Jul 9, 2009

ములుకు

ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. మాటిమాటికీ మార్కెట్ మాయాజాలం అన్న మాట ములుకు లా గుచ్చుకొంటోంది. ఆ మార్కెట్ లేక పోతే ,
మాకు MJ ఎవరో తెలిసేదా?మా దాకా ఆ స్వరం చేరేదా? ఆ విద్యుత్ ప్రవహించేదా? ఇలా చూడండి. నిన్నటికి నిన్న... మా వూళ్ళో... మా వీధిమలుపులో... టౌన్ హాలు లో పిల్లవాడొకడు .. మెలికలు తిరుగుతూ.. మూన్ వాక్ చేస్తూ..నర్తిస్తూ .. బావురుమంటాడా..? ఎక్కడి వాడో ఎవరో .. తెలియని ఒక కళాకారుడి కి కన్నీళ్ళతో వీడ్కోలు చెబుతాడా? అసలు పాటేమిటో ఒక్క ముక్క అర్ధం కాకపోయినా ..చులాగ్గా నడకల్లో అడుగుల్లో అడుగులేస్తున్న..ఆ సంగీతానికి అర్ధం లేదంటారా..నాట్యానికి అవధుల్లేవంటారా..? నల్గొండ మారుమూలలోను, నెల్లురు నడివీధిలోనూ .. ఒకే భావోద్రేకతతో ..తడికన్నుల్తో.. వీడ్కోలు పలికింది .. ఇంతకీ ఎవరికన్నట్లు ? ఇంత వరకు విస్తరించిన ఆ ఏడు సముద్రాల అవతలి స్వరానికి మార్కెట్ అందించిన ఊతమెంత ? గుండెకోత ఎంత? సెలవు.
All rights reserved @writer. Title,labels,postings and related copyright reserved.

No comments:

Post a Comment