్యాలు, నవగ్రహాలు, నవమాసాలు,నవరసాలు, నవ అవీ నవ ఇవీ..
భలే.భలే...! నాలుగునాళ్ళూ నాలుగు నోళ్ళూ... నవ నవ లాడి పోలేదూ...? బావుంది. నవరంగ్ లో సినిమా ,నవోదయ నుంచి పుస్తకం, నవలాకుతోటలో శికారు..నవ నాగరికుల నడవడి....బావుంది.బావుంది. మరీ నవ్వులాటయి పోయింది..కానీ.. ఆ నవ కు ఈ నవ కు ఉన్నదల్లా ఒకటే తేడా.. ..కొత్తదనం ! నవ్యత్వం!! నవీనత్వం!!!

All rights @ writer.Title,labels, postings and related copyright reserved.

5 comments:

  1. నవ పిండాకూళ్ళూ .. :)
    బాగుంది నవ ప్రహసనం

    ReplyDelete
  2. కొత్తపాళీ గారు ..ధన్యవాదాలు.
    ఏ మాటకా మాట చెప్పుకోవాలి..మా పురుడు మాలక్ష్మి గారి..అదేనండి.. మా వీధిలో ఉంటారే.. వారి... స్త్రీ కానుపుల గర్భాశయ నిపుణుల ఆసుపత్రి ..నవ నవ లాడి పోయింది... ఈ మూడు తొందుల పుణ్యాన..:-)

    ReplyDelete
  3. Interesting .. You mean ppl wanted to have kids delivered on that day? hmm.. I wonder if people are trying to have c-section deliveries performed according to astrological predictions these days!

    ReplyDelete
  4. అంతే కదండీ..!
    ఇది మామూలే కదండీ..!!
    మరేనండీ..!!!
    అత్యవసర పరిస్థితులను అటుంచి ( చాల సంధర్భాలలో..అప్పుడు కూడా ).. సాధారణంగా ...C- section ముందు అడుగుతారు ..ఎప్పుడు చేయాలని.
    ముఖ్యంగా, మంగళ వారాలలో అడ్మిషన్లు ఇష్టపడరు.శుక్రవారాలలో డబ్బులు కట్టరు..:-))

    ReplyDelete
  5. గ్రహాల ప్రకారమే ఎవరైనా సీ-సెక్షన్ చేయించుకునేది ఈనాళ్ళలో.
    దీనిఁబట్టి మనకేమి అర్థమవుతుందంటే, రాబోయే తరాల జాతకం మహా గొప్పగా వుంటుంది. అంటే ప్రపంచానికి మంచి రోజులు రాబోతున్నాయి.

    అన్నట్టు ఈ మూఁడు తొమ్మిదులకు మన జాతకాల ప్రకారం ప్రాముఖ్యతేం లేదు మఱి. అది పాశ్చాత్యుల లెక్కింపుగదా.

    ReplyDelete