ప్రముఖంగా ఉండడం .. అందరికీ ..అన్ని విధాల అచ్చిరాదు. అదిగో చూడండి.. పాప్ మహరాజు మన కళ్ళ ముందే ...ఎలా కదిలి పోతూ ఉన్నాడో...! అతని గొంతు వినిపించని రాగాలేవో ఏవేవో.. మన చుట్టూ.మన లోలోను.
చటుక్కున గుర్తొచ్చాడు..క్రిస్టఫర్ మార్లో..దాక్టర్ ఫాస్టస్ గొంతులో గుస గుసలాడుతూ."success made me wanton!"అంటూ. ఎంత చిత్రం...!
తెలుసు.
మళ్ళీ మళ్ళీ అదే విషాదం.
పునహ్ పునహ్.
ఊహించని తీరాలలోకి ప్రయాణం. ఊపిరి తిప్పుకోలేక ఉక్కిరిబిక్కిరి కావడం.
కీర్తి .కాంక్ష.కనకం. అంతే లేనిదీ అనుభవం. మళ్ళీ మళ్ళీ.
మానవాళి కి మరుపురాని పాఠాలు గా రాలిపోయే వ్యధాభరిత జీవితాలు.
ఈ నడుమ .. ఆ కళాకారుని కళాత్మ ..పసితనపు అమాయకత్వం ఎటు పోయిందో...! కోట్లాది మంధి అభిమానం ఒక్క గుండెలో ప్రేమను ఎందుకు నింపలేక పోయిందో...! ఆ గొంతులో పాటను ఎందుకు పట్టి ఉంచలేక పోయిందో..! వద్దు .అసలిక ఆలోచించవద్దు.
పాట ఆట మాట..అన్నీ అన్నీ..మర్కెట్ న పడ్డాక..చివరికి మిగిలింది... ఘనమైన వీడ్కోలే..:( ఆకులందున అణిగి మణిగి . పాడనూ ఆడనూ ఎవరు సిద్ధమవుతున్నారు ??? అదుగో మరో మర్కెట్ పిలుపు.. మరో తార కు తెరతీయగరాదా.. ఒక తార నేల రాలి పోయిందిలే.. ఊహు.. నేల రాలినా నింగి కెగసినా.. ఒక అంతర్వేదనను రగిల్చి కాలంలో కలిసింది.
సెలవు.
All rights reserved @writer. Title,labels,postings and related copyright reserved.
kala - gurtimpu.
ReplyDeletegurtimpu (protsaaham kaaniandi lEda kirti/kanakam edaina) kalakaaruniki santosha pettagaladu. Naipunyaanni dwigunikrutamchEyagaladu, dabbu pattina pairuku eruvulaa.
kaani aa kalakaarudu gurtimpukosam praakulaadatE kalalOni sahajatwam nasistundi, kala kaasta vikalam avutundi, motaadu minchina eruvula.
kala puttukaku gurtimpu avasaramlEdu, vruddhiki dohadam chEstundi kaani gurtimpE tana pramartham anukunTE kala nasistundi.
Being Famous is demanding unless one has a strong character.
Just to add..culture does contribute to character building, very much noticeable between western singers like mike Johnson, britney spears and the eastern greats like pattammal or gangubai hengal!!
సత్యాన్వేషి గారు,
ReplyDeleteమీ డబ్బు.. ఎరువు ... ఉపమానం !
బావుంది.
అరువు ఎరువు తెచ్చే తిప్పలు ముప్పులు మనకు తెలియనివి కావు.
అలాగే, అనవసరపు ఎరువు చివరకు పంటకే ఎసరు... అన్నదీ మనకు తెలుసు.
ఏది ఏమైనా, తెలిసి తెలిసి ..మనం .. ఆ అడుసునే తొక్కుతుంటామే .. సరిగ్గా అదే మనం ఆలోచించ వలసినదీ..సరిగ్గా అక్కడే మనం నిలదొక్కుకోవలసినదీ.కదండీ?
ఏది ఏమైనా, అనామకంగా ఉండడంలో ఉన్నంత సుఖం ప్రముఖంగా ఉండడం లో లేదు..!
అన్నట్లు, ఇది సహజ సేద్యపు కాలం !ఎరువులు అరువులు మన లేవు..!
అవి లేని మనం లేము!
నమస్కారం.
అనామకంగా ఎందరమో ఉన్నాం. కానీ పనికొచ్చేదో పనికిరానిదో ఏదో ఒకటి "పెద్ద స్థాయి"లో చేస్తేనే ప్రముఖమయ్యేది. వాళ్ళు లేకపోతే ప్రపంచం "సామాన్యం" అయిపోదూ!
ReplyDeleteమన సాధారణ ప్రపంచాన్ని ఆసాధారణం చెయ్యడానికి ఎవరో ఒకరు తమ సామాన్యతని ధారబొయ్యాలి.తప్పదు.